ETV Bharat / offbeat

మహారాజులు ధరించిన వజ్రం - వచ్చే నెలలోనే "గోల్కొండ బ్లూ" డైమండ్ వేలం - కళ్లు చెదిరే ధర! - GOLCONDA BLUE DIAMOND

గోల్కొండ బ్లూ వేలం ప్రకటించిన క్రిస్టీస్ సంస్థ - ధర 430కోట్లు పలకొచ్చని అంచనా!

golkonda_blue_diamond_auction
golkonda_blue_diamond_auction (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 15, 2025 at 3:14 PM IST

2 Min Read

Golconda Blue Diamond Auction : "గోల్కొండ బ్లూ" వజ్రం మే 14న జెనీవాలో వేలం వేయనున్నట్లు క్రిస్టీస్ సంస్థ వెల్లడించింది. 23.24 కేరట్ల ఈ నీలి వజ్రం వేలంలో రూ.430 కోట్ల వరకూ ధర పలికే అవకాశం ఉందని అంచనాలున్నాయి. గోల్కొండ రాజ్యంలోని వజ్రాల గనుల్లో లభించిన 'గోల్కొండ బ్లూ' వజ్రం రాచ వారసత్వం, విభిన్నమైన నీలి రంగు, 23.24 కేరట్ల పరిమాణంతో ఉండటంతో మంచి ధర పలుకుతుందని క్రిస్టీస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి రూ.300 - 430 కోట్ల వరకు ధర రావచ్చని అంచనా వేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి రాహుల్‌ కడాకియా తెలిపారు.

"భార్య పక్కనే ఉన్నా అదే ధ్యాస!" - మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న "ఫబ్బింగ్"

‘గోల్కొండ బ్లూ వజ్రం మొదట్లో ఇండోర్‌ రాజు మహారాజా యశ్వంత్‌రావు హోల్కర్‌-2 వద్ద ఉండేది. 1923 సమయంలో చేతికి ధరించే బ్రాస్‌లెట్‌లో ఈ వజ్రాన్ని పొదగగా ఆ తర్వాత 'ఇండోర్‌ పియర్స్‌'గా పిలిచే మరో రెండు వజ్రాలతో కలిపి గోల్కొండ బ్లూగా మార్చి మహారాణి ధరించే హారంలో అమర్చారు. అప్పట్లో ఇండోర్‌ సందర్శించిన ప్రముఖ ఫ్రెంచ్‌ చిత్రకారుడు బెర్నార్డ్‌ బౌటెట్‌ గీసిన చిత్రంలో మహారాణి ఈ నెక్లెస్‌ను ధరించి ఉండటం గమనార్హం. కాగా, 1947లో భారత స్వాతంత్ర్యానంతరం ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్‌స్టన్‌ చేతుల్లోకి వెళ్లిన ఈ వజ్రాన్ని బరోడా మహారాజు కొనుగోలు చేశారు. తిరిగి కొన్నాళ్లకే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లగా తాజాగా జెనీవాలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో వేలానికి పెట్టారు. సాధారణంగా స్వచ్ఛమైన నీలం రంగులో ఉండే వజ్రాలకు డిమాండ్‌ ఎక్కువ.

కోహినూర్ వజ్రంతో మొదలు

గోల్కొండ వజ్రాలకు అంతర్జాతీయ మార్కెట్​లో ఎంతో డిమాండ్ ఉంది. కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాల వేట విస్తారంగా సాగింది. ఇక్కడి గనుల్లో దాదాపు లక్షకు పైగా కార్మికులు పనిచేసేవారట. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ డైమండ్ సైతం గోల్కొండ ప్రాతంలోనే లభించింది. "ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టడానికి ఎంత ఖర్చవుతుందో కోహినూర్‌ వజ్రం విలువ అంతే ఉంటుంది" అని మొఘల్‌ చక్రవర్తులు వ్యాఖ్యానించడం వెనుక గోల్కొండ వజ్రాల విలువను వెల్లడిస్తోంది. కోహినూర్‌ తర్వాత నిజాం జాకబ్‌ వజ్రం అతిపెద్దది.

స్వచ్ఛత ఆధారంగా డైమండ్ ధర నిర్ణయిస్తారు. గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవవి, అవి వజ్రాల వ్యాపారంలో ఎంతో విలువైన 'టైప్‌ టూ ఏ కేటగిరీ'కి చెందినవిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి ఏపీలోని నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పేర్కొంటారు.

"ఫ్లోర్ క్లీనింగ్ నీళ్లలో ఇవి కలిపి చూడండి! - చీమలు, బొద్దింకలు పారిపోతాయి - ఇల్లంతా సువాసన

కంటి కింద నలుపొస్తే కారణం అదే - నల్లని వలయాలు పోగొట్టుకునే చిట్కాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.