How to Make Rava Laddu at Home : ఎక్కువ మంది ఫేవరెట్ స్వీట్ రెసిపీలలో ఒకటి రవ్వ లడ్డూలు. కానీ, కొందరికి ఎన్నిసార్లు చేసినా పర్‌ఫక్ట్‌గా కుదరవు. అలాంటి వారు ఓసారి ఈ కొలతలో రవ్వ లడ్డూలు చేసుకోండి. చక్కగా కుదరడమే కాకుండా ఎంతో రుచికరంగా వస్తాయి. పైగా వీటి తయారీకి పాలు, పంచదారు అవసరం లేదు. అవి లేకుండానే నోట్లే వేసుకుంటేనే కరిగిపోయేంత సాఫ్ట్‌గా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, ఇవి కనీసం రోజుల పాటు గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి. పైగా వీటి కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పని లేదు. కేవలం అరగంటలోనే రెడీ చేసుకోవచ్చు. మరి, అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఈ టిప్స్‌తో మరింత రుచికరం :
- ఈ రవ్వ లడ్డూల కోసం పంచదారకు బదులుగా పటిక బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇది వద్దనుకుంటే దాని ప్లేస్‌లో చక్కెరనైనా వాడుకోవచ్చు.
- పటిక బెల్లం పౌడర్ని మీకు కావాల్సిన పరిమాణంలో తీసుకొని మిగతాది గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.
- ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్లను ఎవరి ఇష్టానికి అనుగుణంగా వారు ఇక్కడ చెప్పిన కొలతల కంటే ఎక్కువ లేదా తక్కువ తీసుకోవచ్చు.
- రవ్వ వేయించుకునేటప్పుడు అది మాడిపోకుండా జాగ్రత్తగా వేయించాలి. ఎందుకంటే రవ్వ లడ్డూల రుచి అంత అది వేయించుకునే తీరుని బట్టే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఎక్కువగా వేసుకుంటే తియ్యదనం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసి వేసుకోవాలి.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- పటిక బెల్లం పౌడర్ - ముప్పావు కప్పు (కావాల్సిన పరిమాణంలో)
- జీడిపప్పు పలుకులు - గుప్పెడు
- నెయ్యి - పావు కప్పు
- కిస్మిస్ - గుప్పెడు
- సన్నని బొంబాయి రవ్వ - 1 కప్పు
- పచ్చికొబ్బరి తురుము - అర కప్పు
- యాలకుల పొడి - పావుటీస్పూన్
- మిల్క్ పౌడర్ - 2 నుంచి 3 టేబుల్‌స్పూన్లు

తయారీ విధానమిలా :
- ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పటిక బెల్లాన్ని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసుకొని లో ఫ్లేమ్ మీద కాసేపు వేయించుకోవాలి.
- అవి సగం వరకు వేగాక అందులో కిస్మిస్ వేసుకొని అవి చక్కగా ఉబ్బి, మంచిగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
- ఆ రెండూ చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే నెయ్యిలో చాలా సన్నగా ఉండే బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్లోకి మారి, మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. రవ్వ వేయించుకునేటప్పుడు అది మాడిపోకుండా జాగ్రత్తగా వేయించాలి. ఇందుకోసం 10 నిమిషాలకు పైగా టైమ్ పట్టొచ్చు.
- ఆవిధంగా వేయించుకున్నాక మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పచ్చికొబ్బరి తురుము వేసుకొని అవి రెండు చక్కగా కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత సన్నని సెగ మీద కొబ్బరిలోని తేమ పోయి మిశ్రమం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత కలుపుతూ మరికాసేపు వేయించుకోవాలి. ఇందుకు పావుగంట వరకు సమయం పట్టొచ్చు.
- కమ్మని వాసన వచ్చేంత వరకు రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేయించుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌ మీద రవ్వ వేయించుకున్న పాన్‌ను ఉంచి గ్రైండ్ చేసుకున్న పటిక పొడి ముప్పావు కప్పు వరకు వేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో అర కప్పు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద గరిటె కలుపుతూ పటిక పొడి పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి.
- ఇది లేత తీగ పాకం రావాల్సిన పనిలేదు. పటిక పొడి మిశ్రమం చక్కగా ఉడికి, నూనెలా జిడ్డుగా మారితే సరిపోతుంది. ఈ మిశ్రమం చక్కగా ఉడకపోతే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవని గుర్తుంచుకోవాలి.
- ఆవిధంగా కుక్ చేసుకున్నాక పాన్ని దింపి పక్కన పెట్టుకొని అందులో యాలకులపొడి, వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకొని మొత్తం కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత రవ్వ మిశ్రమం పాకాన్ని చక్కగా పీల్చుకోవడానికి పది నిమిషాల పాటు పక్కనుంచాలి.
- పది నిమిషాల తర్వాత అందులో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను వేసుకోవాలి.
- అలాగే, ఈ టైమ్‌లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం మిల్క్ పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని చేతితో మాష్ చేసుకుంటూ కొద్దికొద్దిగా తీసుకొని లడ్డూల మాదిరిగా చుట్టుకుంటే చాలు. అంతే, పాలు, పంచదారం లేకుండానే సూపర్ టేస్టీ "రవ్వ లడ్డూలు" రెడీ!
పంచదార పాకం లేకుండానే "క్యారెట్ రవ్వ లడ్డు" - ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు!
నో షుగర్, నో మిల్క్‌పౌడర్ - నిమిషాల్లో సూపర్ టేస్టీ " కుల్పీ" - పైగా ఆరోగ్యం బోనస్!