ETV Bharat / offbeat

పాలకూరతో రొటీన్​ వంటలు వద్దు - ఓసారి ఇలా హెల్దీ "పూరీలు" చేయండి! - నూనె పీల్చకుండా పొంగుతాయి! - HEALTHY AND TASTY POORI RECIPE

పాలకూరతో పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - ఒక్కసారి ఇలా పూరీలు చేస్తే ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

Healthy and Tasty Poori Making Process
Poori (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 25, 2025 at 2:30 PM IST

3 Min Read

Healthy and Tasty Palak Poori : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఎక్కువగా పప్పు, ఇతర వంటకాల్లో వేసుకొని కర్రీలను ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఆకుకూరలతో ఎంత రుచికరమైన వంటలు చేసినప్పటికీ పిల్లలు వాటిని తినడానికి అంతగా ఇష్టపడరు. మరి, మీ పిల్లలూ ఇలాగే చేస్తున్నారా? అలాంటి వారికి ఇలా పాలకూరతో హెల్దీగా బ్రేక్​ఫాస్ట్ చేసి పెట్టండి. పైగా అది పూరీలు కాబట్టి ఏమాత్రం వద్దనకుండా లొట్టలేసుకుంటూ మరీ తింటారు. అంతేకాదు ఇవి సాఫ్ట్​గా, చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. అందులోకి సైడ్​ డిష్​గా ఆలూ మసాలా కర్రీ, పూరీ కర్రీ వంటివి చేసి పెట్టారంటే ఇంకా చెప్పాల్సిన పనే ఉండదు. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా లాగిస్తారంటే నమ్మండీ! మరి, పాలకూర పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పూరీ తయారీకి కొన్ని టిప్స్​ :

  • పూరీల కోసం పాలకూరను పెద్దపెద్ద ఆకులు ఉండే ముదురిది కాకుండా లేతది తీసుకోవాలి. అలాంటిదైతే టేస్ట్ కూడా బాగుంటుందని గుర్తుంచుకోవాలి.
  • పాలకూరను వేడినీటిలో వేసుకొని తీసుకోవడం ద్వారా పూరీలు పచ్చివాసన రాకుండా, చాలా రుచికరంగా వస్తాయి. అలాగని, మరీ ఎక్కువసేపు ఉంచితే అందులోని పోషకాలు నశిస్తాయి.
  • పూరీలు చక్క​గా రావాలంటే పిండిని పర్ఫెక్ట్​గా కలుపుకోవడం ముఖ్యం.
  • నూనె కాగిన తర్వాతనే పూరీలను వేయించుకోవాలి. లేదంటే పూరీలు మెత్తగా ఉండకుండా అప్పడాల మాదిరిగా గట్టిగా అయిపోతాయి.
PALAK POORI RECIPE
Wheat (Getty Images)

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • పాలకూర ఆకులు - 2 కప్పులు
  • అల్లం ముక్క - చిన్నది
  • పచ్చిమిర్చి - 2
  • గోధుమపిండి - 1 కప్పు
  • ఉప్పు - కొద్దిగా
  • వేయించిన జీలకర్ర పొడి - పావుటీస్పూన్
  • నూనె - వేయించడానికి తగినంత
Healthy and Tasty Poori Making
Spinach (Getty Images)

నూనె లేకుండానే పూరీలు పొంగుతాయి! - హెల్దీ టిఫెన్​ ఇలా ప్రిపేర్ చేసుకోండి!

తయారీ విధానమిలా :

  • ఈ రెసిపీ కోసం ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ఒక గిన్నెలో మూడు కప్పుల వరకు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి.
  • వాటర్ వేడెక్కి బాగా మరుగుతున్నప్పుడు అందులో కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఒకసారి కలిపి వెంటనే ప్లేట్​లోకి తీసుకొని చల్లార్చుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన పాలకూర, అల్లం, పచ్చిమిర్చి తుంపలు వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్​లో​(బేషన్​) గోధుమపిండి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలపాలి.
  • ఆపై గ్రైండ్ చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసుకొని పిండి మొత్తానికి పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • అనంతరం తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. వీలైతే ఒక టేబుల్​స్పూన్ నూనె వేసుకొని పిండిని మరీ గట్టిగా, లూజుగా కాకుండా మీడియం థిక్​నెస్​తో సాఫ్ట్​గా కలుపుకోవాలి.
Poori Making
Palak Puri at Home (ETV Bharat)
  • అలా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • ఆ తర్వాత మూత తీసి మరోసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు చపాతీ పీట, కర్రకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను ఉంచి పూరీ మాదిరిగా వత్తుకోవాలి. అది కూడా మరీ మందంగా, పలుచగా కాకుండా వత్తుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడిచేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని తీసుకుంటే సరి.
  • అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "పాలకూర పూరీలు" రెడీ అయిపోతాయి.
  • వీటిని ఆలూ మసాలా కర్రీ లేదా పూరీ కర్రీతో తిన్నారంటే ఆ టేస్ట్ జిందగీలో మర్చిపోలేరు! అంత గొప్పగా ఉంటుంది ఈ కాంబినేషన్.
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ కాంబినేషన్​లో పూరీలు చేసుకొని చూడండి.
Poori
Palak Poori (ETV Bharat)

మీ ఇంట్లో పూరీలు బెలూన్ల మాదిరి పొంగాలా? - పిండిలో ఈ రెండు పదార్థాలు కలిపితే సరి - నూనె అస్సలు పీల్చవు!

మధురమైన "స్వీట్​ పూరీలు" - ఇలా చేస్తే అద్భుతాన్ని ఆస్వాదిస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.