ETV Bharat / offbeat

కమ్మని "దొండకాయ ప్లలీ రోటి పచ్చడి" - పల్లెటూరి పద్ధతిలో ఇలా చేస్తే ఎంతో బాగుంటుంది!

రోటి పచ్చళ్లు ఇష్టంగా తింటారా? - దొండకాయ పల్లీ రోటి పచ్చడి చేసేయండిలా!

Dondakaya Pachadi in Telugu
Dondakaya Pachadi in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2025 at 9:17 AM IST

2 Min Read
Choose ETV Bharat

Dondakaya Pachadi in Telugu : కొంతమంది దొండకాయ కర్రీ, ఫ్రై ఏది చేసినా ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మరి కొందరు కూర ఎంత బాగున్నా 'నో' చెబుతుంటారు. అలాంటి వారికి ఒక్కసారి దొండకాయ పల్లీ రోటి పచ్చడి చేసి పెట్టండి. ఈ చట్నీతో తృప్తిగా భోజనం చేస్తారు. ఈ దొండకాయ పల్లీ రోటి చట్నీ చపాతీలతో కూడా చాలా బాగుంటుంది.

అప్పటికప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తే "అక్కి రొట్టె" చేసుకోండి - స్నాక్స్, లంచ్​బాక్సుల్లోకి అదుర్స్!

దొండకాయలు
దొండకాయలు (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు

  • దొండకాయలు - పావు కేజీ
  • టమోటాలు - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి - 10
  • పల్లీలు - కప్పు
  • వెల్లుల్లి - 6
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • పావుటీస్పూన్​ - పసుపు
  • ఉల్లిపాయ - 1
  • టీస్పూన్​ - జీలకర్ర
  • ఆయిల్ - సరిపడా
పల్లీలు`
పల్లీలు (Getty Images)

పచ్చడి తయారీ విధానం :

  • ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి టేబుల్​స్పూన్​ ఆయిల్ వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో కప్పు పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి వేసి లో ఫ్లేమ్​లో ఫ్రై చేయండి.
  • పల్లీలు దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి టీస్పూన్​ జీలకర్ర, కట్​ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్​లో ఫ్రై చేయండి.
  • దొండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, పావుటీస్పూన్​ పసుపు వేసి ఫ్రై చేయండి.
Dondakaya Pachadi Process
Dondakaya Pachadi Process (ETV Bharat)
  • దొండకాయలు కాస్త మెత్తబడిన తర్వాత టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్​లో మగ్గించుకోండి.
  • టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్ చేయండి.
  • ఇప్పుడు ఒక రోటిలో ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
  • ఆపై ఇందులో వేయించుకున్న దొండకాయ టమోటా ముక్కలు, వెల్లుల్లి వేసి మెత్తగా దంచుకోండి.
  • చివరిగా ఒక ఉల్లిపాయ వేసి పచ్చడిని దంచుకొని గిన్నెలోకి తీసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ పల్లి రోటి పచ్చడి మీ ముందుంటుంది.
  • వేడివేడి అన్నంతో ఈ దొండకాయ పల్లి చట్నీ టేస్ట్ సూపర్​గా ఉంటుంది. ఈ చట్నీ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

రాగి పిండితో ఇడ్లీ, దోసెలే కాదు - "కమ్మటి గుంత పొంగనాలు" కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

కమ్మటి "పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి" - వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది!