ETV Bharat / offbeat

పచ్చికొబ్బరితో కమ్మని "దోశలు" - పప్పులు నానబెట్టాల్సిన పనే లేదు! - నిమిషాల్లోనే రెడీ!

గణేశ్ నవరాత్రుల వేళ ఇంట్లో పచ్చికొబ్బరి మిగిలిందా? - ఇలా రుచికరమైన 'దోశలు' వేసుకోండి!

Dosa Recipe with Coconut
Dosa Recipe with Coconut (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 2, 2025 at 10:35 AM IST

3 Min Read
Choose ETV Bharat

Dosa Recipe with Coconut : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి రోజూ తినేవి కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అది కూడా చాలా త్వరగా అయ్యే రెసిపీ కావాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ ఇన్​స్టంట్​ దోశ రెసిపీ. అదే, సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్ "కొబ్బరి దోశలు". వీటి తయారీ కోసం ఎలాంటి పప్పులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉప్మా రవ్వ, పచ్చికొబ్బరి ఉంటే చాలు. అప్పటికప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లో వీటిని సింపుల్​​గా రెడీ చేసుకోవచ్చు. ఇవి చాలా మృదువుగా, రుచికరంగా ఉండి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లలైతే ఈ దోశలకు ఒకటికి రెండు ఇష్టంగా తింటారు! ప్రస్తుతం గణేశ్ నవరాత్రులు కొనసాగుతున్న వేళ మీ ఇంట్లోనూ పూజకు వాడిన పచ్చికొబ్బరి చిప్పలు మిగిలి ఉంటాయి. మరి, లేట్ చేయకుండా మీరూ ఓసారి ఈ పచ్చికొబ్బరి దోశలు ట్రై చేయండి.

Dosa Recipe with Coconut
పచ్చికొబ్బరి (Getty Images)

అవసరమైన ఇంగ్రీడియంట్స్ :

  • పచ్చికొబ్బరి చిప్పలు - రెండు
  • ఉప్మా రవ్వ - రెండు కప్పులు
  • ఉల్లిపాయలు - రెండు(మీడియం సైజ్​వి)
  • జీలకర్ర - రెండుటీస్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత
  • క్యారెట్లు - నాలుగు
  • నూనె - కొద్దిగా(దోశపై వేసుకోవడానికి)

దుకాణంలో దొరికే బ్రెడ్​తో "కమ్మని పూరీలు" - నూనె పీల్చకుండానే పొంగుతాయి!

Dosa Recipe with Coconut
రవ్వ (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్ దోశల తయారీ కోసం ముందుగా తాజా పచ్చికొబ్బరి చిప్పలను తీసుకొని వాటి నుంచి కొబ్బరిని వేరు చేసుకోవాలి.
  • ఆ తర్వాత కొబ్బరిని గ్రేటర్​తో సన్నగా తురుముకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచాలి. ఇక్కడ పచ్చికొబ్బరి తురుము రెండు కప్పుల పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.
  • అలాగే, ఉల్లిపాయలను పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో ఉప్మా రవ్వ, ముందుగా రెడీ చేసుకున్న పచ్చికొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, టేస్ట్​కి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
  • అలాగే, రెండు కప్పుల వరకు నీటిని పోసుకొని ఒకసారి కలిపి మిశ్రమం మొత్తాన్ని మెత్తని పిండిలా మిక్సీ పట్టుకోవాలి.
  • ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, పచ్చికొబ్బరి తురుము తీసుకున్న కప్పుతోనే ఉప్మా రవ్వ, వాటర్ వంటివి తీసుకోవాలి. అప్పుడే దోశలు పర్ఫెక్ట్​గా, మంచి రుచికరంగా వస్తాయి.
Dosa Recipe with Coconut
జీలకర్ర (ETV Abhiruchi)
  • తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై మిక్సీ గిన్నెలో మిగిలిపోయిన మిశ్రమంలో కొద్దిగా వాటర్ వేసి కలిపి దాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి.
  • ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచగా కాకుండా దోశకు కావాల్సిన విధంగా కాస్త చిక్కగానే ఉండేలా చూసుకోవాలి.
  • ఆవిధంగా పిండిని సిద్ధం చేసుకున్నాక గిన్నెపై మూతపెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఆలోపు తాజా క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగి గ్రేటర్​తో సన్నగా తురుముకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
  • పది నిమిషాల అనంతరం పిండిని మరోసారి గరిటెతో పైకి కిందకి బాగా కలిపి దోశలు వేసుకోవాలి.

ఇడ్లీ, దోశల్లోకి రుచికరమైన "కొబ్బరి చట్నీ" - ఇలా చేస్తే పక్కా హోటల్​ టేస్ట్!

Dosa Recipe with Coconut
ఉల్లిపాయలు (Getty Images)
  • అందుకోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. దోశ పాన్ వేడయ్యాక కొద్దిగా నూనెను పెనం మొత్తం అప్లై చేయాలి.
  • ఆపై కలిపి పెట్టుకున్న పిండిని ఒకట్రెండు గరిటెలు వేసుకొని మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే దోశలా వేసుకోవాలి.
  • ఊతప్పం మాదిరిగా కాస్త మందంగా దోశ వేసుకున్నాక దానిపై ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని దోశ అంతటా కాస్త వేసుకొని ఆపై కొద్దిగా నూనెను కూడా వేసి వన్ సైడ్ చక్కగా కాలనివ్వాలి.
  • అది వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత రెండో వైపునకు టర్న్ చేసి అటు వైపు కూడా లైట్​గా కాలనిచ్చి సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అంతే, పచ్చికొబ్బరితో నిమిషాల్లో చేసుకునే రుచికరమైన "దోశలు" మీ ముందు ఉంటాయి!
  • తర్వాత వీటిని కొబ్బరి, పల్లీ చట్నీతో తిన్నారంటే ఆ టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ చట్నీ చేసుకునే టైమ్ లేకపోతే ఇంట్లో ఉన్న ఏదైనా నిల్వ పచ్చడితో ఈ దోశలను కమ్మగా తినేయొచ్చు!
Dosa Recipe with Coconut
క్యారెట్ తురుము (Getty Images)

తక్కువ టైమ్​లో రుచికరమైన "పల్లీ లడ్డూలు" - పాకం పట్టాల్సిన పని లేదు!