Egg Dum Biryani Recipe in Telugu : ఘుమఘుమలాడే స్పైసీ బిర్యానీ అనగానే మనలో చాలా మందికి నోరూరిపోతుంది. ఇంట్లో బిర్యానీ చేసినా లేదా రెస్టారెంట్లో అయినా బిర్యానీ లవర్స్ ఎంతో ఇష్టంగా కడుపునిండా తినేస్తారు. ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చెప్పిన విధంగా బిర్యానీ చేస్తే ఎక్స్ట్రా గ్రేవీ అవసరం లేదు. అలాగే ఈ బిర్యానీ స్పైసీగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ బిర్యానీ ఒక్కసారి రుచి చూస్తే మళ్లీమళ్లీ ఇలానే ట్రై చేస్తారు! అంత బాగుంటుంది టేస్ట్!
నోరూరించే "గ్రీన్ ఎగ్ గ్రేవీ" - పచ్చిమిర్చితో ఇలా చేస్తే అన్నం, చపాతీలతో అద్దిరిపోతుంది!

ఎగ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :
- గుడ్లు 5 (ఉడికించి పెట్టుకోవాలి)
- బాస్మతి బియ్యం - అరకేజీ
- ఉల్లిపాయలు - 2
- పెరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - 3
- దాల్చిన చెక్క - 2
- కొద్దిగా - ఫ్రైడ్ ఆనియన్స్
- అరటీస్పూన్ - యాలకుల పొడి
- 2 టేబుల్‌స్పూన్లు - ఫ్రెష్ క్రీమ్
- టీస్పూన్ - బిర్యానీ మసాలా
- పసుపు - కొద్దిగా
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - కొద్దిగా
- కారం పొడి- సరిపడా
- లవంగాలు - 4
- యాలకులు- 2
- మరాఠి మొగ్గ- 1
- టీస్పూన్ - జీలకర్ర
- షాజీర - కొద్దిగా
- బిర్యానీ ఆకులు - 3
- బిర్యానీ పువ్వు - 2
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర, పుదీనా తరుగు
- పచ్చిమిర్చి-అల్లం పేస్ట్-వెల్లుల్లి - టేబుల్‌స్పూన్
- అరకప్పు - టమాటా ప్యూరీ
- పావు కప్పు - పాలు
- కొద్దిగా - కుంకుమ పువ్వు
- కాస్త కసూరీ మేథి

ఎగ్ బిర్యానీ తయారీ విధానం :
- ముందుగా బౌల్లో అరకేజీ బాస్మతి బియ్యం తీసుకుని రెండుసార్లు కడగండి. ఆపై సరిపడా నీళ్లు పోసి 30 నిమిషాలపాటు పక్కన పెట్టుకోండి.
- ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టుకోవాలి. ఈ గుడ్లను బౌల్లోకి తీసుకోండి. ఇందులో పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, టీస్పూన్ కారం వేసి బాగా పట్టించాలి.

- పావు కప్పు పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి.
- అన్నం ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండున్నర లీటర్ల నీరు పోసి మరిగించండి. ఇందులో బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠి మొగ్గ, షాజీర, కొద్దిగా నెయ్యి, ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించుకోవాలి.
- నీళ్లు తెర్ల కాగుతున్నప్పుడు రైస్ వేసి కలపండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, అరచెక్క నిమ్మరసం పిండి కలపండి. బాస్మతీ బియ్యం 80 శాతం ఉడికించుకున్న తర్వాత అన్నం జల్లించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.

- బిర్యానీ చేయడం కోసం స్టవ్ పై మందంగా ఉండే కడాయి పెట్టి 2 టేబుల్‌స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ హీటయ్యాక గుడ్లను వేసి 2 నిమిషాలపాటు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. ఆపై బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠి మొగ్గ, టీస్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఆపై కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి-అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత అరకప్పు టమాటా ప్యూరీ వేసుకుని కలుపుకోండి.

- ఆపై కొద్దిగా ఉప్పు, పసుపు, రుచికి సరిపడా కారం, 2 టీస్పూన్లు ధనియాల పొడి వేసి మిక్స్ చేయండి. అనంతరం 2 టేబుల్‌స్పూన్లు పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు పావుకప్పు నీళ్లు పోసి బాగా కలిపి ఫ్రై చేసుకున్న గుడ్లు వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, కాస్త కసూరీ మేథి వేసి బాగా కలపండి.
- అనంతరం 2 టేబుల్‌స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్, టీస్పూన్ బిర్యానీ మసాలా, అరటీస్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్‌స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఈ ఎగ్ గ్రేవీలో సగానికి పైగా గ్రేవీ, అలాగే గుడ్లు లేకుండా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బాస్మతీ రైస్ ఒక లేయర్‌గా వేసుకోవాలి. ఆపై ఎగ్స్ గ్రేవీ, రైస్ లేయర్స్‌లా వేసుకోవాలి.

- బిర్యానీ రైస్ పై సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసుకోవాలి. అలాగే 2 టేబుల్‌స్పూన్లు వాటర్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా తరుగు వేసి, టిష్యూ పేపర్ పెట్టి నీళ్ల చిలకరించి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ!
- కోడిగుడ్డు బిర్యానీని వేడిగా ఉన్నప్పుడు రైతాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
"కొబ్బరి పచ్చడి"లో గుప్పెడు ఇవి వేసి చేయండి - రుచి అద్భుతంగా ఉంటుంది!
హోటల్ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏమీ లేదు! - పల్లీలను ఇలా చేసి చూడండి చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు!