ETV Bharat / offbeat

ఆల్​ ఇన్​ వన్​ "మసాలా పొడి" - ఇది ఒక్కటి చేసుకుంటే బిర్యానీ, పులావ్​, వెజ్​, నాన్​వెజ్​ వంటకాలకు పర్ఫెక్ట్​! - HOMEMADE MASALA POWDER RECIPE

- మార్కెట్లో కొనే పని లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన మసాలా పౌడర్​! - ఒక్కసారి ప్రిపేర్​ చేసుకుంటే 2 నెలలు నిల్వ!

Homemade Masala Powder Recipe
Homemade Masala Powder Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2025 at 12:38 PM IST

4 Min Read

Homemade Masala Powder Recipe: అన్నం పుష్టిగా, కడుపునిండా తినాలంటే కూర రుచి అమోఘంగా ఉండాలి. కూర అలా ఉండాలంటే అందులోకి సరిపడా కారం, ఉప్పు, మసాలాలు తగినన్ని వేయాలి. వెజ్​ కూరలు ఎలా ఉన్నా, నాన్​వెజ్​ వంటకాలకు సరిపడా మసాలా ఉంటేనే ఆ వాసన, రుచి. ఈ క్రమంలోనే చాలా మంది వంటకాలకు తగ్గట్టు మసాలా పొడిని మార్కెట్​ నుంచి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇలా ఒక్కో వంటకానికి ఒక్కో పొడి కాకుండా, అన్నింటికీ సరిపోయేలా ఒకే పొడిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని ఒక్కసారి చేసుకుంటే సుమారు 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. పైగా ఈ మసాలా పొడిని పులావ్​, బగారా, బిర్యానీ, వెజ్​, నాన్​వెజ్​ వంటకాలు ఇలా ఎందులోకైనా ఉపయోగించవచ్చు. మరి లేట్​ చేయకుండా ఇంట్లోనే ఈ మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • ధనియాలు - 2 కప్పులు(130 గ్రాములు)
  • జీలకర్ర - పావు కప్పు(30 గ్రాములు)
  • రాతి పువ్వు - 1 గ్రాము
  • యాలకులు - 3 టేబుల్​స్పూన్లు(10 గ్రాములు)
  • 1 టేబుల్​స్పూన్​ - లవంగాలు
  • నల్ల యాలకులు - 1 టేబుల్​స్పూన్​
  • మిరియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • తోక మిరియాలు - 1 టీస్పూన్​
  • దాల్చినచెక్క - 7 గ్రాములు
  • సోంపు - 2 టేబుల్​స్పూన్లు
  • అనాసపువ్వు రేకులు - 2 టేబుల్​స్పూన్లు
  • జాపత్రి - కొద్దిగా
  • జాజికాయ ముక్క - ఇంచ్​
  • మరాఠీ మొగ్గ - 1
  • బిర్యానీ ఆకులు - 3
  • కసూరీ మేతీ - 2 టేబుల్​స్పూన్లు
  • ఎండు గులాబీ రేకులు - 2 టేబుల్​స్పూన్లు
  • ఎండుకొబ్బరి పొడి - ముప్పావు కప్పు - 50 గ్రాములు

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి ధనియాలు వేసి లో ఫ్లేమ్​లో కలుపుతూ వేయించాలి.
  • ధనియాలు వేగి కాస్త రంగు మారిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఓ ప్లేట్​లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు అదే పాన్​లోకి జీలకర్ర, రాతి పువ్వు, యాలకులు, లవంగాలు, నల్ల యాలకులు, మిరియాలు, తోక మిరియాలు, దాల్చినచెక్క, సోంపు, అనాస పువ్వు రేకులు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, బిర్యాని ఆకులు వేసి స్టవ్​ ఆన్​ చేయాలి. ముందే స్టవ్​ ఆన్​ చేసి వేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది.
  • వీటన్నింటిని కలపుతూ లో ఫ్లేమ్​లో మగ్గించాలి. ఇవి వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు చివర్లో కసూరీ మేతీ, ఎండిన గులాబీ రేకులు వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
  • ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఓప్లేట్​లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అదే పాన్​లోకి ఎండు కొబ్బరి పొడి వేసి లో ఫ్లేమ్​లో గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు వేయించాలి. కొబ్బరి పొడి వేగిన తర్వాత స్టవ్​ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాలి.
  • మిక్సీజార్​లోకి చల్లారిన ధనియాలు, మసాలా దినుసులు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడి సగం తీసుకుని వేయించి చల్లార్చుకున్న కొబ్బరి పొడిలో వేసి కలుపుకోవాలి. ఈ పొడిని చల్లారిన తర్వాత తడి, పొడి లేని గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే సరి.
  • అలాగే మిగిలిన సగం మసాలా పొడిని కూడా మరో గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఇంట్లోనే నేచురల్​ మసాలా పొడి రెడీ.
  • ఇలా కొబ్బరి, మసాలా పొడి కలిపిన మిశ్రమాన్ని చికెన్​, మటన్​ సహా నాన్​వెజ్​, వెజ్​ కూరల్లోకి వేసుకోవచ్చు.
  • కొబ్బరి పొడి కలపకుండా స్టోర్​ చేసుకున్న మసాలా పొడిని బిర్యానీ, పులావ్​, బగారా వంటి రైస్​ వంటల్లోకి వాడుకోవచ్చు. మరి నచ్చితే మీరూ ఓసారి ఈ మసాలా ప్రిపేర్​ చేసుకుని ఉంచుకోండి.

చిట్కాలు:

  • ఈ మసాలా పొడి కోసం ఉపయోగించే పదార్థాలన్నింటినీ కేవలం లో ఫ్లేమ్​లో మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే అవి లోపలి వరకు వేగి మంచి వాసన వచ్చి మసాలా రుచి ఘాటుగా ఉంటుంది.
  • ఈ పదార్థాలను గ్రైండ్​ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. లేదంటే వేడి మీద స్టోర్​ చేసినప్పుడు లోపల తేమ ఏర్పడి పొడి పాడయ్యే అవకాశం ఉంటుంది.
  • ఈ పొడి కోసం ధనియాలను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి మసాలా పొడిని కొంచెం ఎక్కువ వేసుకున్నా పెద్దగా ప్రాబ్లం ఉండదు.
  • బగారా, బిర్యానీ వంటి రైస్​లకు కొబ్బరి పొడి కలపని పొడిని సుమారు 2 నుంచి 3 టేబుల్​స్పూన్ల వరకు వాడుకోవచ్చు. అదే చికెన్​, మటన్ సహా ఇతర నాన్​వెజ్​ వంటకాలను కొబ్బరిపొడి కలిపిన మసాలాను 4 టేబుల్​స్పూన్ల వరకు ఉపయోగించవచ్చు. అదే వెజ్​ కూరలకు అయితే మీరు వండే క్వాంటిటీని బట్టి 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు వాడొచ్చు.​
  • ఈ పొడిని ఎక్కువ రోజులు అంటే 2 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. కానీ దీనిని ఫ్రిజ్​లో స్టోర్​ చేసుకోవాలి. అప్పుడే మసాలా పొడి తాజాగా ఉండటంతో పాటు వంటలకు రుచిని అందిస్తుంది.

కూరల్లో చక్కటి గ్రేవీ కోసం ఇంట్లోనే "పౌడర్​"! - ఇది ఒక్క చెంచా చాలు - గ్రేవీతోపాటు సూపర్ టేస్టీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.