ETV Bharat / offbeat

నోరూరించే "గోంగూర ఉల్లిపాయ పచ్చడి" - ఇంటిల్లిపాదీ కమ్మగా తినేస్తారు!

గుంటూరు స్టైల్​లో కొత్తరకం గోంగూర పచ్చడి - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు!

Gongura Ullipaya Pachadi Recipe
Gongura Ullipaya Pachadi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 27, 2025 at 8:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

Gongura Ullipaya Pachadi Recipe : ఆకుకూరల్లో గోంగూరకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ పేరు చెబితేనే చాలు చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. ఈ క్రమంలోనే గోంగూరతో పచ్చడి నుంచి పప్పు వరకు అనేక రకాల రెసిపీలను ప్రిపేర్ చేసుకుంటుంటారు. అందులోనూ మెజార్జీ పీపుల్ పచ్చడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ప్రిపేర్ చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ మీరు చేసుకునే రొటీన్ పద్ధతిలో కాకుండా ఈసారి గుంటూర్ స్టైల్​లో సరికొత్తగా ట్రై చేయండి. గోంగూర, ఉల్లిపాయ కాంబినేషన్​లో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే కమ్మగా, పుల్లపుల్లగా ఉండే దీన్ని అన్నంలో కలుపుకొని తినడమే కాదు నాకేస్తారు కూడా! అలాగే, ఈ పచ్చడిని ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, నోరూరించే గుంటూర్ స్టైల్​ గోంగూర ఉల్లిపాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Gongura Ullipaya Pachadi Recipe
గోంగూర (Getty Images)

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • వంద గ్రాములు - గోంగూర ఆకులు
  • తగినంత - నూనె
  • రెండు టీస్పూన్లు - ఆవాలు
  • రెండు టీస్పూన్లు - మెంతులు
  • ఎండుమిర్చి - 20(తగినన్ని)
  • పచ్చిమిర్చి - 14
  • ఆరు టేబుల్​స్పూన్లు - చింతపండు రసం
  • రుచికి తగినంత - ఉప్పు
  • ఒక కప్పు - ఉల్లిపాయ ముక్కలు

గణపతి నవరాత్రుల వేళ ఉల్లి, వెల్లుల్లి తినట్లేదా? - మీకోసమే సూపర్ "ఆలూ" రెసిపీ!

Gongura Ullipaya Pachadi Recipe
ఉల్లిపాయలు (Getty Images)

తయారీ విధానం :

  • గుంటూరు స్టైల్​లో ఎండుమిర్చి కాంబోలో కమ్మని గోంగూర పచ్చడి తయారీ కోసం వంద గ్రాముల పరిమాణంలో తాజా ఎర్ర గోంగూరను కాడల నుంచి ఆకులు తెంచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆపై శుభ్రంగా కడిగి పక్కనుంచాలి.
  • అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు టీస్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు,​ మెంతులు వేసి మంచి సువాసన వచ్చేవరకు దోరగా ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత అందులో మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని చక్కగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Gongura Ullipaya Pachadi Recipe
చింతపండు (Getty Images)
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కనుంచాలి.
  • అనంతరం స్టవ్ మీద ఎండుమిర్చి వేయించిన పాన్ పెట్టుకొని అదనంగా మరో టేబుల్​స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చిని వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • అవి రెండు చక్కగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా వేసి మీడియం ఫ్లేమ్​లో గోంగూర ఆకులు మెత్తగా మగ్గేంతవరకు కుక్​ చేసుకోవాలి.
  • గోంగూర కాస్త మగ్గిన తర్వాత అందులోకి చింతపండు రసం పోసి గోంగూరలోని జిగురు పోయేంతవరకు మరికాసేపు మగ్గించాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో రుచికి తగినంత ఉప్పు వేసుకుని మరికొద్దిసేపు కుక్​ చేసుకుని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఆపై మిక్సీజార్​ తీసుకుని అందులో ఉడికించిన గోంగూర వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తాలింపుని రెడీ చేసుకోవాలి.

ఈ కొలతలతో "పులిహోర" చేస్తే - గుడిలో ప్రసాదంలా కమ్మగా ఉంటుంది!

Gongura Ullipaya Pachadi Recipe
పోపు దినుసులు (Getty Images)

తాలింపు కోసం:

  • ఆయిల్ - ఐదారు టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - రెండు టీస్పూన్లు​
  • పొట్టు మినపప్పు - రెండు టీస్పూన్​
  • ఎండు మిర్చి - నాలుగైదు
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • కరివేపాకు - కొద్దిగా
Gongura Ullipaya Pachadi Recipe
ఎండుమిర్చి (Getty Images)
  • తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్​ వేసి హీట్​ చేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక ఆవాలు,​ పొట్టు మినపప్పు, ఎండుమిర్చి తుంపలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి అన్నింటినీ బాగా వేయించాలి.
  • ఆ మిశ్రమం మొత్తం చక్కగా వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి కారంతో పాటు మిక్సీ పట్టుకున్న గోంగూర మిక్షమాన్ని​ వేసి అంతా కలిసేలా బాగా కలిపి స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఇక చివరగా అందులో సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపి ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, గుంటూరు స్టైల్​లో నోరూరించే కమ్మని "గోంగూర పచ్చడి" మీ ముందు ఉంటుంది!

నిమిషాల్లో చేసుకునే "శనగల ప్రసాదం" - ఉల్లి, వెల్లుల్లి లేకుండానే టేస్ట్ సూపర్!