Dosa Recipe in Telugu : ఉల్లి దోసె, ఎగ్ దోసె, కారం దోసె ఇలా దోసె మాత్రమే ఎన్నో రకాలుగా వేసుకునే అవకాశం ఉంది అయితే, ఎన్ని రకాలుగా వేసినా సరే పిండి కలుపుకోవడంలోనే కిటుకు ఉంది. దోసె వేసుకున్న తర్వాతే పైన ఉల్లిపాయలు, ఎగ్, కారం వేసుకుంటారు కాబట్టి దోసెలు చక్కగా రావాలంటే పిండి కలపడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హోటళ్లలో దోసెలు పొంగడానికి వంట సోడా వేస్తారని చాలా మంది అనుకుంటారు కానీ, సరైన కొలతల్లో పదార్థాలు తీసుకుంటే వంట సోడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అసలు హోటల్ వాళ్లు వంట సోడా వేయరని తెలుసా? సరిగ్గా హోటల్ స్టైల్లో ఇలా దోసెలు వేసిచూడండి! ఎంతో రుచికరంగా వస్తాయి.
"పెసర గారెలు" ఇలా చేస్తే అస్సలు నూనె పీల్చవు - ఇదొక్కటి వేసి చూడండి కొత్త ఫ్లేవర్ అద్దిరిపోతుంది!

కావాల్సిన పదార్థాలు :
- మినపగుండ్లు - 1 కప్పు
- బియ్యం - 3 కప్పులు
- మెంతులు - 1 టేబుల్ స్పూన్
- పచ్చి శనగ పప్పు - 1 టేబుల్ స్పూన్
- అటుకులు - పావు కప్పు
- ఉప్పు - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం :
- ముందుగా మినపగుండ్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మినప్పప్పు ఏ కొలతలతో తీసుకుంటారో అదే కొలతతో బియ్యం కొలుచుకోవాలి. 1:3 రేషియోలో అంటే 1 గ్లాసుకు 3 గ్లాసుల చొప్పున బియ్యం వేసుకోవాలి. అందులోనే మెంతులు, పచ్చి శనగ పప్పు కూడా వేసుకుని రెండు, మూడు సార్లు కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి.

- నానబెట్టుకున్న తర్వాత మినపగుండ్లు, బియ్యం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా అనిపిస్తే అందులో కప్పు నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి రుబ్బుకునే మధ్యలో శుభ్రంగా కడిగిన అటుకులు వేసుకోవాలి.
- అటుకులను బియ్యంతో నానబెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే పిండిలో వేసుకుని కలుపుకోవడం వల్ల రుచిగా ఉంటుంది.

- ఇపుడు పిండిని గాలి చొరబడకుండా ఆరు గంటల పాటు పులియబెట్టుకోవాలి.
- బాగా పులిసిన పిండి గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
- హోటల్లో మందపాటి ఐరన్ పెనం ఉంటుంది కాబట్టి దోసె పిండి గట్టిగా ఉంటేనే బాగుంటుంది. కానీ ఇళ్లలో పెనం మందం తక్కువ కాబట్టి పిండిలో కొన్ని నీళ్లు పోసుకుని చిక్కగా చేసుకోవాలి.
- పిండి బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకుని దోసె వేసుకోవడమే. ఇపుడు పెనం వేడెక్కగానే దోసె పిండి వేసుకుని గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి.

ఇలా చేయండి :
- మినప్పప్పును రుబ్బడానికి ముందు నానబెట్టుకుని రుబ్బుకున్న తర్వాత 6 గంటలపాటు పులియబెట్టాల్సిందే!
- అటుకులను ముందే కాకుండా మినప్పప్పు రుబ్బుకునే సమయంలో వేసుకోవాలి.
"కొబ్బరి పచ్చడి"లో గుప్పెడు ఇవి వేసి చేయండి - రుచి అద్భుతంగా ఉంటుంది!
హోటల్ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏమీ లేదు! - పల్లీలను ఇలా చేసి చూడండి చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు!