Hotel Style Sambar for Idli: ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫెన్స్‌కి పల్లీ చట్నీ కంపల్సరీగా ఉండాల్సిందే. కేవలం ఈ చట్నీ మాత్రమే కాదు సాంబార్ కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా హోటల్స్, రోడ్ సైడ్ బండి మీద అమ్మే సాంబార్ కోసమే టిఫెన్ తినేవారు చాలా మంది ఉంటారు. అయితే సేమ్ హోటల్స్‌లో చేసిన టేస్ట్ ఇంట్లో రావాలని మెజార్టీ పీపుల్ ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటారు.
అలాంటివారు ఓసారి ఈ పద్ధతిలో చేయండి. సేమ్ టూ సేమ్ హోటల్ టేస్ట్ వస్తుంది. టిఫెన్స్లోకి తినడమే కాదు తాగేస్తారు కూడా. పైగా ఈ సాంబార్ చేయడానికి కందిపప్పు, చింతపండు కూడా అవసరం లేదు. మరి, లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- పండిన టమాటాలు - 2
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 1
- పసుపు - పావు టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- శనగపిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఎండుమిర్చి - 3
- ఇంగువ - పావు టీ స్పూన్
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 5
- మిరియాలు- 7
- సాంబార్ పౌడర్ - 2 టీ స్పూన్లు
- వాటర్ - 300ml
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నెయ్యి - అర టీ స్పూన్
తయారీ విధానం:
- టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి.
- ప్రెషర్ కుక్కర్లోకి కట్ చేసిన కూరగాయ ముక్కలు వేయాలి. ఆ తర్వాత అందులోకి ఉప్పు, పసుపు వేసి కలిపి గ్లాసున్నర(ముక్కలు మునిగేవరకు) నీళ్లు పోసి మూతె పెట్టి విజిల్ సెట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి లైట్‌గా స్మాష్ చేసుకుని పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టి శనగపిండి వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి.
- అదే స్టవ్ మీద మరో పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు వేసి ఈ తాలింపును లైట్‌గా ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా మిశ్రమం వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసిన శనగపిండిలో అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- ఈ శనగపిండిని తాలింపు మిశ్రమంలో పోసి బాగా కలిపి సాంబార్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 300ml వాటర్ పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో సుమారు 8 నిమిషాలు మగ్గించాలి.
- ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలపాలి. చివరగా నెయ్యి వేసి కలిపి ఓ రెండు నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఇడ్లీ, వడలతో కలిపి సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండే టిఫెన్ సెంటర్ సాంబార్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- కందిపప్పు, చింతపండు లేకుండానే రుచికరమైన సాంబార్ రెడీ చేసుకోవచ్చు.
- శనగపిండిని దోరగా, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ మారితే సాంబార్ రుచి మారుతుంది.
- మీరు తినే చిక్కదనానికి అనుగుణంగా నీళ్లు పోసుకోవాలి. పల్చగా కావాలంటే ఎక్కువ నీళ్లు, చిక్కగా కావాలంటే తక్కువ నీళ్లు పోసుకోవాలి.
బొప్పాయిని నేరుగా తినడమే కాదు - ఇలా "లడ్డూలు" చేసుకోండి! - ఒకటి తింటే వాటి ప్రేమలో పడిపోవాల్సిందే!