ETV Bharat / offbeat

ఈ పద్ధతిలో "టమాటా చట్నీ" చేసుకోండి - నోట్లోకి వెళ్తుంటే నాలుక నాట్యమాడాల్సిందే! - SIMPLE AND TASTY TOMATO CHUTNEY

ఎన్నడూ తినని టమాటా చట్నీ రెసిపీ - అన్నం, టిఫెన్స్​లోకి కిర్రాక్ కాంబో!

Tomato Chutney
Easy Tomato Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 5, 2025 at 4:18 PM IST

4 Min Read

Easy Tomato Chutney Recipe : నాలుకను లాగేసే ఘాటు, నోరూరించే పులుపు, ఘాటైన వెల్లుల్లి వాసన చెబుతుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయా? అయితే, మీకోసం ఒక అదిరిపోయే చట్నీ రెసిపీ రెడీగా ఉంది! ఇది కేవలం చట్నీ మాత్రమే కాదు రుచిలో ఒక మాయాజాలం. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా చేస్తుంది. అదే, శరవణ భవన్ టమాటా చట్నీ. వేడివేడి ఇడ్లీనో, కరకరలాడే దోశనో ఈ చట్నీలో ముంచి తింటుంటే ఆహా ఆ రుచిని వర్ణించడానికి మాటలు చాలవు. పైగా దీన్ని ఎవరైనా నిమిషాల్లో చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ శరవణ భవన్ స్టైల్ టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Easy Tomato Chutney
Tomatoes (Getty Images)

తీసుకోవాల్సిన పదార్థాలు :

  1. నూనె - 1 టేబుల్ స్పూన్
  2. వెల్లుల్లి రెబ్బలు - 4
  3. ఎండుమిర్చి - 10 నుంచి 12
  4. పెద్ద ఉల్లిపాయ - 1
  5. పసుపు - చిటికెడు
  6. పెద్ద టమాటాలు - 3
  7. ఉప్పు - రుచికి సరిపడా

పల్లీలు, కొబ్బరి, చింతపండు లేకుండానే - టిఫెన్స్​లోకి సూపర్ "చట్నీ"! - గ్యాస్ సమస్యకు బెస్ట్ ఆప్షన్!

Tomato Chutney
Tomato (Getty Images)

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీకిలో కావాల్సిన ఉల్లిపాయ, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద మందపాటి అడుగు కలిగిన పాన్ లేదా కడాయిని ఉంచి ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసుకొని లో-ఫ్లేమ్ మీద నిధానంగా వేయించుకోవాలి.
  • దీనివల్ల వెల్లుల్లిలో ఉండే రుచి నూనెలోకి బాగా దిగుతుంది. చట్నీకి మంచి సువాసన వస్తుంది. అదే, మంట ఎక్కువగా ఉంటే వెల్లుల్లి మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి.
  • వెల్లుల్లి కొద్దిగా రంగు మారిన తర్వాత ఎండుమిర్చిని వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగితేనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది.
Tomato Chutney Making
Onions (Getty Images)
  • ఎండుమిర్చి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ, ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారితే సరిపోతుంది.
  • ఆ తర్వాత పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని అవి సాఫ్ట్​గా మారేంత వరకు ఉడికించుకోవాలి.
  • టమాటాలు ఉడుకుతున్నప్పుడే ఉప్పు వేసుకొని కలిపి కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్​లో ఉప్పు వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి.
  • టమాటాలు నాలుగైదు నిమిషాల్లో మెత్తగా ఉడికిపోతాయి. వాటిలోని నీరంతా తగ్గి, గుజ్జులా తయారవుతుంది. టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం పాన్​ని దింపి టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన టమాటా మిశ్రమాన్ని వేసుకొని, చుక్క కూడా నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం తాలింపు పెట్టుకోవాలి.
Tomato Chutney
Chilli (Getty Images)

తాలింపు కోసం :

  1. నూనె - 1 టేబుల్​స్పూన్
  2. జీలకర్ర - 1/2 స్పూన్
  3. వెల్లుల్లి రెబ్బలు - 4
  4. ఆవాలు - 1/2 స్పూన్
  5. ఇంగువ - చిటికెడు
  6. ఎండుమిర్చి - 2
  7. కరివేపాకు - 2 రెమ్మలు
  • తాలింపు కోసం స్టౌపై ఒక చిన్న పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి కొద్దిగా వేయించాలి.
  • ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. అవి వేగాక ఇంగువ, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం ఈ తాలింపును ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా చట్నీలో వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ "శరవణ భవన్ టమాటా చట్నీ" రెడీ!
  • ఇది ఇడ్లీ, దోస, వడ వంటి టిఫెన్లతో పాటు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీని ఫ్రిడ్జ్​లో ఉంచితే కొన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. నీళ్లు కలపకుండా గ్రైండ్ చేయడం వల్ల ఇది ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
Tomato Chutney
Garlic (Getty Images)

టిప్స్ :

  • ఇక్కడ ఎండుమిర్చి చెప్పినన్నే కాకుండా మీ రుచికి తగినవిధంగా యాడ్ చేసుకోవచ్చు. అయితే, ఎండు మిరపకాయలను వేయించుకునేటప్పుడు నల్లగా మారకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి.
  • ఈ చట్నీకి తీసుకునే పదార్థాలు నిష్పత్తి చాలా ముఖ్యం. 1 ఉల్లిపాయకు 3 టమాటాలు వేయడం వల్ల చట్నీకి సరైన రుచి, చిక్కదనం వస్తుంది.
  • టమాటాలను ఉడికించుకున్నాక చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాకాకుండా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చట్నీ సరిగ్గా గ్రైండ్ అవ్వదని గుర్తుంచుకోవాలి.
  • ఈ చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు వేయకూడదు. దీనివల్లే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. శరవణ భవన్ చట్నీ అసలైన రుచి వస్తుంది.

పాల్వంచ టిఫెన్ సెంటర్​​ "పల్లీ చట్నీ" - చట్నీ కోసమే అక్కడ టిఫెన్ తింటారు! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

పొద్దున్నే ఇడ్లీ, దోశల్లోకి చట్నీ చేసే టైమ్​ లేదా? - ఒక్కసారి ఈ "పొడి" ప్రిపేర్​ చేసుకోండి - రెండు నెలలు నిల్వ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.