ETV Bharat / offbeat

రెస్టారెంట్ స్టైల్ "చికెన్ మెజెస్టిక్" ఇంట్లోనే! - తిన్నారంటే ఫిదా అయిపోతారు!

- చికెన్​తో నోరూరించే స్నాక్ రెసిపీ - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

Homemade Chicken Majestic Recipe
Chicken Majestic Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : September 15, 2025 at 6:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Homemade Chicken Majestic Recipe : పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈవెనింగ్ టైమ్​లో రుచికరమైన స్నాక్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. అందులోనూ నాన్​వెజ్ స్నాక్స్ అంటే లొట్టలేసుకుంటూ మరీ తింటారు. అయితే, మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారా? అలాంటి వారికోసమే ఈ సూపర్ స్నాక్ రెసిపీ. అదే, నోరూరించే "చికెన్ మెజెస్టిక్". ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది. రెస్టారెంట్ రుచికి ఏమాత్రం తీసుపోకుండా భలే కమ్మగా కుదురుతుంది. పైగా ప్రిపరేషన్ కూడా చాలా సులువే! మరి, చల్లటి వాతావరణంలో వేడివేడిగా నోరూరించే ఈ హోం మేడ్ చికెన్ మెజెస్టిక్ స్నాక్​ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Chicken Majestic Recipe
Chicken (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

మారినేషన్‌ కోసం :

  • అరకేజీ - బోన్​లెస్ చికెన్
  • అర చెంచా - మిరియాలపొడి
  • అర చెంచా - గరంమసాలా
  • ఒక చెంచా - అల్లంవెల్లుల్లి పేస్ట్
  • పావుకప్పు - కార్న్​ఫ్లోర్
  • ఒక చెంచా - మైదా
  • ఒకటి - గుడ్డు
  • ఉప్పు, పసుపు - తగినంత
  • వేయించేందుకు సరిపడా - నూనె
Chicken Majestic Recipe
Corn Flour (Getty Images)

స్పైస్‌మిక్స్‌ కోసం :

  • ఒక కప్పు - గిలకొట్టిన పెరుగు
  • ఒక చెంచా - కార్న్​ఫ్లోర్
  • అర చెంచా - కారం
  • కొద్దిగా - పసుపు
  • రెండు చెంచాలు - ధనియాల పొడి
  • ఒక చెంచా - జీలకర్ర పొడి
  • అర చెంచా - గరంమసాలా
  • పావు చెంచా - మిరియాలపొడి
  • రుచికి తగినంత - ఉప్పు
Chicken Majestic Recipe
Pepper (Getty Images)

సాస్‌ కోసం :

  • వెల్లుల్లి తరుగు - పావు కప్పు
  • కరివేపాకు - మూడు రెమ్మలు
  • పచ్చిమిర్చి - నాలుగైదు
  • ఉల్లికాడల తరుగు - చెంచాన్నర
  • కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు
  • సోయాసాస్ - రెండు చెంచాలు

కారప్పూసతో నోరూరించే "టమాటర్ సబ్జీ" - దాబా స్టైల్​లో ఘుమఘుమలాడిపోద్ది!

Chicken Majestic Recipe
Curd (Getty Images)

తయారీ విధానం :

  • నోరూరించే హోం మేడ్ చికెన్ మెజెస్టిక్ స్నాక్ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో చికెన్​ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా చూసుకోవాలి. తర్వాత చికెన్​ మెజెస్టిక్​కు కావాల్సిన షేప్​లో పొడుగ్గా, సన్నగా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్​ తీసుకుని అందులో పొడుగ్గా కట్ చేసుకున్న సన్నని చికెన్ ముక్కలు, మిరియాల పొడి, గరంమసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, కార్న్​ఫ్లోర్, మైదా, ఉప్పు, పసుపు వేసుకోవాలి.
  • అలాగే, కోడిగుడ్డును పగులగొట్టి పోసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి పక్కనుంచాలి.
Chicken Majestic Recipe
Mirchi (Getty Images)
  • ఇప్పుడు రెసిపీలోకి అవసరమైన స్పైస్ మిక్స్​ను రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్​లో పెరుగు, కార్న్​ఫ్లోర్, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, మిరియాలపొడి గరంమసాలా ఇలా అన్నింటిని వేసుకుని మిశ్రమం మొత్తాన్ని ఉండల్లేకుండా బాగా కలిపి రెడీగా పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మారినేట్‌ చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ ముక్కలను కొద్దికొద్దిగా వేసుకుంటూ దోరగా వేయించుకుని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • తర్వాత చికెన్ ముక్కలు వేయించుకున్న నూనెలో రెండు చెంచాల వరకు కడాయిలో ఉంచి మిగిలిన ఆయిల్​ను ఏదైనా స్టీల్ డబ్బాలోకి తీసుకోవాలి.

సూపర్ టేస్టీ "మొక్కజొన్న ఇడ్లీలు" - అప్పటికప్పుడు తక్కువ పదార్థాలతో రెడీ!

Chicken Majestic Recipe
Garlic (Getty Images)
  • ఇప్పుడు కడాయిలో ఉన్న వేడెక్కిన నూనెలో సన్నని వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వాటిల్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి.
  • అవి మంచిగా వేగిన తర్వాత ముందుగా పెరుగుతో తయారు చేసి పెట్టుకున్న స్పైస్​మిక్స్​ను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
Chicken Majestic Recipe
Kothimeera (ETV Abhiruchi)
  • ఆ మిశ్రమం మంచిగా మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఉల్లికాడల తరుగు, కొత్తిమీర తరుగు, సోయాసాస్ యాడ్ చేసుకుని బాగా కలిపి మరికాసేపు మగ్గించాలి.
  • అది చక్కగా కుక్ అయి దగ్గరకు వచ్చాక అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల మిశ్రమాన్ని వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, రెస్టారెంట్ స్టైల్​లో నోరూరించే "చికెన్ మెజెస్టిక్" రెడీ అవుతుంది!

మరమరాలతో "గుంత పొంగనాలు" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - ఇడ్లీ, దోశ పిండితో పనిలేదు!