Golcona blue Diamond : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల్లో "కోహినూర్" ఒకటి. ఇది ఆంధప్రదేశ్‌లోనే దొరికిందని చెబుతారు. అలాంటి అద్వితీయమైన డైమండ్ మరొకటి కూడా ఉంది. అదే, "గోల్కొండ బ్లూ డైమండ్" ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే లభించిందని తెలుస్తోంది. ఎన్నో చేతులు మారిన ఈ వజ్రాన్ని ఇప్పుడు వేలం వేస్తున్నారు. మరి, దాని ధర ఎంత పలికే అవకాశం ఉంది? ఎవరు వేలం వేస్తున్నారు? అసలిప్పుడు ఆ డైమండ్ ఎక్కడ ఉంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
గోల్కొండ బ్లూ వజ్రానికి ఎంతో చరిత్ర ఉంది. ఏపీలోని గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో ఈ వజ్రం దొరికినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఇందౌర్‌ను పాలించిన యశ్వంత్ రావు హోల్కర్-ll మహారాజు వద్ద ఉండేది. 1923లో రాజా యశ్వంత్ రావు హోల్కర్ తండ్రి ఈ వజ్రాన్ని ఒక బ్రాస్‌లెట్‌లో అమర్చారు. ఆ తర్వాత చాలా కాలానికి ఆభరణాలను రీడిజైన్ చేయించారు. అప్పుడు ఇందౌర్ పియర్ డైమండ్స్‌తో చేసిన నెక్లెస్‌లో ఈ "గోల్కొండ బ్లూ" వజ్రాన్ని పొదిగించారు.
బెర్నార్డ్ బౌటెట్ డి మోన్వెల్ అనే ఫ్రెంచ్ చిత్రకారుడు అప్పట్లో ఇందౌర్ మహారాణి చిత్రాన్ని గీశారు. ఆ చిత్రపటంలో ఆమె ధరించిన ఆభరణాల్లో ఈ డైమండ్ కూడా ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత కాలంలో ఈ డైమండ్‌ను ఫేమస్ న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్ స్టన్ కొనుగోలు చేశారు. అది చాలా కాలం పాటు ఆయన వద్దనే ఉంది. అనంతర కాలంలో ఆ డైమండ్ బరోడా మహారాజు దగ్గరికి చేరుకుంది. ఆ తర్వాత ఒక ప్రైవేటు సంస్థ ఈ వజ్రాన్ని దక్కించుకుంది.
ఆయన ఇంట్లో రూ.600కోట్ల డైమండ్ గణపతి.. కోహినూర్ కంటే పెద్దది.. ఏడాదికి ఒక్కరోజే పూజలు
"గోల్కొండ బ్లూ" డైమండ్ ఎంతో విలువైనదిగా రాజులు భావించేవారు. అది తమ వద్ద ఉంటే తమ గౌరవం పెరుగుతుందని విశ్వసించేవారు. బరోడా, ఇందౌర్ మహారాజుల వద్ద అప్పట్లో ఉన్న విలువైన సంపదల్లో ఇది కూడా ప్రధానమైనది అంటే దాని ఖ్యాతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వజ్రం విలువ 23.24 క్యారెట్లు.
ఇంతటి విలువైన "గోల్కండ బ్లూ" వజ్రాన్ని మే 14వ తేదీన వేలం వేయనున్నారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో జరిగే "క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్" సేల్‌లో వేలం వేయబోతున్నారు. ఈ మేరకు క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటన విడుదల చేశారు. వేలంలో ఈ డైమండ్ సుమారు రూ.430కోట్ల దాకా పలికే ఛాన్స్ ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వజ్రానికి ఉన్న రాజుల వారసత్వం, అత్యద్భుతమైన రంగు, ఇంకా పరిమాణం ఇవన్నీ ఈ వజ్రాన్ని ప్రపంచంలోని అరుదైన బ్లూ కలర్ డైమండ్లలో ఒకటిగా నిలిపాయి. మరి, దీన్ని ఎవరు దక్కించుకుంటారు? అందుకోసం ఎన్ని కోట్లు వెచ్చించనున్నారో చూడాలి.
డైమండ్ కావాలా నాయనా? - వెతకండి వెతికితే మీకూ దొరకొచ్చు - ఎక్కడో తెలుసా?