Healthy Snack Recipe for Kids : పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. చిన్నారులు ఇంట్లోనే ఎక్కువకాలం గడపనున్నారు. ఫ్రెండ్స్‌తో ఆటపాటలు, సరదాలు, ఉల్లాసంగా గడిపే కార్యకలాపాల్లో మునిగితేలుతుంటారు. దాంతో త్వరగా అలసిపోతారు. ఈ క్రమంలోనే వారికి మంచి హెల్దీ స్నాక్స్ అందించాలి. అప్పుడే వారు హెల్దీగా, యాక్టివ్‌గా ఉంటారు. దీంతో చాలా మంది తల్లులకు హెల్దీగా పిల్లలకు ఏం చేసి పెట్టాలో తోచదు. అలాంటి వారికోసమే ఒక సింపుల్ అండ్ హెల్దీ "స్నాక్ రెసిపీ"ని తీసుకొచ్చాం. అది కూడా ప్రొటీన్ పుష్కలంగా ఉండే గుడ్డుతో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది. కాబట్టి, పిల్లలు ఎంతో ఇష్టంగా లాగిస్తారు. పైగా దీన్ని మ్యాగీ చేసుకున్నంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ కోసం కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- కోడిగుడ్లు - 3
- బాయిల్డ్ ఎగ్ - 1
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- చిన్న ఉల్లిపాయ - 1
- చిన్న సైజ్ క్యాప్సికం - 1
- ఉప్పు - చిటికెడు (రుచికి తగినంత)
- కారం - కొద్దిగా(పైన చల్లుకోవడానికి)
- టమాటా - 1
- చీజ్ స్లైసెస్ - కొన్ని
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
నాలుగే పదార్థాలతో బండ్ల మీద అమ్మే "పెసర పునుగులు" - ఇంట్లోనే క్రిస్పీగా, సూపర్ టేస్టీగా చేసుకోండి!

సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా :
- ఈ హెల్దీ స్నాక్ కోసం ముందుగా ఉల్లిపాయ, క్యాప్సికంను క్యూబ్స్ మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, టమాటాను గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్‌స్పూన్ నూనె వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
- అవి కొంచం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మరో నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
- ఇలా వాటిల్లోని కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

- అనంతరం అదే పాన్‌లో మరో టేబుల్‌స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దానిలో కోడిగుడ్లను పగులగొట్టి వేసుకోవాలి.
- ఆ తర్వాత యెల్లో పార్ట్ కూడా చక్కగా ఉడికేలా ఫోర్క్ చెంచాతో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆపై దాని మీద రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం చల్లుకోవాలి. అలాగే, ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సగం కూరగాయ ముక్కలను ఆమ్లెట్ మీద చక్కగా సర్దుకోవాలి.
- ఆ తర్వాత దాని మీద ఒక ఉడికించిన గుడ్డును గ్రేటర్‌తో సన్నగా తురిమి వేసుకోవాలి.
- అనంతరం చీజ్ స్లైసెస్ను అన్ని వైపులా వచ్చేలా వేసుకోవాలి. తర్వాత దాని మీద మిగిలిన కూరగాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి.

- ఆపై వాటిపై మరొక చిటికెడు ఉప్పు, కారం చల్లుకొని మూతపెట్టి లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడించుకోవాలి.
- ఎక్కువ స్పైసీనెస్ కోరుకునే ఈ సమయంలో కొన్ని సన్నని పచ్చిమిర్చి ముక్కలు లేదా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఉడికించుకోవచ్చు.
- చీజ్ మెల్ట్ అయ్యే లోపు ఆమ్లెట్ కూడా చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి, మరీ ఎక్కువ సేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు.
- ఆమ్లెట్ చక్కగా కుక్ అయ్యాక మూత తీసి ఆవిరి నీళ్లు అందులో పడకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "ఎగ్ స్నాక్ రెసిపీ" రెడీ!
- మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరు సాయంత్రం పూట ఈ స్నాక్ చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు.
- అయితే, దీన్ని మరీ ఎక్కువగా కుక్ చేసినా లేదా చల్లారిన తర్వాత తిన్నా గానీ రబ్బర్లా గట్టిగా అనిపిస్తుంది. కాబట్టి, ప్రిపేర్ చేసుకున్న వెంటనే వేడివేడిగా ముక్కలుగా చేసుకొని తింటే మంచి టేస్ట్‌ని ఆస్వాదిస్తారు.

టిప్స్ :
- ఇక్కడ బాయిల్డ్ ఎగ్‌ని మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవాలి. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ, అది వేసుకోవడం స్నాక్ రుచి పెరుగుతుంది.
- స్పైసీనెస్ ఎక్కువ కోరుకునే వారు చీజ్ స్లైసెస్ మీద కొన్ని పచ్చిమిర్చి ముక్కలు లేదా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు.
కరకరలాడే "శ్రీరంగం వడలు" - కమ్మగా ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీ ఫిదా!
3 ఉల్లిపాయలు, 5 నిమిషాలు - అప్పటికప్పుడు టేస్టీ టేస్టీ "వడలు" రెడీ!