ETV Bharat / offbeat

"హెల్దీ కొర్రల పాయసం" -పిల్లలు స్వీట్ అడిగితే ఇలా కొత్తగా చేసి పెట్టండి! -ఎంతో కమ్మగా ఉంటుంది! - KORRALA PAYASAM

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రలతో కమ్మని పాయసం -ఇలా చేస్తే టేస్ట్​ అద్దిరిపోతుంది!

Healthy Korrala Payasam
Healthy Korrala Payasam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2025 at 11:47 AM IST

2 Min Read

Healthy Korrala Payasam in Telugu : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది ప్రజలు మిల్లెట్స్​ ఆహారం డైట్​లో భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలతో చేసిన ఆహారం తింటున్నారు. మిల్లెట్స్​లో కొర్రలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొర్రలు చూడడానికి చిన్నగా నలుసంత ఉంటాయి. కానీ వీటిలో ఎన్నో రకాల పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొర్రలను ఎప్పుడూ ఒకే రకంగా ఉడికించి తింటే బోర్​ కొడుతుంది. అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా కొర్రల పాయసం ట్రై చేయండి. టేస్ట్​ ఎంతో బాగుంటుంది. ఈ కొర్రల పాయసం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. బెల్లంతో చేసిన ఈ పాయసం పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. మరి సింపుల్​గా కొర్రల పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం.

హోటల్​ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏమీ లేదు! - పల్లీలను ఇలా చేసి చూడండి చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు!

foxtail millet
foxtail millet (Getty Images)

కొర్రల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • అర కప్పు - కొర్రలు
  • బెల్లం తరుగు - కప్పు
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు - 10
  • బాదం -10
  • కిస్ మిస్ - 15
  • అరటీస్పూన్ - యాలకుల పొడి
  • అరచిటికెడు - పచ్చకర్పూరం
  • పాలు - కప్పు
  • నీళ్లు - కప్పు
Korrala Payasam
Korrala Payasam (ETV Bharat)

కొర్రల పాయసం తయారీ విధానం

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లో అర కప్పు కొర్రలు తీసుకుని రెండు మూడు సార్లు నీటితో కడగండి. ఆపై అందులో సరిపడా వాటర్​ పోసి 4 గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ వెలిగించి పాన్​ పెట్టి కప్పు నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన కొర్రలు నీళ్లు వంపేసి తీసుకోండి.
  • స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్ చేసి కొర్రలు మెత్తగా ఉడికించుకోవాలి. కొర్రలు సాఫ్ట్​గా కుక్​ అవ్వడానికి 10-15 నిమిషాల టైమ్​ పడుతుంది. అంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
Jaggery
Jaggery (Getty Images)
  • ఈలోపు మరొక స్టవ్​పై కడాయి పెట్టి కప్పు పాలు పోసి మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన అనంతరం గిన్నె పక్కన పెట్టుకోండి.
  • కొర్రలు చక్కగా ఉడికిన తర్వాత వేడివేడి పాలు పోసి కలుపుతూ ఉడికించుకోవాలి.
  • పాయసం కాస్త దగ్గరగా అయ్యాక కప్పు బెల్లం తరుగు వేసి లో ఫ్లేమ్​లో కలుపుతూ ఉడికించుకోవాలి.
  • కొర్రల పాయసం చిక్కగా మారిన తర్వాత అరచిటికెడు పచ్చకర్పూరం చేతితో కాస్త నలిపి వేసి బాగా కలపండి.
Korrala Payasam
Korrala Payasam (ETV Bharat)
  • చివరిగా అరటీస్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్​ చేసి పాయసం పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి 2 టేబుల్​స్పూన్లు నెయ్యి వేసి కరిగించుకోవాలి.
  • వేడివేడి నెయ్యిలో కిస్​మిస్​, బాదం, జీడిపప్పు వేసి ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్​ చక్కగా వేగిన తర్వాత పాయసంలో వేసి బాగా కలపండి.
Korrala Payasam
Korrala Payasam (ETV Bharat)
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే కమ్మని కొర్రల పాయసం మీ ముందుంటుంది.
  • ఈ కొర్రల పాయసం వేడిగా తిన్నా, చల్లారిన తర్వాత తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది.
  • టేస్టీ అండ్​ హెల్దీ కొర్రల పాయసం తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ఇలా ప్రయత్నించండి.

క్యాటరింగ్ స్టైల్ "గోబీ 65" - స్పైసీ టేస్ట్​తో కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది!

కరకరలాడే "కొబ్బరి పాల అప్పాలు" - కారం లేకుండా ఇలా చేయండి - పిల్లలు ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.