ETV Bharat / offbeat

నవరత్నాల్లాంటి పోషకాలను అందించే హెల్దీ "లడ్డూ" - పిల్లలకు రోజుకొకటి ఇచ్చారంటే బలంగా తయారవుతారు! - NAVRATAN LADDU RECIPE

పోషకాలు దండిగా ఉండే నవరతన్ లడ్డూ - ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

Dry Fruit Laddu
Healthy Dry Fruit Laddu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 5, 2025 at 5:44 PM IST

5 Min Read

Healthy Dry Fruit Laddu Making Process : పిల్లలు ఎదిగే క్రమంలో వారికి మంచి పోషకాహారం చాలా అవసరం. అలాంటి ఆహారం అందించినప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. ఈ క్రమంలోనే చాలా మంది తల్లులు తమ పిల్లలకు ఎలాంటి ఫుడ్ చేసి పెడితే ఎక్కువ పోషకాలు అంది ఆరోగ్యవంతంగా, బలంగా తయారవుతారని ఆలోచిస్తుంటారు. మీరూ ఈ జాబితాలో ఉన్నారా? అయితే, మీకోసమే ఈ సూపర్ రెసిపీ. అదే, "నవరతన్ లడ్డూ".

నవరత్నాల లాంటి విలువైన పోషకాలు కలిగిన తొమ్మిది రకాల గింజలు, మరికొన్ని పదార్థాలతో కలిపి ప్రిపేర్ చేసే ఈ లడ్డూ శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇలా చేసి పిల్లలకు రోజుకొకటి ఇచ్చారంటే వారు బలంగా తయారవుతారంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీని తయారీకి వాడిన పదార్థాల్లో ఉండే పోషకాలు ఇమ్యూనిటీ, మెదడు పనితీరు, శారీరకంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఎంతగానో సహాయపడతాయి. మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Dry Fruit Laddu
Flax seeds (Getty Images)

టిప్స్ :

  • ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బయట మార్కెట్​లో దొరుకుతాయి. అలాగే, ఆన్​లైన్​లోనూ అందుబాటులో ఉంటాయి.
  • ఇక్కడ బాదం, జీడిపప్పు, వాల్​నట్స్, నువ్వులు, గుమ్మడి గింజలు, సన్​ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, అవిసె గింజలు, ఫూల్ మఖానా గింజలు ఈ తొమ్మిందిటిని "నవరతన్ గింజలు"గా చెప్పుకుంటారు. నవరత్నాల మాదిరిగా వీటిలో శరీరానికి కావాల్సిన విలువైన పోషకాలు ఉంటాయి.
  • ఎండుకొబ్బరి తురుము, గోంద్ పదార్థాలు లడ్డూలకు సరికొత్త రుచిని అందిస్తాయి. అలాగే, పండు ఖర్జూర ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే లడ్డూల టేస్ట్ బాగుంటుంది.
  • ఈ రెసిపీని వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే, మంచి రుచితో పాటు పర్ఫెక్ట్​గా కుదురుతుంది.
  • ఇక్కడ తాటి బెల్లం తీసుకుంటున్నాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లాన్ని లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే, గరిటెతో కొద్దిగా తీసుకొని చేతితో తాకి చూస్తే తీగలాగా రావాలి.
Dry Fruit Laddu Making Process
Almonds (Getty Images)

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • నెయ్యి - 3 టేబుల్​స్పూన్లు
  • బాదంపప్పు - అర కప్పు
  • జీడిపప్పు పలుకులు - అర కప్పు
  • వాల్​నట్స్ - పావు కప్పు
  • తెల్ల నువ్వులు - పావు కప్పు
  • గుమ్మడి గింజలు - పావు కప్పు
  • పుచ్చ గింజలు - పావు కప్పు
  • సన్​ఫ్లవర్ సీడ్స్ - పావు కప్పు
  • అవిసె గింజలు - పావు కప్పు
  • ఫూల్ మఖానా(తామరపువ్వు గింజలు) - ఒక కప్పు
  • గోంద్(ఎడిబల్ గమ్) - పావు కప్పు
  • ఎండుకొబ్బరి తురుము - అర కప్పు
  • పండు ఖర్జూర ముక్కలు - ఒక కప్పు
  • యాలకులు - 4
  • తాటి బెల్లం - 1 కప్పు

పాల్వంచ టిఫెన్ సెంటర్​​ "పల్లీ చట్నీ" - చట్నీ కోసమే అక్కడ టిఫెన్ తింటారు! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

Dry Fruit Laddu Making Process
Ghee (Getty Images)

తయారీ విధానమిలా :

  • ఇందుకోసం ముందుగా స్టౌ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని 1 టేబుల్​స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక బాదంపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి.
  • బాదంపప్పులు సగం వరకు వేగాక అందులో జీడిపప్పు పలుకులు, వాల్ నట్స్ వేసుకొని జీడిపప్పులు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని నెయ్యి రాకుండా ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో తెల్ల నువ్వులు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు(సన్​ఫ్లవర్ సీడ్స్) వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • అవన్నీ చక్కగా వేగి నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు చివర్లో అవిసె గింజలు వేసుకొని అన్నింటినీ మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని వీటిని ముందుగా వేయించుకున్న జీడిపప్పుల మిశ్రమంలో వేసేసుకొని అన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఆలోపు స్టౌపై మరో పాన్ పెట్టుకొని ఫూల్ మఖానాను వేసుకొని సన్నని సెగ మీద అవి క్రిస్పీగా మారే వరకు వేయించుకొని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద అదే పాన్ పెట్టుకొని 1 టేబుల్​స్పూన్ నెయ్యి వేసుకొని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత గోంద్ వేసుకొని అవి చక్కగా పొంగే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
  • ఆపై అదే పాన్​లో ఎండుకొబ్బరి తురుము వేసుకొని లైట్​గా కలర్ మారే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం అదే పాన్​లో మరో టేబుల్​స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఖర్జూర ముక్కలు వేసుకొని సన్నని సెగ మీద ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఎగ్ లేదు, ఓవెన్ అవసరమే లేదు - ఇంట్లోనే బేకరీ స్టైల్​ ప్లఫీ ప్లఫీ బ్రెడ్ - చాలా ఈజీగా!

Healthy Dry Fruit Laddu
Coconut (Getty Images)
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పక్కన పెట్టుకున్న గోంద్​, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో ముందుగా వేయించుకున్న నవరతన్ గింజలను సగం వరకు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం కోర్స్​గా గ్రైండ్ చేసుకున్న గింజల మిశ్రమాన్ని ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆపై మిగిలిన నవరత్న గింజలను మిక్సీజార్​లో ఉన్న మిశ్రమంలో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ పొడిని ఒక వెడల్పాటి ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • తర్వాత అదే మిక్సీ జార్​లో వేయించుకున్న ఖర్జూర ముక్కలు వేసి పల్స్​ మోడ్​లో మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆపై దాన్ని ముందుగా ప్లేట్​లోకి తీసుకున్న పొడిలో వేసుకోవాలి. అలాగే, పక్కకు తీసిపెట్టుకున్న కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న నవరత్న గింజల మిశ్రమం, వేయించి పక్కన పెట్టుకున్న ఎండుకొబ్బరి తురుము వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. పదార్థాలన్నీ చక్కగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కనుంచాలి.
Healthy Dry Fruit Laddu
sunflower seeds (Getty Images)
  • ఇప్పుడు స్టౌ మీద కాస్త పెద్ద గిన్నె పెట్టుకొని తాటి బెల్లం తురుము, పావు కప్పు వాటర్ పోసుకొని లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో పాకం చెక్ చేస్తుండాలి.
  • బెల్లం పూర్తిగా కరిగి లేత తీగ పాకం వచ్చాక స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు అందులో కలిపి పక్కన పెట్టుకున్న నట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
  • కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేతితో మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీకు కావాల్సిన పరిమాణంలో మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "నవరతన్ లడ్డూలు" రెడీ!
  • కమ్మగా, జ్యూసీగా ఉండే వీటిని పిల్లలతో పాటు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
Healthy Dry Fruit Laddu
Cashews (Getty Images)

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "పెసరపప్పు సున్నుండలు" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్భుతం!

శ్రీరామనవమి స్పెషల్​ "రవ్వ పాయసం" - ఈ కొలతలతో చేస్తే వెన్నలా కరిగిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.