ETV Bharat / offbeat

ఫ్రిడ్జ్​లో ఉంచిన పుచ్చకాయ తింటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి! - DO NOT STORE WATERMELON IN FRIDGE

పుచ్చకాయను ఫ్రిడ్జ్​లో పెట్టి తింటున్నారా? - అయితే, ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

WATERMELON IN FRIDGE
Do not Store Watermelon In Fridge (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 12, 2025 at 3:41 PM IST

2 Min Read

Do not Store Watermelon In Fridge : వేసవిలో చాలా మంది సాలిడ్ ఫుడ్స్ కంటే హెల్దీ డ్రింక్స్, చలువ చేసే పండ్లను తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అందులో సమ్మర్ స్పెషల్​ ఫ్రూట్​గా చెప్పుకునే పుచ్చకాయ ఫస్ట్ ప్లేస్​లో ఉంటుంది. ఈ పండుని ముక్కలుగా తిన్నా, జ్యూస్ చేసి తాగినా కడుపులో చల్లదనం పాటు మనసుకీ ఎంతో హాయినిస్తుంది. అందుకే, వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.

ఈ క్రమంలోనే కొందరు బయటకు వెళ్లినప్పుడు ఐదారు పుచ్చకాయలను కొనుగోలు చేసి ఇంటికి తెస్తుంటారు. అలాగే, పెద్ద సైజ్​లో ఉన్న వాటర్​ మెలన్​ని తీసుకున్నప్పుడు సగం తిని, మిగతా భాగం ఫ్రిడ్జ్​లో స్టోర్ చేస్తుంటాం. మీరు ఇలానే చేస్తున్నారా? అయితే, ఆ అలవాటు మానుకోవాలంటున్నారు నిపుణులు. వీలైనంత వరకు పుచ్చకాయను ఫ్రిడ్జ్​లో నిల్వ ఉంచకుండా తినడమే బెటర్ అంటున్నారు. అసలు, పుచ్చకాయను ఎందుకు ఫ్రిడ్జ్​లో స్టోర్ చేయకూడదు? అలా నిల్వ చేసిన వాటిని తింటే ఏమవుతుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 90 శాతం పైగా వాటర్ కంటెంట్ ఉండే దీన్ని తినడం ద్వారా బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే, వాటర్​మెలన్​లో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, అమైనో అమ్లాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, సమ్మర్​లో దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాగే, పుచ్చకాయను తాజాగా ఉన్నప్పుడే తీసుకోవడం బెటర్ అంటున్నారు. అంతేకానీ, ఫ్రిజ్డ్​లో స్టోర్ చేసిన వాటిని తినడం వీలైనంత వరకు తగ్గించాలంటున్నారు. పలు పరిశోధనల్లోనూ అలాంటి వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వెల్లడైంది.

మీరు తినే 'పుచ్చకాయ' కల్తీది కావొచ్చు - FSSAI సూచిస్తున్న ఈ చిన్న టెస్ట్​తో ఈజీగా గుర్తించండి!

ఫ్రిడ్జ్​లో ఎందుకు పెట్టకూడదంటే? పుచ్చకాయ లేదా కట్​ చేసిన తర్వాత ముక్కలు ఫ్రిడ్జ్​లో ఉంచడం వల్ల అందులోని కీలక పోషకాలైన లైకోపీన్, విటిమిన్లు ఎ, సి తగ్గుతాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా, వాటర్​ మెలన్​ ముక్కలు ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్​లో ఉంచడం వల్ల అందులోని రసం రంగు మారడమే కాకుండా రుచి తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే, పుచ్చకాయ కోసిన తర్వాత ఫ్రిడ్జ్​లో ఉంచితే అందులోని తేమ బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుందని, అలాంటిసమయంలో దాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందట. అలాగే, కొందరిలో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు దారి తీయవచ్చంటున్నారు.

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్​లోనూ పుచ్చకాయను తగిన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయనప్పుడు అందులోని భౌతిక, రసాయన లక్షణాలు క్షీణించి, రసం నాణ్యత, పోషక విలువలు తగ్గడానికి కారణమవుతాయని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే, 'యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్' నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ఫ్రిజ్‌లో ఉంచిన వాటి కంటే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన పుచ్చకాయలో ఎక్కువ పోషకాలు ఉన్నాయని గుర్తించారు.

ఇదొక్కటి వేసి "పుచ్చకాయ జ్యూస్" చేసుకోండి - జ్యూస్ సెంటర్​ని మించిన టేస్ట్​తో భలేగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.