ETV Bharat / offbeat

మేక Vs గొర్రె ఈ రెండిట్లో ఏ మటన్ మంచిది? - పరిశోధనలు చెబుతున్న నిజాలివే! - GOAT MEAT AND LAMB MEAT

- ఆరోగ్యానికి ఏ మాంసం మంచిదో మీకు తెలుసా? - పలు సూచనలు చేస్తున్న పరిశోధనలు!

Goat Vs Lamb
Goat Vs Lamb (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : April 26, 2025 at 1:42 PM IST

4 Min Read

Goat Vs Lamb : ఆదివారం వచ్చిందంటే మెజారిటీ ఇళ్లలో మటన్ ఘుమఘమలు వెదజల్లుతుంటాయి. మరి మీకు ఏ మటన్ ఇష్టం? మేక మాంసమా? గొర్రె మాంసమా? అని అడిగితే జనాలు ఇష్టాఇష్టాల ప్రకారం విడిపోతారు. ఎవరికి నచ్చినదానికి వారు ఓటేస్తారు. కానీ, నిజానికి ఏ మటన్ మంచిదో మీకు తెలుసా? "మాకు తెలుసు, మా దగ్గర పరిశోధనలే ఉన్నాయి" అంటున్నారు నిపుణులు! మరి, వాటి ప్రకారం ఏది మంచిది? ఎందుకు? అనే ప్రశ్నలకు సాక్ష్యాలతో కూడిన సమాధానాలు ఈ స్టోరీలో చూద్దాం.

చికెన్, మటన్ మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. వీటిల్లోని ఖనిజాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంకా రుచి పూర్తి భిన్నంగా ఉంటుంది. కానీ, మటన్ విషయానికి వస్తే "రెడ్​ మీట్" (గోట్, లాంబ్, పోర్క్, బీఫ్, డీర్)లో టేస్ట్ డిఫరెంట్​గా ఉన్నప్పటికీ ఖనిజాలు, విటమిన్స్ విషయంలో పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. మేక, గొర్రె విషయం చూస్తే ఇందులో సహజమైన లీన్ ప్రొటీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ లీన్ ప్రొటీన్ మేక, గొర్రె మాంసంలో ఇంచుమించు సమానంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Goat Vs Lamb
Goat Vs Lamb (Getty Images)

కొలెస్ట్రాల్ :

సహజంగా మటన్ ద్వారా కొవ్వు పెరుగుతుందని చెబుతారు. అయితే, ఇతర రెడ్​ మీట్స్​తో పోలిస్తే మేకలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. "అమెరికన్ హార్ట్ అసోసియేషన్" ప్రకారం ఆహారంలో సంతృప్త కొవ్వుల శాతాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మేక మాంసంలో ఈ సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయట. పోర్క్, బీఫ్, గొర్రె మాంసం కన్నా, మేక మాంసంలో ఈ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందని Cambridge University వెబ్​ సైట్​ ప్రకటించింది. మేక మాంసంలో సుమారు 66.77 mg/100g ఉంటే, గొర్రె మాంసంలో 99.28 mg/100gగా ఉంటుందని చెబుతోంది.

హైదరాబాద్​ స్పెషల్​ "మటన్​ మలై హండి" - బగారా రైస్​లోకి సూపర్ కాంబో!

ఐరన్ :

మేక మాంసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరానికి ఇనుము ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. రక్తంలో హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ లేనిదే ఎర్ర రక్త కణాలు శరీర భాగాలకు ఆక్సీజన్‌ను సరఫరా చేయలేవు. గర్భిణులు చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. అందుకే ఈ ఖనిజం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇంత ముఖ్యమైన ఐరన్ మేక మాంసంలో ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్​ చెబుతోంది. మేకతో పోలిస్తే గొర్రె మాంసంలో ఇది తక్కువగా ఉంటుంది.

Goat Vs Lamb
Goat Vs Lamb (Getty Images)

ప్రొటీన్ ఎందులో ఎక్కువ? :

మానవ శరీరానికి తగిన కండ పుష్టి అందించడం, ఎదుగుదులను ప్రేరేపించడంలో ప్రధాన పాత్ర ప్రొటీన్​దే! అంత ముఖ్యమైన ప్రొటీన్ మేక మాంసంలో చాలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన దేహం ఆరోగ్యానికి, డెవలప్​ మెంట్​కు అవసరమైన అమైనో ఆమ్లాలను ఈ ప్రొటీన్ అందిస్తుందట. కండరాలు, చర్మం, ఎముకల నిర్మామంలో దీని పాత్ర ప్రముఖంగా ఉంటుందని చెబుతున్నారు. దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్​ చేయడానికి కూడా మన శరీరం ప్రోటీన్‌ను ఉపయోగిస్తుందట! అందువల్ల రోజువారీ భోజనంలో తగినంత ప్రోటీన్‌ను చేర్చుకోవడం కంపల్సరీ సూచిస్తున్నారు. ఇలాంటి ప్రొటీన్ మేక మాంసంతో పోలిస్తే గొర్రె మాంసంలో కాస్త తక్కువగా ఉంటుందని కేంబ్రిడ్జ్ పరిశోధన సూచిస్తోంది.

చిట్టిముత్యాలతో స్పైసీ "మటన్ దమ్ బిర్యానీ"- ఇలా చేస్తే ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండిపోతుంది!

సోడియం :

మన శరీరంలో సోడియం లెవల్స్ సరైన స్థాయిలో ఉండాలి. లేకపోతే బీపీ ముప్పు పొంచి ఉంటుంది. ఆల్రెడీ బీపీతో ఇబ్బంది పడుతున్నవారు ఉప్పుతోనే కాకుండా, మాంసం తినే విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. రెడ్ మీట్ తినడం వల్ల ఒంట్లో సోడియం పెరుగుతుందని, ఇది గుండె జబ్బుల ముప్పును కూడా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని Nationa Library Of Medicine కూడా ప్రస్తావించింది. ఇలా చూసుకున్నప్పుడు అన్ని రెడ్​ మీట్స్​తో పోలిస్తే మేక మాంసంలో సహజంగానే సోడియం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టెక్సాస్​లోని Prairie View A&M విశ్వవిద్యాలయానికి చెందిన "College of Agriculture and Human Sciences" విభాగం నిర్వహించిన పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది.

Goat Vs Lamb
Goat Vs Lamb (Getty Images)

ఇంకా :

మేక మాంసంలో పొటాషియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ఇతర ఖనిజాలు కూడా ఉన్నాయి.

నరాలు ఉత్తేజం కావడానికి పొటాషియం ఎంతో కీలకం. రక్తపోటు నియంత్రించడానికి, హృదయ స్పందనను సరిచేయడానికి, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లడానికి ఇది చాలా అవసరం.

ఎముకలు, దంతాల బలానికి అవసరమైన కాల్షియం కూడా మేక మాంసంలో ఉంటుంది. హార్మోన్ల విడుదల నుంచి, రక్త నాళాల పనితీరులో ఇది కీలకం.

దేహం శక్తిని నిల్వ చేయడానికి ఇంకా వాడడానికి అవసరమైన అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉత్పత్తిలో భాస్వరం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గోట్ మీట్​లో ఉంటుంది.

రోగనిరోధక వ్యవస్థ, గ్లూకోజ్ నియంత్రణ, ప్రోటీన్ తయారీ వంటి విషయాల్లో కీలకపాత్ర పోషించే మెగ్నీషియం కూడా ఇందులో ఉంటుంది.

ఇంతకీ ఏది టేస్టీగా? :

రుచి విషయానికి వస్తే "ఏది బాగుంటుంది?" అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఒకరికి మేక నచ్చితే మరికొందరికి గొర్రెమాంసం నచ్చుతుంది. ఇంకొందరికి ఇవి రెండూ నచ్చకపోవచ్చు. అందువల్ల ఏది రుచిగా ఉంటుందనేది ప్యూర్లీ పర్సనల్. విటమిన్స్, మినరల్స్ విషయంలో చూసినప్పుడు మాత్రం పై విధంగా కాస్త తేడాలు ఉన్నాయని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు.

ఓవరాల్​గా చూసుకున్నప్పుడు తెలంగాణ వంటి ప్రాంతాల్లో మేక మాంసం తినడానికే ఎక్కువ జనాలు ఆసక్తి చూపుతారు. సో, ఈ సండే మటన్ కొనుగోలు చేసేటప్పుడు పై విషయాలను కూడా ఓసారి దృష్టిలో పెట్టుకోండి. హెల్దీగా, ఇష్టంగా ఆరగించండి.

ఈ స్టైల్​లో "మటన్ దమ్ బిర్యానీ" చేయండి - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.