ETV Bharat / offbeat

కూరల్లో అన్నీ వేసినా రుచి రావట్లేదా? - ఈ పొడి ఒక్క స్పూన్ వేస్తే చాలు ఘుమఘుమలాడిపోతుంది! - KURA KARAM PODI

కర్రీ ఏదైనా, ఎలా చేసినా చివర్లో ఈ పొడి స్పూన్​ వేయండి - రుచి అద్దిరిపోతుంది

Flaxseeds Karam Podi in Telugu
Flaxseeds Karam Podi in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 6, 2025 at 12:53 PM IST

2 Min Read

Flaxseeds Karam Podi in Telugu : చూడడానికి చిన్నగా ముదురు గోధుమ రంగులో కనిపించే అవిసె గింజల్లో ఎన్నో రకాల పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వీటి ప్రయోజనాలు తెలిసి వేయించి పొడి చేసి లడ్డూలు చుట్టుకుంటారు. పిల్లలు, పెద్దలందరూ ఈ అవిసె గింజల లడ్డూలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం సింపుల్​గా అవిసె గింజలతో కూర కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇలా అవిసె గింజల కారం పొడి తయారు చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది. ఆలూ కర్రీ, వంకాయ, బెండకాయ, దొండకాయ వేపుడు చేసినప్పుడు చివర్లో గరం మసాలా, ధనియాల పొడి వేయకుండా ఓ స్పూన్ ఈ కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం పొడి టిఫిన్స్​లోకి కూడా తినొచ్చు.

"మృగశిర కార్తె"తో చేపలకి ఉన్న లింక్​ ఏంటి? - ఆ రోజున "జల పుష్పాలు" ఎందుకు తింటారో తెలుసా!

Flaxseeds
Flaxseeds (Getty Images)

కావాల్సిన పదార్థాలు

  • అవిసె గింజలు - కప్పు (100 గ్రాములు)
  • ఎండు మిరపకాయలు - 20
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 20
  • శనగపప్పు - పావు కప్పు
  • మినప్పప్పు -పావు కప్పు
  • ధనియాలు - పావు కప్పు
  • టేబుల్​స్పూన్ - జీలకర్ర
  • చింతపండు - ఉసిరికాయంత
  • నూనె - సరిపడా
Flaxseeds Karam Podi
Flaxseeds Karam Podi (ETV Bharat)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​పై పాన్​ పెట్టి 2 టేబుల్​స్పూన్లు ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆయిల్​ వేడయ్యాక కప్పు అవిసె గింజలు వేసి దోరగా వేయించండి. అవిసె గింజలు హై ఫ్లేమ్​లో కాకుండా సిమ్​లో పెట్టి నిదానంగా వేపండి. అవిసె గింజలు చక్కగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే పాన్​లో మరొక టేబుల్​స్పూన్ ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆయిల్​ వేడయ్యాక పావు కప్పు చొప్పున మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న పప్పుల మిశ్రమాన్ని అవిసె గింజల ప్లేట్లోకి తీసుకోండి.
Flaxseeds Karam Podi
Flaxseeds Karam Podi (ETV Bharat)
  • అదే పాన్​లో ఎండుమిర్చి, టేబుల్​స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేయించిన ఆవిసె గింజలు, పప్పులు మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేసి మెత్తగా పొడి చేసుకోండి.
  • అయితే, ఇక్కడ మీరు ఇడ్లీ, ఉప్మా, దోసె వంటి టిఫిన్స్​లోకి కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోవాలి. అలాగే మీరు కూరల్లోకి కారం వేయాలనుకుంటే మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది.
Flaxseeds Karam Podi
Flaxseeds Karam Podi (ETV Bharat)
  • చివరిగా అదే మిక్సీ గిన్నెలో గిన్నెలో వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
  • అంతే ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకుంటే రుచికరమైన అవిసె గింజల కారం పొడి రెడీ!
Flaxseeds Karam Podi
Flaxseeds Karam Podi (ETV Bharat)
  • ఉదయాన్నే ఇడ్లీలు చేసుకున్నప్పుడు చట్నీ చేసుకునే టైమ్​ లేనప్పుడు రెండు చుక్కలు నెయ్యి వేసుకొని ఈ కారం పొడితో తింటే సరిపోతుంది.
  • ఈ అవిసె గింజల కారం పొడిని ఎయిర్​టైట్​ బాక్స్​లో స్టోర్​ చేసుకొని ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటే రెండు నెలలపాటు నిల్వ ఉంటుంది!

ఈ ఆదివారం "మృగశిర కార్తె" - చేపల పులుసులో 'ఈ మసాలా' వేస్తే గిన్నెలు ఖాళీ చేస్తారు!

పల్లీలు, పుట్నాలపప్పు లేకుండానే "చిక్కటి చట్నీ" - ఇలా చేస్తే ఇడ్లీ, దోసెల్లోకి సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.