How to Make Egg Pakoda : పిల్లలు ఉంటే ఇల్లు ఎంతో సందడిగా ఉంటుంది. అయితే ఇది నాణేకి ఒకవైపు మాత్రమే! రెండోవైపు ఇల్లుపీకి పందిరి వేయడంతోపాటు స్నాక్స్ కోసం నానా రభస చేస్తుంటారు. ఇలాంటప్పుడు వీళ్లను డీల్ చేయడం అమ్మలకు సవాల్‌గా ఉంటుంది. అందుకే మీకోసం ఈ సూపర్ ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చాం. పిల్లలు అలా స్నాక్స్ అడగ్గానే, తల్లులు ఇలా వెంటనే ప్రిపేర్ చేసేయొచ్చు. ఇంకా అద్భుత టేస్ట్‌తో అందరూ కలిసి ఆరగించేయొచ్చు. అదే "ఎగ్ పకోడి" రెసిపీ. మరి, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలాంటి పదార్థాలు కావాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

తయారీ విధానం:
- కోడిగుడ్లు - 5
- బియ్యప్పిండి - 3 టేబుల్ స్పూన్లు
- శనగపిండి - అర కప్పు
- పచ్చిమిర్చి - 3
- ఉల్లిపాయలు - 3
- స్ప్రింగ్ ఆనియన్స్ - కొద్దిగా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కారం - అర టీ స్పూను
- పసుపు - చిటికెడు
- జీలకర్ర - ఒక స్పూను
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- వాము - అర టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- సోడా ఉప్పు - చిటికెడు
- వేయించడానికి సరిపడా - ఆయిల్

తయారీ విధానం:
- ఉల్లిపాయలను సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్‌ను సైతం సన్నగా తరిగిన పక్కన ఉంచాలి.
- ఓ బౌల్లోకి కోడిగుడ్లు పగలగొట్టి తీసుకోవాలి. వీటిని సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి శనగపిండి, బియ్యప్పిండి మరో 5 నిమిషాలు కలుపుకోవాలి. అనంతరం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, వాము, ధనియాల పొడి, సోడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పకోడీలకు సరిపడే విధంగా బాగా కలిపి ఓ 5 నిమిషాలు పక్కన పెట్టాలి.
- పిండిలో బియ్యప్పిండి కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ పిండి ఏమైనా లూజుగా అనిపిస్తే మరికొంచెం శనగపిండి కలుపుకోవచ్చు. అలాగే నీళ్లు కావాల్సి వస్తే లైట్‌గా చిలకరించుకోవాలి.
- ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కలుపుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పకోడీలుగా వేసుకోవాలి.
- గరిటెతో కలుపుతూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని పకోడీలుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
- వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుని టమాటా కెచప్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ ఎగ్ పకోడీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- ఎగ్స్‌ను ఎంత ఎక్కువ సేపు బీట్ చేసుకుంటే పకోడీలు అంత టేస్టీగా వస్తాయి.
- క్యారెట్, క్యాప్సికం తురుము కూడా వేసుకుని పకోడీలు చేసుకోవచ్చు.
మీరు తింటున్న కోడిగుడ్లు మంచివేనా? - FSSAI టిప్స్‌తో క్షణాల్లో తెలుసుకోండిలా!
అలర్ట్: ఎగ్స్ తింటే షుగర్ వస్తుందా? - పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు!