ETV Bharat / offbeat

పప్పు, రవ్వ లేకుండా పిల్లలకు నచ్చే "నూడుల్స్​ ఇడ్లీ" - చేయడం చాలా ఈజీ - వేడివేడిగా తింటే అదుర్స్​! - HEALTHY BREAKFAST NOODLES IDLI

-రెగ్యులర్​ ఇడ్లీలు తిని బోర్​ కొట్టిందా? -కప్పు బియ్యప్పిండితో ఓసారి ఇలా ట్రై చేయండి!

Healthy Breakfast Noodles Idli
Healthy Breakfast Noodles Idli (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 20, 2025 at 11:00 AM IST

2 Min Read

Healthy Breakfast Noodles Idli: బ్రేక్​ఫాస్ట్​లో వేడివేడి ఇడ్లీలను పల్లీ చట్నీతో తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. లైట్​గా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుండటంతో ఎక్కువ మంది వీటిని తినేందుకు ఇంట్రస్ట్​ చూపిస్తుంటారు. అయితే ఇడ్లీలు చేయాలంటే కాస్త కష్టపడాల్సిందే. ఎందుకంటే ముందురోజే పప్పు నానబెట్టి గ్రైండ్​ చేసి, రవ్వ కలిపి పక్కన ఉంచాలి. ఇదంతా చేయడానికి కాస్త టైమ్​ ఎక్కువ పడుతుంది. అలాగే ఎప్పుడూ ఒకే రకంగా ఇడ్లీలు చేసి పెడితే పిల్లలే కాదు పెద్దలూ తినడానికి ఆసక్తి చూపించరు. అందుకే ఓసారి వారికి నచ్చేలా నూడుల్స్​ ఇడ్లీ చేయండి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పైగా దీని కోసం పప్పులు నానబెట్టాల్సిన పనిలేదు. కేవలం బియ్యప్పిండితోనే చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా పిల్లలకు నచ్చేలా నూడుల్స్​ ఇడ్లీలు ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • నీరు - ఒకటింపావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - 1 టీస్పూన్​
  • బియ్యప్పిండి - 1 కప్పు
Noodles Idli
Noodles Idli (ETV Bharat)

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నీళ్లు పోసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, నూనె వేసి కలిపి మరిగించాలి.
  • వాటర్​ మరుగుతున్నప్పుడు పొడి బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి మూత పెట్టి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
Noodles Idli
Noodles Idli (ETV Bharat)
  • ఈలోపు ఇడ్లీ ప్లేట్స్​కు లైట్​గా ఆయిల్​ అప్లై చేసుకోవాలి. అలాగే మురుకుల గొట్టం లోపల భాగానా నూనె రాసి సన్న కారప్పూస చేయడానికి ఉపయోగించే అచ్చును సెట్​ చేసుకోవాలి.
  • బియ్యప్పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో వత్తుకుంటూ సాఫ్ట్​గా ముద్దలాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని మురుకుల గొట్టంలో పెట్టి క్లోజ్​ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్​ మీద రౌండ్​గా వత్తుకోవాలి(కింద ఫొటోలో చూపించినట్లుగా). ఇలా పిండి మొత్తాన్ని నూడుల్స్​గా వత్తుకోవాలి.
Noodles Idli
Noodles Idli (ETV Bharat)
  • స్టవ్​ ఆన్​ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో రెండు కప్పుల నీరు పోయాలి. ఆ నీటిలో ఇడ్లీ ప్లేట్స్​ ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో సుమారు 8 నుంచి 10 నిమిషాల పాటు కుక్​ చేసుకోవాలి.
  • ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఓ 5 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి ప్లేట్​లోకి వేసుకుని స్పైసీగా ఉండే చట్నీ లేదా నాన్​వెజ్​ లేదా వెజ్​ కర్రీతో సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ నూడుల్స్​ ఇడ్లీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Noodles Idli
Noodles Idli (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ రెసిపీ కోసం పొడి బియ్యప్పిండి వాడాలి. అలాగే బియ్యప్పిండిని మరీ ఉడికించాల్సిన అవసరం లేదు. కేవలం మరుగుతున్న నీటిలో వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేసి మూత పెట్టి చల్లారనిస్తే సరిపోతుంది. ఎందుకుంటే గిన్నె వేడికే పిండి ఉడుకుతుంది.
  • పిండిని ఇడ్లీ ప్లేట్స్​లోకి వత్తుకునేటప్పుడు మరీ మందంగా, మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి.

తప్పక తినాల్సిన పాతకాలం నాటి "తిమ్మనం" - నోట్లో వేసుకోగానే ఐస్​క్రీమ్​లా కరిగిపోతుంది!

పల్లీలు, చుక్క నూనె లేకుండానే - టిఫెన్స్​లోకి "సూపర్ చట్నీ"! - కేవలం 5 నిమిషాల్లో రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.