ETV Bharat / offbeat

ఈ పద్దతిలో "గోరుచిక్కుడు కొబ్బరికారం" చేయండి - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది!

- కొబ్బరికారంతో కమ్మని 'గోరుచిక్కుడు వేపుడు' - అన్నం, చపాతీల్లోకి అద్దిరిపోతుంది!

Goruchikkudu Kobbari Karam Recipe
Goruchikkudu Kobbari Karam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 1, 2025 at 5:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

Goruchikkudu Kobbari Karam Recipe : ఫైబర్ పుష్కలంగా ఉండే కూరగాయల్లో ఒకటి గోరుచిక్కుడు. దీనినే కొన్ని ప్రాంతాల్లో 'గోకరకాయ' అని అంటుంటారు. అయితే, చాలా మంది పోషకాలు పుష్కలంగా ఉండే గోరుచిక్కుడుని అంతగా తినడానికి ఇష్టపడరు. ఇక పిల్లలైతే వాటిని చూస్తేనే చాలు మొహం చిట్లిస్తుంటారు. కానీ, అదంటే నచ్చని వాళ్లూ ఇష్టంగా తినేలా చేసే ఒక అద్భుతమైన రెసిపీ ఉంది. అదే, కమ్మని "గోరుచిక్కుడు కొబ్బరికారం". టేస్ట్ సూపర్​గా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంతో పాటు చపాతీ, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే, పప్పుచారు, రసం, సాంబార్, పెరుగు చారు వంటి వాటిల్లోకి ఈ గోరుచిక్కుడు కారం సైడ్​ డిష్​గా అద్దిరిపోతుంది. పైగా దీన్ని చాలా తక్కువ సమయంలో సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

అవసరమైన ఇంగ్రీడియంట్స్ :

  • గోరుచిక్కుడు కాయలు - పావుకిలో
  • నూనె - తగినంత
  • మినపప్పు - అరచెంచా
  • శనగపప్పు - అరచెంచా
  • ఆవాలు - పావుచెంచా
  • జీలకర్ర - పావుచెంచా
  • కరివేపాకు - కొద్దిగా
Goruchikkudu Kobbari Karam Recipe
గోరుచిక్కుడు కాయలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా కాస్త లేతగా ఉండే తాజా గోరుచిక్కుడు కాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా గిల్లుకొని లేదా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  • అనంతరం అందులో అవి ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఆపై కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపి ఆ గిన్నెను స్టవ్​ మీద ఉంచి మీడియం ఫ్లేమ్​లో గోరుచిక్కుడును మెత్తగా ఉడికించుకోవాలి.
  • గోరుచిక్కుడు ఉడికేలోపు రెసిపీలోకి అవసరమైన కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.

స్ట్రీట్ ఫుడ్​ రుచితో "ఆలూ బోండాలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Goruchikkudu Kobbari Karam Recipe
కొబ్బరి (Getty Images)

కొబ్బరి కారం కోసం :

  • జీలకర్ర - పావుటీస్పూన్
  • ఎండుకొబ్బరి తురుము - మూడు చెంచాలు
  • కారం - రుచికి తగినంత
  • వెల్లుల్లి రెబ్బలు - మూడ్నాలుగు
  • ఉప్పు - టేస్ట్​కి సరిపడా
Goruchikkudu Kobbari Karam Recipe
వెల్లుల్లి (Getty Images)
  • ఇందుకోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, సన్నని ఎండుకొబ్బరి తురుము, మీ రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి. దాంతో రెసిపీలోకి కావాల్సిన కొబ్బరికారం రెడీ అవుతుంది!
  • ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకుంటున్న గోరుచిక్కుడు ముక్కలు మెత్తగా ఉడికాయనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • ఆపై వేడి నీరు వంపేసి కొద్దిగా చల్లని నీళ్లు పోసి మళ్లీ వడకట్టి అదనపు నీరు తొలగిపోయేలా జల్లి గిన్నెలో వేసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం కర్రీ తయారీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

దుకాణంలో దొరికే బ్రెడ్​తో "కమ్మని పూరీలు" - నూనె పీల్చకుండానే పొంగుతాయి!

Goruchikkudu Kobbari Karam Recipe
జీలకర్ర (ETV Abhiruchi)
  • అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి దాన్ని చక్కగా వేయించాలి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్​లో ఆరేడు నిమిషాల పాటు తాలింపు మిశ్రమంలో మగ్గించుకోవాలి.
  • గోరుచిక్కుడు బాగా మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని జత చేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకొని కలిపి లో టూ మీడియం ఫ్లేమ్​లో మరో మూడ్నాలుగు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • అనంతరం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, కమ్మని రుచితో నోరూరించే "గోరుచిక్కుడు కొబ్బరికారం" రెడీ అయిపోతుంది!
Goruchikkudu Kobbari Karam Recipe
మసాలా దినుసులు (Getty Images)

చిట్కాలు :

  • ఈ రెసిపీలో మీ దగ్గర ఒకవేళ ఎండుకొబ్బరి లేకపోతే దాని ప్లేస్​లో పచ్చికొబ్బరిని అయినా తీసుకోవచ్చు.
  • ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో గోరుచిక్కడు కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇదే క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్​ని పెంచి తీసుకుంటే సరిపోతుంది.

ఇడ్లీ, దోశల్లోకి రుచికరమైన "కొబ్బరి చట్నీ" - ఇలా చేస్తే పక్కా హోటల్​ టేస్ట్!