ETV Bharat / offbeat

హనుమంతుడికి "గుమ్మడి పూరీలు" - స్వామి జయంతికి అద్భుత ప్రసాదం! - అనాస పాయసం కూడా - HANUMAN JAYANTI SPECIAL RECIPES

ఏప్రిల్​ 12వ తేదీ శనివారం హనుమాన్​ జయంతి స్వామివారికి ఈ ఆహారాలను నైవేద్యంగా పెట్టండి!

Hanuman Jayanti Special Recipes
Hanuman Jayanti Special Recipes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 10, 2025 at 5:02 PM IST

3 Min Read

Hanuman Jayanti Special Recipes : హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో హనుమాన్​ జయంతి ఒకటి. ఏటా చైత్ర మాసం పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ఏడాది హనుమాన్​ జయంతి ఏప్రిల్​ 12న శనివారం వచ్చింది. ఇక ఆ రోజున ఆంజనేయుడికి చాలా మంది పాయసం, పరవన్నం చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అయితే ఎప్పుడూ అవే కాకుండా ఈసారికి సరికొత్తగా ప్రసాదాలు చేయండి. అందుకోసం మీకోసం రెండు రకాల రెసిపీలు తీసుకొచ్చాం. ఇవి రెండూ చాలా టేస్టీగా ఉంటాయి. పైగా ఈ రెసిపీలు ప్రిపేర్​ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి లేట్​ చేయకుండా ఆ ప్రసాదాలు ఎలా చేయాలో ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

గుమ్మడి పూరీలు:

Pumpkin Poori
Pumpkin Poori (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు:

  • గుమ్మడికాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు
  • నూనె - వేయించడానికి సరిపడా
  • గోధుమపిండి - 2 కప్పులు
  • బెల్లం - కప్పు
  • బియ్యప్పిండి - 2 టేబుల్‌స్పూన్లు
  • యాలకుల పొడి - చెంచా
  • జాజికాయ పొడి - చిటికెడు
  • గుమ్మడి గింజలు - ఒకటిన్నర చెంచా
Pumpkin
Pumpkin (Getty Images)

తయారీ విధానం:

  • గుమ్మడికాయను సగానికి కట్​ చేసుకుని దానిపై ఉండే పొట్టు, గింజలు తీసేయాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులో కొద్దిగా నీరు పోసుకోవాలి. ఆపై దాని మీద మూత ఉంచి గుమ్మడి ముక్కలు ఉంచాలి. ఆ ముక్కలపై మూత ఉంచి ఆవిరికి మెత్తగా ఉడికించుకోవాలి.
  • గుమ్మడి ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​లో వేసుకోవాలి. ఆపై అందులోకి బెల్లం తురుము వేసి మెత్తగా గ్రైండ్​ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి గోధుమపిండి, బియ్యప్పిండి, 2 చెంచాల నూనె, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి మిక్స్​ చేసుకోవాలి. ఒకవేళ నీళ్లు ఏమైనా అవసరమనుకుంటే కొద్దికొద్దిగా పోసుకుంటూ మెత్తగా కలిపి మూత పెట్టి సుమారు పావు గంట పక్కన ఉంచాలి.
  • పిండి నానిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద ఉండలు చేసుకోవాలి.
  • చపాతీ పీట మీద లైట్​గా నూనె అప్లై చేసి ఓ ఉండను ఉంచి పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఆ తర్వాత కుకీ కటర్‌ లేదా షార్ప్​గా ఉన్న డబ్బామూతతో నొక్కి చిన్న పూరీల్లా కట్‌చేసి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా పిండి మొత్తాన్ని పూరీల్లా చేసుకుని ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్​ కాగిన తర్వాత చేసుకున్న పూరీలను వేసుకుని బంగారు రంగు వచ్చే వరకూ రెండు వైపులా కాల్చుకోవాలి. అన్నీ అయ్యాక గుమ్మడి గింజలతో గార్నిష్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ గుమ్మడి పూరీలు రెడీ.
Pineapple Payasam
Pineapple Payasam (ETV Bharat)

అనాస పాయసం:

కావలసినవి:

  • గోధుమరవ్వ- 1 కప్పు
  • అనాసపండు ముక్కలు - 1 కప్పు
  • పెసరపప్పు - అర కప్పు
  • బెల్లంపొడి - 3 కప్పులు
  • కొబ్బరిపాలు - 7 కప్పులు
  • నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు - గుప్పెడు
  • ఎండుకొబ్బరి ముక్కలు - కొద్దిగా
  • కిస్‌మిస్‌ - పావు కప్పు
  • యాలకులు - 6
  • ఉప్పు - చిటికెడు
Pumpkin Poori
Pumpkin Poori (ETV Bharat)

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్‌లను వేయించి పక్కనుంచాలి.
  • అదే పాన్​లో గోధుమరవ్వ, పెసరపప్పులను విడివిడిగా వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • గోధుమ రవ్వ, పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత కడిగి ప్రెషర్​ కుక్కర్​లో వేసుకోవాలి. ఆపై అందులోకి అనాస ముక్కలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి 2 లేదా మూడు విజిల్స్​ వచ్చేవరకు అంటే మెత్తగా ఉడికే వరకు కుక్​ చేసుకోవాలి.
  • మరో స్టవ్​ మీద గిన్నె పెట్టి అందులోకి బెల్లం, నీళ్లు వేసి కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి వడకట్టి పక్కన ఉంచాలి.
  • కుక్కర్​ విజిల్స్​ వచ్చిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారనివ్వాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఓ సారి కలిపి పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి వెడల్పాటి పాత్ర పెట్టి అందులోకి ఉడికించిన రవ్వ మిశ్రమం, బెల్లం పాకం, దంచిన యాలకులు వేసి మీడియం ఫ్లేమ్​లో కలుపుతూ ఉడికించాలి.
  • ఐదు నిమిషాల తర్వాత కొబ్బరిపాలు, మిగిలిన నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ జోడించి సన్నసెగ మీద ఉడికించాలి.
  • మధ్యలో కలపుతూ చిక్కగా అయ్యేవరకు ఉడికించి దించేస్తే రుచికరమైన అనాస పాయసం సిద్ధమైపోతుంది. ఈ రెండు ప్రసాదాలను స్వామికి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులు ఆరగిస్తే సరి.

హనుమాన్​ జయంతి స్పెషల్​ - క్రిస్పీ అండ్​ టేస్టీ "ఆంజనేయ వడలు" - స్వామికి నైవేద్యంగా పెట్టండి!

పాకంతో పని లేని "క్యారెట్ సగ్గుబియ్యం పాయసం" - ఒక్కసారి తింటే స్వీట్ కావాలన్నా ప్రతిసారీ దీనికే మీ ఓటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.