ETV Bharat / offbeat

నూనె పీల్చని "సేమియా కరివేపాకు పకోడీ" - ఇలా చేస్తే కమ్మగా, కరకరలాడుతుంది!

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పకోడీ 'రెసిపీ' - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Healthy Snack Recipe for Kids
Snack Recipe for Kids (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : June 27, 2025 at 11:03 AM IST

3 Min Read
Choose ETV Bharat

Healthy Snack Recipe for Kids : వాతావరణం కూల్​​గా ఉన్నప్పుడు, చల్లని సాయంకాలం వేళ అలా టీ తాగుతూ పక్కన ఏదైనా వేడి వేడి స్నాక్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఊహ గుర్తుకు వస్తేనే నోరూరిపోతుంది కదా! అందులోనూ గరంగరం 'పకోడీలు' అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే చాలా మంది ఈవెనింగ్ టైమ్​లో ఎక్కువగా ఉల్లిపాయ పకోడీలను ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఎప్పుడూ అవే తినాలంటే కాస్త బోరింగ్​గా అనిపిస్తుంది. అందుకే, మీకోసం ఒక వైరెటీ రెసిపీని తీసుకొచ్చాం. అదే, కరకరలాడే "సేమియా కరివేపాకు పకోడీ". ఇలా పిండిని కలిపి వీటిని ప్రిపేర్ చేసుకున్నారంటే క్రిస్పీగా, సూపర్ టేస్టీగా వస్తాయి. అలాగే, నూనె కూడా తక్కువే పీల్చుకుంటాయి! పైగా కరివేపాకుతో చేసినవి కాబట్టి ఈ పకోడీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది! మరి, ఈ సూపర్ టేస్టీ కరకరలాడే పకోడీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Healthy Snack Recipe for Kids
Karivepaku (Getty Images)

తీసుకోవాల్సిన పదార్థాలు :

  • సేమియా - ఒక కప్పు
  • కరివేపాకు - గుప్పెడు
  • శనగపిండి - అర కప్పు
  • బియ్యప్పిండి - పావు కప్పు
  • ఉల్లిపాయలు - రెండు(చిన్నవి)
  • పచ్చిమిర్చి - నాలుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - తగినంత
  • జీలకర్ర - ఒకటీస్పూన్
  • పసుపు - పావుటీస్పూన్
  • నూనె - వేయించడానికి సరిపడా

ఇంట్లో చేసిన బజ్జీలు నూనె పీల్చుతున్నాయా? - ఓసారి ఇలా చేయండి - చుక్క ఆయిల్​ ఉండదు!

Semiya Karivepaku Pakodi
Semiya (Getty Images)

తయారీ విధానం :

  • ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్​లో సేమియా, తగినన్ని నీళ్లు పోసుకొని కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలా 90% వరకు ఉడికేలా కుక్ చేసుకోవాలి.
  • సేమియా ఉడికే లోపు రెసిపీలోకి కావాల్సిన కరివేపాకుని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే, ఉల్లిపాయలను సన్నగా, పొడుగ్గా, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు సేమియా చక్కగా ఉడికిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక గిన్నెపై స్టెయినర్​ ఉంచి వేడి నీటిని వడకట్టుకోవాలి.
  • తర్వాత ఆ వేడికి సేమియా మరింత మెత్తగా అయిపోకుండా వెంటనే దానిపై కొద్దిగా చల్లని నీటిని పోసి వడకట్టాలి.
  • ఆపై సేమియాలోని వాటర్ మొత్తం పోయి పూర్తిగా చల్లారి పొడిపొడిగా అయ్యాక ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
Semiya Karivepaku Pakodi
Semiya Karivepaku Pakodi (ETV Abhiruchi)
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, శనగపిండి, బియ్యప్పిండి, జీలకర్ర, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
  • తర్వాత అందులోనే ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు సేమియాలో ఉండే తేమకే అది మొత్తం చక్కగా కలిసిపోతుంది.
  • ఒకవేళ పిండి పొడిపొడిగా ఉన్నట్లు కనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. అయితే, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోవాలి.
Semiya Karivepaku Pakodi
Semiya Karivepaku Pakoda (ETV Abhiruchi)
  • ఇప్పుడు పకోడీ తయారీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చేతిలోకి కొద్దికొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో పకీడీలా వేసుకోవాలి.
  • ఆపై స్టవ్​ను మీడియం టూ హై ఫ్లేమ్​కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అయితే, పకోడీ వేయగానే వెంటనే కదపకుండా కాస్త కాలిన తర్వాత చిల్లుల గరిటెతో తిప్పుతూ రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, కరకరలాడే కమ్మని "సేమియా పకోడీ" రెడీ!
Semiya Karivepaku Pakodi
Semiya Karivepaku Pakoda (ETV Abhiruchi)

చిట్కాలు :

  • ఇక్కడ పిండిని తయారు చేసుకునేటప్పుడు మరీ జారుడుగా కాకుండా కాస్త గట్టిగానే ఉండేలా కలుపుకోవాలి.
  • ఈ రెసిపీలో కాస్త బియ్యప్పిండిని యాడ్ చేసుకోవడం ద్వారా పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది.
  • నూనె కాగిన తర్వాత మాత్రమే పకోడీ వేసి వేయించుకోవాలి. అలాగే, లో ఫ్లేమ్​లో వేయించుకున్నా ఇది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందని గుర్తుంచుకోవాలి.

రోడ్ సైడ్ బండి వాళ్లు "మసాలా వడలు" చేసే పద్ధతి ఇదే! - ఇలా చేస్తే నూనె పీల్చవు! - కమ్మగా, కరకరలాడుతాయి!

గ్యాస్ స్టవ్ నుంచి మంట తక్కువగా వస్తోందా? - ఈ "చిన్న ట్రిక్​'తో ప్రాబ్లమ్ సాల్వ్! - డబ్బులు ఆదా చేసుకోండి!