ETV Bharat / offbeat

పాతకాలం నాటి "దోసకాయ చికెన్​" - ఉల్లిపాయలు అవసరం లేదు! - ఘుమఘుమలాడిపోద్ది!

- దోసకాయతో పప్పు, పచ్చడి, కూర కాకుండా చికెన్​తో కలిపి చేయండి! - అద్భుతమైన రుచితో తినేకొద్దీ తినాలనిపిస్తుంది!

Dosakaya Chicken Curry
Dosakaya Chicken Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 13, 2025 at 1:29 PM IST

3 Min Read
Choose ETV Bharat

Dosakaya Chicken Curry: ఆదివారం వచ్చిందంటే ఇంట్లో తప్పకుండా నాన్​వెజ్ ఉండాల్సిందే. అందులోనూ చికెన్​ అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని పద్ధతుల్లో చికెన్​ను వండుకుని తింటుంటారు. మరి మీరు ఎప్పుడైనా చికెన్​ను దోసకాయతో కలిపి తిన్నారా? లేకపోతే ఓసారి ట్రై చేయండి. ఘుమఘుమలాడే వాసనతో ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తారు. ఈ రెసిపీని ఎక్కువగా అమ్మమ్మలు, నానమ్మల కాలంలో చేసేవారు. మంచిగా మసాలాలు వేసే ఈ కూర రుచి చాలా బాగుంటుంది. పైగా చాలా ఈజీగా, మొదటిసారి చేసినా పర్ఫెక్ట్​ రుచితో చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా ఈ పాతకాలం నాటి దోసకాయ చికెన్​ను ఎలా చేసుకోవాలో చూసేయండి.

Chicken
చికెన్​ (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • చికెన్​ -1 కేజీ
  • నూనె - 100 గ్రాములు
  • పసుపు - అర టీస్పూన్​
  • కారం - సరిపడా
  • ఉప్పు - రుచికి తగినంత
  • ధనియాలు - 2 టీస్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 2
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • లవంగాలు - 5
  • అల్లం ముక్క - చిన్నది
  • ఎండు కొబ్బరి ముక్క - కొద్దిగా
  • గసగసాలు - 3 టీస్పూన్లు
  • దోసకాయ - 1(పెద్దది)
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కరివేపాకు - 2 రెమ్మలు
Dosakaya
దోసకాయ (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా చికెన్​ను శుభ్రంగా కడిగి జల్లి బుట్టలో వేసి పక్కన ఉంచాలి. కూరకు అవసరమైన దోసకాయను శుభ్రంగా కడిగి మీడియం సైజ్​లో ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన ఉంచాలి.
  • మిక్సీజార్​లో అల్లం ముక్క, ఎండు కొబ్బరి ముక్క, గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
Dosakaya Chicken Curry
Dosakaya Chicken Curry (ETV Bharat)
  • అదే మిక్సీజార్​లోకి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్​ చేసి పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి.
Dosakaya Chicken Curry
Dosakaya Chicken Curry (ETV Bharat)
  • కరివేపాకు వేగిన తర్వాత క్లీన్​ చేసుకున్న చికెన్​ను వేసుకుని బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్​లో మధ్యమధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • చికెన్​ ముక్కలు కాస్త నూనెలో మగ్గి నీళ్లు ఊరిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా కలిపి మరికొద్దిసేపు మగ్గించాలి.
Dosakaya Chicken Curry
Dosakaya Chicken Curry (ETV Bharat)
  • కారం మగ్గి నూనె పైకి తేలిన తర్వాత ముక్కలు మునిగే వరకు నీరు పోసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత ముందే గ్రైండ్​ చేసి అల్లం గసగసాల పేస్ట్​ వేసి మిక్స్​ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో కుక్​ చేసుకోవాలి.
  • ముక్కలు సగానికి పైగా ఉడికిన తర్వాత కట్​ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి మరోసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి.
Dosakaya Chicken Curry
Dosakaya Chicken Curry (ETV Bharat)
  • చికెన్​ ముక్కలు, దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ధనియాల మిశ్రమం వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.
  • 5 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాతకాలం నాటి దోసకాయ చికెన్​ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Dosakaya Chicken Curry
Dosakaya Chicken Curry (ETV Bharat)

చిట్కాలు:

  • దోసకాయను మరీ మెత్తగా ఉండకూడదు. మెత్తటి దోసకాయ వాడితే కూర మరో రకమైన రుచి వస్తుంది. అలాగే దోసకాయను ముందే మంచిదో,చేదో చూసుకుని కట్​ చేసుకోవాలి.
  • దోసకాయను మరీ చిన్నగా, మరీ లావుగా కాకుండా మీడియం సైజ్​లో కట్​ చేసుకోవాలి. చిన్నగా కట్​ చేసి మెత్తగా ఉడికి కూర గుజ్జు అవుతుంది, అదే పెద్దగా కట్​ చేస్తే సరిగ్గా ఉడకవు.
Dosakaya Chicken Curry
Dosakaya Chicken Curry (ETV Bharat)
  • చికెన్​ ముక్కలను నూనెలో బాగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి.
  • ఈ మసాలా పేస్ట్​ నుంచి మిక్సీలో కాకుండా రోట్లో నూరితే టేస్ట్​ మరింత బాగుంటుంది. అలాగే కూరను కూడా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద వండితే వేరే లెవల్​.
Dosakaya Chicken Curry
Dosakaya Chicken Curry (ETV Bharat)

రుచికరమైన "సగ్గుబియ్యం పూరీలు" - పిండిని ఇలా కలిపితే బాగా పొంగుతాయి! - నూనె పీల్చవు!

టమాటాతో ఎన్నడూ చేయని కొత్తరకం "కర్రీ" - బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!