ETV Bharat / offbeat

బ్యాచిలర్స్​ స్పెషల్​ సూపర్​ టేస్టీ "మసాలా ఎగ్ బిర్యానీ" - ఇలా ప్రిపేర్ చేస్తే జిందగీ ఖుష్​ అవ్వాల్సిందే!

కుక్కర్​లో ఇలా "ఎగ్ బిర్యానీ" చేసుకోండి - ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరంతే!

Masala Egg Biryani Recipe
Egg Biryani Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 28, 2025 at 10:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

Masala Egg Biryani Recipe in Telugu : మనందరికీ బిర్యానీ అనగానే చికెన్, మటన్​తో ప్రిపేర్ చేసుకునేవి ముందుగా గుర్తొస్తాయి. అవి మాత్రమే కాదు ఓసారి ఇలా కుక్కర్​లో ఎగ్ బిర్యానీని ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది! బ్యాచిలర్స్​తో పాటు ఎవరైనా చాలా సింపుల్​గా దీన్ని తయారు చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బాస్మతి రైస్ - ఒకటిన్నర కప్పులు
  • నూనె - 6 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయలు - 2
  • ఉడికించిన గుడ్లు - 4
  • బిర్యానీ ఆకు - 1
  • జాపత్రి - 2
  • దాల్చిన చెక్క - రెండున్నర ఇంచుల ముక్క
  • లవంగాలు - 7
  • యాలకులు - 5
  • జీలకర్ర - అరటీస్పూన్
  • షాహిజీరా - అరటీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి - 2
  • టమాటాలు - 2
  • కారం - తగినంత
  • పసుపు - చిటికెడు
  • వేయించిన ధనియాల పొడి - 1 టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • గరంమసాలా - 1 టీస్పూన్
  • ఉప్పు - తగినంత
  • చిలికిన పెరుగు - 1 కప్పు
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • పుదీనా తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • నిమ్మకాయ - 1
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్

నోరూరించే రెస్టారెంట్ స్టైల్ "పనీర్ బిర్యానీ" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో బాస్మతి రైస్​ని తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే, ఉల్లిపాయను సన్నని చీలికలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ చీలికలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్​లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం ఆ నూనెలో ఉడికించిన గుడ్లకు గాట్లు పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత చిటికెడు చొప్పున ఉప్పు, కారం వేసి గుడ్లను అన్నీ వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • ఆ తర్వాత మిగిలిన నూనెలో బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, షాహిజీరా వేసి చిట్లనివ్వాలి. అవి వేగాక చిన్న ఉల్లిపాయ చీలికలు వేసి లైట్ గోల్డెన్ కలర్​ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, సన్నని టమాటా తరుగు యాడ్ చేసుకొని జస్ట్ టమటాలపై స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కారం, పసుపు, వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని వేయించుకుంటే మసాలాలు మాడకుండా ఉంటాయి.

మీరు ఎప్పుడూ ట్రైచేయని "కోడిగుడ్డు వేపుడు" - జిందగీ ఖుష్ అనాల్సిందే!

  • మసాలాల నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక చిలికిన పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మరోసారి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక సన్నని కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, నిమ్మరసం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆపై రెండున్నర కప్పుల వరకు వేడి నీరు పోసి కలిపి హై ఫ్లేమ్ మీద ఉడుకు రానివ్వాలి.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్​ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. అలాగే నెయ్యి, వేయించుకున్న కోడిగుడ్లను వేసి నెమ్మదిగా కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అదే మీరు నార్మల్​ రైస్​తో చేసుకుంటున్నట్లయితే కప్పుకి రెండు కప్పుల వాటర్ అవసరమవుతాయి. మూడు విజిల్స్ రానిచ్చి 20 నిమిషాలు అలా వదిలేయాలి.
  • 20 నిమిషాల తర్వాత కుక్కర్​లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి నెమ్మదిగా ఒకసారి కలిపి ముందుగా వేయించుకున్న ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ కమ్మని "మసాలా ఎగ్ బిర్యానీ" రెడీ!
  • ఇక వేడిగా ఉన్నప్పుడు ఈ​ బిర్యానీని రైతాతో కలిపి తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. నచ్చితే మీరూ ఓసారి రెసిపీని ట్రై చేయండి.

చిట్టిముత్యాలతో స్పైసీ "మటన్ దమ్ బిర్యానీ"- ఇలా చేస్తే ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండిపోతుంది!