ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ 'గుమ్మడికాయ పులుసు' - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి! - ఒక్కసారి తిన్నారంటే మైమరచిపోతారు! - Gummadikaya Pulusu Recipe

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 6:33 AM IST

Gummadikaya Pulusu Recipe : గుమ్మడికాయను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో చాలా మందికి తెలిసిన విషయమే. కానీ, దానితో ఎలాంటి వంటకాలు చేసుకోవాలో తెలియదు. అలాంటి వారికోసం అద్దిరిపోయే రెసిపీ పట్టుకొచ్చాం. అదే తీపి గుమ్మడికాయ పులుసు. టేస్ట్ సూపర్​గా ఉంటుంది! మరి, దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How To Make Gummadikaya Pulusu
Gummadikaya Pulusu Recipe (ETV Bharat)

How To Make Gummadikaya Pulusu : మెజార్టీ పీపుల్ గుమ్మడికాయ అంటే దిష్టి తీయడానికి మాత్రమే వాడుతారని అనుకుంటారు. కానీ, గుమ్మడికాయను ఆహారంలో భాగం చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. అయితే, చాలా మందికి గుమ్మడితో ఏం వంటకాలు చేసుకోవాలో తెలియదు. అలాంటి వారికోసం సూపర్ టేస్టీగా ఉండే 'గుమ్మడికాయ పులుసు' రెసిపీ తీసుకొచ్చాం. చాలా సింపుల్​గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! అయితే, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఒక కప్పు - గుమ్మడికాయ ముక్కలు
  • రెండు - ఉల్లిపాయలు
  • మూడు - పచ్చిమిర్చి
  • అరకప్పు - చింతపండు రసం
  • మూడు స్పూన్లు - బెల్లం తురుము
  • తగినంత - నూనె
  • ఒక స్పూన్ చొప్పున - జీలకర్ర, ఆవాలు, మినపప్పు
  • రెండు - ఎండుమిర్చి
  • పావు స్పూన్ - మెంతులు
  • కొద్దిగా - కరివేపాకు
  • చిటికెడు - ఇంగువ
  • ఒక స్పూన్ - ధనియాల పొడి
  • చిటికెడు - పసుపు
  • రుచికి సరిపడా - ఉప్పు, కారం
  • సరిపడినంత - వాటర్
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు

గుమ్మడి కాయ హల్వా టేస్ట్‌లో బెస్ట్‌ అంతే! ఈజీగా ఇలా చేసేద్దాం!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక తీపి గుమ్మడికాయను(Pumpkin) తీసుకొని దాన్ని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అదేవిధంగా పచ్చిమిర్చి, కొత్తిమీరను తరుక్కోవాలి. అలాగే చిన్న బౌల్​లో కావాల్సినంత పరిమాణంలో చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని మెంతులు కాస్త ముదురు రంగులోకి మారేంత వరకు కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకున్నాక, అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి కాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అనంతరం పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవడంతో పాటు కాస్త వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మంట మీద ఉడికించుకోవాలి. ఇలా కొన్ని నీళ్లు పోసుకోవడం వల్ల మిశ్రమం మాడకుండా ఉంటుంది.
  • ఆ తర్వాత అందులో గుమ్మడి ముక్కలు ఉడకించుకోవడానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఆపై గిన్నెపై మూతపెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్​ మంట మీద గుమ్మడి ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆ విధంగా మిశ్రమాన్ని ఉడికించుకున్నాక, ముందుగా నానబెట్టిన చింతపండును గుజ్జులా చేసుకొని అరకప్పు వరకు అందులో పోసుకోవాలి. అలాగే బెల్లం తురుమును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై మూతపెట్టి మిశ్రమాన్ని మరో 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం మూతతీసి ఉప్పు, కారం రుచికి సరిపడా ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి.
  • ఇక చివరగా మిశ్రమంలో అన్ని ఇంగ్రిడియంట్స్ సరిపడా ఉన్నాయనుకుంటే, పైన కొద్దిగా కొత్తిమీర తరుగును చల్లుకొని స్టౌ ఆఫ్ చేసుకొని దించుకుంటే చాలు. అంతే ఘుమఘుమలాడే 'తీపి గుమ్మడికాయ పులుసు' మీ ముందు ఉంటుంది!

గ్యాస్ట్రిక్ నుంచి బీపీ దాకా - ఎన్నో సమస్యలకు ఒక్కటే బాణం "గుమ్మడి కాయ"! - ఇలా తీసుకుంటే అద్భుతాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.