Idli PreMix : చాలా ఇళ్లలో ఉదయపు టిఫెన్‌గా ఇడ్లీ ఉంటుంది. హెల్త్ కోసం చాలా మంది దీన్ని తింటారు. అయితే, ఇడ్లీ తయారు చేసుకోవాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. పప్పు నానబెట్టడం నుంచి రుబ్బడం వరకు చాలా పని ఉంటుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంత టైమ్ ఉండదు. దీంతో ఇబ్బంది పడుతుంటారు.

ఇలాంటి వాళ్ల కోసం ఓ సూపర్ మెథడ్ తీసుకొచ్చాం. మేం చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ఇడ్లీ ప్రీమిక్స్ తయారు చేసుకున్నారంటే చాలు. పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా రుబ్బాల్సిన పని లేదు. జస్ట్ నీళ్లు పిండిలో నీళ్లు పోసుకంటే సరి. పొద్దున్నే వేడివేడిగా ఇడ్లీ వేసుకోవచ్చు. మరి, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- 2 కప్పుల ఇడ్లీ రవ్వ
- 1 కప్పు మినపగుండ్లు
- 1 కప్పు అటుకులు
- రుచికి సరిపడా ఉప్పు
రోజంతా ఉత్సాహాన్నిచ్చే "కొర్రల పొంగలి" - లంచ్ తర్వాత నిద్ర ముంచుకొస్తుంటే ఇది ట్రై చేయండి!
తయారీ పద్ధతి :

- స్టవ్‌పైన పాన్ పెట్టుకొని మినపగుండ్లు వేసి ఫ్రై చేయాలి. సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. స్టౌ లో-ఫ్లేమ్‌లో ఉండాలని గుర్తుంచుకోండి.
- వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
- చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.
- ఈ పిండి చాలా మెత్తగా ఉండాలి. అందుకోసం జల్లించుకోండి. పైన రవ్వలాగా మిగిలితే మళ్లీ మిక్సీ పట్టుకోండి.
- గ్రైండ్ చేసుకున్న మినప పిండిని బౌల్లోకి తీసుకోండి.
- ఇప్పుడు మిక్సీలో అటుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకుల పొడిని కూడా మినప పిండిలో కలపండి.
- ఇడ్లీ రవ్వ, ఉప్పు కూడా అందులోవేసి పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతే ఈజీగా ఇడ్లీ ప్రీమిక్స్ రెడీ అయిపోతుంది.
- ఈ పౌడర్‌ను గాలి చొరబడని, తడిలేని డబ్బాలో స్టోర్ చేసుకోండి. దాదాపు రెండు నెలలు వరకు నిల్వ ఉంటుంది.
- ఈ ప్రీమిక్స్లో కావాల్సినంత తీసుకొని అందులో రాత్రి పులియబెట్టుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత మూతపెడితే సరి.
- తెల్లవారే సరికి చక్కగా పులిసిపోయి ఇడ్లీ పిండి సిద్ధమైపోతుంది.
- ఉదయాన్నే లేవడం ఇడ్లీలు వేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటాయి.

అప్పటికప్పుడు కావాలంటే :
- రాత్రి నానబెట్టడం మరిచిపోయినా, లేదంటే ఉన్నట్టుండి ఇడ్లీ తినాలని అనిపించినా, ఈ ప్రీ మిక్స్‌తో ఇన్స్టంట్ ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు.
- దీనికోసం కావాల్సినంత పిండి తీసుకొని, అందులో కప్పు నీళ్లు, కప్పు పెరుగు, కాస్త వంటసోడా వేసి చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
- ఇడ్లీలు వేసుకొని హాయిగా లాగించేయొచ్చు.
- అయితే రాత్రి పులియబెట్టిన పిండితో ఇడ్లీలు మరింత టేస్టీగా ఉంటాయని గుర్తు పెట్టుకోండి.
ఉప్మా చేసినంత ఈజీగా "బెల్లం రవ్వ కేసరి" - ఈ టిప్స్‌తో చేస్తే కమ్మగా ఎంతో బాగుంటుంది!