రాగిపిండి, బెల్లంతో సూపర్ టేస్టీ "కేక్" - ఓవెన్‌తో పని లేకుండా నిమిషాల్లోనే రెడీ!
- మైదా, ఎగ్స్, పంచదార అవసరం లేదు - పిల్లలకు నచ్చేలా పసందైన 'కేక్' రెసిపీ!

Published : September 8, 2025 at 10:36 AM IST
Homemade Cake Recipe : "కేక్" బేకరీ ఐటమ్స్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే వాటిల్లో ఒకటి. ముఖ్యంగా చిన్నపిల్లలైతే అలా బయటకు వెళ్లినప్పుడు బేకరీ కనిపిస్తే చాలు కేక్ ఇప్పించమని మారాం చేస్తుంటారు. కానీ, బయట దొరికే వాటిల్లో వాడే పదార్థాల వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంట్లో కేక్ ప్రిపేర్ చేద్దామంటే అది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్‌గా భావిస్తుంటారు చాలా మంది.
కానీ, మీకు తెలుసా? ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతో సులభంగా, హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ కేక్ రెసిపీ ఉంది. అదే, రాగిపిండి బెల్లంతో నోరూరించే "కేక్". ఈ రెసిపీ కోసం ఓవెన్ కూడా అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఎవరైనా అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా తయారవుతుంది. బిగినర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది రెడీ చేసుకోవచ్చు. మంచి రుచికరంగా ఉండే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఒంటికి మంచి చేసే ఈ పసందైన కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - రాగిపిండి
- అరకప్పు - గోధుమపిండి
- అరకప్పు - బెల్లం తురుము
- పావుకప్పు - పాలు
- అరకప్పు - నూనె లేదా నెయ్యి
- అర చెంచా - బేకింగ్ సోడా
- రెండు చెంచాలు - పెరుగు
- పావుకప్పు - కోకోపౌడర్
- చిటికెడు - ఉప్పు
- ఒక చెంచా - వెనీలా ఎసెన్స్
- ఒక చెంచా - బేకింగ్ పౌడర్
గణేశ్ నవరాత్రుల్లో కొబ్బరి చిప్పలు మిగిలాయా? - నోరూరించే "తపాలా చెక్కలు" చేసేయండి!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ కేక్ తయారీ కోసం ఒక బేషన్ లేదా మిక్సింగ్ బౌల్లో రాగిపిండిని జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత అందులో గోధుమపిండి, పెరుగు, పాలు, బెల్లం తురుము, బేకింగ్ పౌడర్, వంటసోడా వేసుకోవాలి.
- అలాగే, కోకోపౌడర్, వెనీలా ఎసెన్స్, నెయ్యి వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలా బాగా గిలకొట్టి(కలిపి) పక్కనుంచాలి.
- అనంతరం కేక్ పాన్ లేదా అడుగున ఈక్వల్‌గా ఉన్న గిన్నెను తీసుకుని కొద్దిగా నూనె రాసుకుని పొడి పిండిని చల్లాలి. లేదంటే బటర్ పేపర్ వేసుకోవాలి.
కరకరలాడే "ఉల్లిపాయ చేగోడీలు" - నిమిషాల్లోనే రెడీ! - పిల్లలైతే ఇష్టంగా తింటారు!

- తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసి అంతా సమానంగా సర్దుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద మరో వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దాని అడుగున ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి స్టాండ్ పెట్టి వేడి చేసుకోవాలి.
- అది వేడయ్యాక దానిపై ఈక్వల్‌గా సెట్ చేసి పెట్టుకున్న రాగిపిండి కేక్ పాన్ లేదా గిన్నెను ఉంచి 20 నిమిషాల పాటు ఆవిరి మీద కుక్ చేసుకోవాలి.
- ఆ మిశ్రమం చక్కగా కుక్ అయిందనుకున్నాక మూత తీసి బయటకు తీసుకోవాలి.
- తర్వాత దాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. అంతే, రాగిపిండి బెల్లంతో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "కేక్" రెడీ అవుతుంది!

చిట్కాలు :
- కేక్ పాన్‌లో రాగిపిండి మిశ్రమాన్ని నింపుకోవడానికి ముందుగా దానిలో కొద్దిగా పొడి పిండిని చల్లుకోవాలి. ఇలా చేయడం ద్వారా కేక్ టిన్నుకు అంటుకోకుండా ఈజీగా వస్తుంది.
- కేక్ మిశ్రమం మంచిగా బేక్ అయిందని ఎలా తెలుసుకోవాలంటే, కుక్ చేశాక మూత తీసి టూత్‌పిక్‌ను కేక్‌లో గుచ్చి తీస్తే దానికి ఆ మిశ్రమం అంటుకోకుండా రావాలి.
- ఓవెన్ ఉన్నవారు ఈ కేక్‌ని అందులోనూ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా సింపుల్‌గా రాగి కేక్‌ని తయారు చేసుకోవచ్చు.
కారప్పూసతో కరకరలాడే "తియ్యని లడ్డూలు" - ఐదు పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

