Home Cleaning Tips : మనం నిత్యం ఇంటిని క్లీన్ చేస్తున్నప్పటికీ కొన్ని వస్తువులను, ప్రదేశాలను మాత్రం అప్పుడప్పుడు మాత్రమే శుభ్రం చేస్తుంటాం. ఫలితంగా కార్పెట్, కంప్యూటర్ బోర్ట్, కిటికీల వంటివి దుమ్ము, ధూళి చేరి మురికిగా కనిపిస్తుంటాయి. పైగా వాటివల్ల మనకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే మనం ఉపయోగించే కొన్ని రకాల వస్తువులను మాత్రం నిర్ణీత వ్యవధిలో కచ్చితంగా శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. మరి తరచూ క్లీన్ చేయాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కంప్యూటర్ కీబోర్డ్ :
కంప్యూటర్ కీబోర్డ్‌పై టాయిలెట్ సీట్‌లో ఉండే దానికంటే 5 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందట. అయితే వీటిని ఎక్కువమంది దుమ్ము పట్టింది అనిపించినప్పుడు మాత్రమే శుభ్రం చేస్తుంటారు. ఇలా కాకుండా వారానికోసారి డిస్-ఇన్ఫెక్టెంట్ స్ప్రేతో కీబోర్డ్‌ను క్లీన్ చేయాలి. అలాగే మౌస్‌ని కూడా తరచూ శుభ్రపరచాలి.
టాయిలెట్, సింక్‌లు!
ప్రతి 2 నుంచి 3 వారాలకోసారి బాత్‌టబ్, షవర్‌ని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వాటిపై నాచు పేరుకొనే ఛాన్స్ ఉంటుంది. టాయిలెట్, సింక్‌లను మాత్రం వారానికోసారి కచ్చితంగా శుభ్రంగా కడగాలి.
కార్పెట్‌ను స్టీమింగ్ చేయాలి!
నార్మల్‌గా కార్పెట్‌ని అప్పుడప్పుడూ దులిపి ఎండలో వేసి మళ్లీ ఇంట్లో పరుస్తుంటాం. అయితే ఇలా చేయడంతో పాటు కనీసం నెలకోసారైనా దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్పెట్‌కు చాలా దుమ్ము అతుక్కొని ఉండిపోతుంది. ఫలితంగా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నారులున్నట్లయితే కార్పెట్ క్లీనింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ప్రతి 6 నెలలకోసారి కార్పెట్‌ను స్టీమింగ్ చేయాల్సి ఉంటుంది.
గుర్రాలు ఎందుకు పడుకోవు? - మీకు 'హార్స్ పవర్' అంటే తెలుసా?
గోడలు కూడా!
డైలీ ఇంట్లో ఫ్లోర్‌ను తుడుస్తున్నప్పటికీ గోడలను అప్పుడప్పుడూ మాత్రమే క్లీన్ చేస్తుంటాం. అయితే వాటిని కనీసం వారానికోసారైనా శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే వాటిపై డస్ట్ పేరుకుపోయి జిడ్డుగా తయారవుతాయి.
కిటికీలు :
ఇంట్లో ఏ పండగ సమయంలోనో, ప్రత్యేక సందర్భాల్లోనో తప్ప కిటికీలను శుభ్రం చేయాలనే ఆలోచనే చాలామందికి రాదు. అయితే వాటిని వారం నుంచి నెల రోజుల వ్యవధిలో కనీసం ఒకసారైనా క్లీన్ చేయడం మంచిది.

పరుపును ఇలా :
బెడ్‌పై పరిచిన పిల్లో కవర్లు, దుప్పట్లు, బెడ్‌షీట్లు వంటి వాటిని తరచూ క్లీన్ చేస్తున్నప్పటికీ పరుపుని శుభ్రం చేయాలనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోం. ఫలితంగా దాని నుంచి బ్యాడ్‌స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టే రెండు నెలలకోసారైనా పరుపును క్లీన్ చేయడం మంచిది. దీనికోసం పరుపుపై బేకింగ్ సోడాను చల్లి కొద్దిసేపు ఉంచాలి. అనంతరం వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.
బాత్ టవల్స్ :
చాలా మంది బాత్ టవల్స్‌ని వారం పది రోజులకోసారి ఉతుకుతుంటారు. ఈ క్రమంలో మన స్కిన్ పైన ఉన్న మృతకణాలు మిలియన్ల కొద్దీ టవల్‌పై చేరతాయి. వీటి కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా అది చర్మానికి హానికరంగా తయారవడంతో పాటు బ్యాడ్‌స్మెల్ కూడా వస్తుంది. అందుకే వాటిని మూడుసార్లు ఉపయోగించిన వెంటనే ఉతకాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే టవల్స్‌ని ఏదో మొక్కుబడిగా కాకుండా వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి మంచి డిటర్జెంట్‌తో ఉతకాలని చెబుతున్నారు.
పిల్లల షూ ఎలా క్లీన్ చేయాలి? - వాషింగ్ మిషన్‌లో వేయొచ్చా!
మీ 'పప్పీ'ని వదల్లేకున్నారా? - మీతో పాటే ట్రైన్లో తీసుకెళ్లొచ్చు!