Ghee Roast Egg Recipe in Telugu : కోడిగుడ్లతో పులుసు, ఫ్రై ఎప్పుడూ తినే ఉంటారు. ఈ సారి కొత్తగా "ఘీ రోస్ట్ ఎగ్" ట్రై చేసి చూడండి. ఒక్క సారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలనేలా ఉంటుంది. కారంగా, ఘాటుగా మంచి రుచితో నోటికి కొత్త రుచి అందిస్తుంది. తయారీ పూర్తిగా కొత్త విధంగా అనిపించినా ఇక్కడ నూనెకు బదులు నెయ్యి వాడుతుంటారు. మీరూ ఓ సారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో!
ఈ ఆదివారం "మృగశిర కార్తె" - చేపల పులుసులో 'ఈ మసాలా' వేస్తే గిన్నెలు ఖాళీ చేస్తారు!

కావలసిన పదార్థాలు :
- ఉడికించిన కోడిగుడ్లు - 8
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- మిరియాలు - అర స్పూన్
- మెంతులు - పావు స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- ఎండు మిర్చి - 6
- వెల్లుల్లి - 8
- లవంగాలు - 3
- అల్లం - కొద్దిగా
- చింతపండు - చిటికెడు
- ఉప్పు - రుచికి సరిపడా
- నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
- పసుపు - పావు టీ స్పూన్
- పెద్ద ఉల్లిగడ్డ - 1
- టమోటాలు - 1
- గరం మసాలా - 1 స్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- మేతి చమన్ - 1 స్పూన్

తయారీ విధానం :
- వెడల్పాటి కడాయిని పొయ్యి మీద పెట్టుకుని ధనియాలు, మిరియాలు, జీలకర్ర సన్నటి మంటపై వేయించాలి. అందులోనే ఎండు మిర్చి, లవంగాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకుని వేయించి పక్కకు పెట్టుకోవాలి.

- ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకుని అల్లం, బెల్లం ముక్క, కొద్దిగా చింతపండు, 10 జీడిపప్పులు, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇపుడు కడాయిలో 1టీ స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు, ఉప్పుతో పాటు ఉడికించి పొట్టు తీసుకున్న కోడిగుడ్లు వేయించి పక్కన పెట్టుకోవాలి.

- ఆ తర్వాత 5 స్పూన్ల నెయ్యి వేసుకుని కరివేపాకు క్రంచీగా వేయించి పక్కకు తీసుకోవాలి.
- ఇపుడు అదే నూనెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని బాగా కలుపుతూ ఎర్రని రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరగిన టమోటా వేసి రుచికి సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి.

- మూత పెట్టుకుని 5 నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయిస్తే నెయ్యి పైకి తేలుతుంది. ఈ సమయంలో ఉడికించి ఫ్రై చేసిన ఎగ్స్, వేయించిన కరివేపాకుతోపాటు కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా చల్లుకుని కలపాలి. మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే ఘీ రోస్ట్ ఎగ్ కర్రీ రెడీ.
ఇలా చేస్తే జొన్న రొట్టె కూడా ఉ"ప్పొంగుతుంది" - రొట్టె చేయడం రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు!
పల్లీలు, పుట్నాలపప్పు లేకుండానే "చిక్కటి చట్నీ" - ఇలా చేస్తే ఇడ్లీ, దోసెల్లోకి సూపర్!