ETV Bharat / offbeat

ఎండుమిర్చి నానబెట్టి, ఉల్లిపాయలు మిక్సీ పట్టి - ఇలా "కోడిగుడ్డు గ్రేవీ" కర్రీ చేసుకోండి! - టేస్ట్ అద్భుతం!

- "కోడిగుడ్డు కూర" ఇలా వండి చూడండి - ఇంటిల్లిపాదీ కడుపునిండా కమ్మగా తినేస్తారు!

Egg Gravy Curry
Different Style Egg Gravy Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 15, 2025 at 1:09 PM IST

4 Min Read
Choose ETV Bharat

Different Style Egg Gravy Curry in Telugu : కోడిగుడ్డుతో ఎలాంటి వంటకాలు చేసినా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ త్వరగా అయిపోతుందని ఆమ్లెట్, ఎగ్ బుర్జీని చేసుకుంటుంటారు. మరికొందరు మాత్రం చిక్కని గ్రేవీతో 'గుడ్డు పులుసు' చేసుకుంటారు. అయితే, ఎప్పుడు ఒకేలా​ కాకుండా ఈసారి న్యూ స్టైల్​లో "ఎగ్ గ్రేవీని" ట్రై చేయండి. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమంతో చేసుకునే ఈ కర్రీ రుచి మైమరిపించేలా ఉంటుంది. అన్నం, జీరా రైస్, బిర్యానీ, బగారా రైస్, చపాతీ, రోటీ ఇలా దేనిలోకైనా సైడ్​ డిష్​గా అద్దిరిపోతుంది. ఒకసారి తింటే ఎప్పుడూ ఇదే పద్ధతిలో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి, లేట్ చేయకుండా అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Different Style Egg Gravy Curry
Eggs (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు :

ఉల్లిపాయ పేస్ట్ కోసం :

  • ఎండుమిర్చి - 10
  • అల్లం - అంగుళం ముక్క
  • వెల్లుల్లి రెబ్బలు - ఆరు
  • మీడియం సైజ్ ఉల్లిపాయలు - రెండు
  • జీడిపప్పు పలుకులు - పది
  • పుదీనా - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా
  • పెద్ద సైజ్ టమాటా - ఒకటి

ఎగ్స్ వేయించడం కోసం :

  1. బాయిల్డ్ ఎగ్స్ - ఐదు
  2. నూనె - రెండుటీస్పూన్లు
  3. పసుపు - పావుటీస్పూన్
  4. కారం - అరటీస్పూన్
  5. ఉప్పు - అరటీస్పూన్

మిలిటరీ స్టైల్​ "చికెన్ ఫ్రై" - ముక్క మిగల్చకుండా తినేస్తారు!

Different Style Egg Gravy Curry
Egg Gravy Curry (ETV Bharat)

తయారీ విధానం :

  • ఈ డిఫరెంట్ స్టైల్ ఎగ్ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో ఎండుమిర్చిని వేసి కొద్దిసేపు నాననివ్వాలి.
  • ఆలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె లైట్​గా వేడయ్యాక బాయిల్డ్ ఎగ్స్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని గుడ్లు కొద్దిగా రంగు మారే వరకు లో ఫ్లేమ్​లో వేయించుకొని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
Egg Gravy Curry in Telugu
Egg Gravy Curry (ETV Bharat)
  • అనంతరం అదే పాన్​లో మరో టేబుల్​స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పలుకులు వేసి ఆనియన్స్ కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని వాటిని కాసేపు వేయించాలి. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని సాఫ్ట్​గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి.
  • మిశ్రమం మొత్తం చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన ఉల్లిపాయ మిశ్రమం, నానబెట్టుకున్న ఎండుమిర్చి, కొద్దిగా మిర్చి నానబెట్టిన వాటర్​ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి.
Egg Gravy Curry in Telugu
Egg Gravy Curry (ETV Bharat)

కర్రీ కోసం :

  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • బిర్యానీ ఆకు - ఒకటి
  • లవంగాలు - నాలుగు
  • యాలకులు - రెండు
  • దాల్చినచెక్క - అంగుళం ముక్క
  • షాజీరా - అరటీస్పూన్
  • పసుపు - పావుటీస్పూన్
  • ధనియాల పొడి - ఒకటీస్పూన్
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • గరంమసాలా - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కసూరి మేతి - ఒక టీస్పూన్
  • ఫ్రెష్ క్రీమ్ - రెండు టేబుల్​స్పూన్లు

"మామిడికాయ పప్పు" చేసుకునే అసలైన పద్ధతి ఇదే! - ఇలా చేస్తే కమ్మని సువాసనతో నోరూరిస్తుంది!

Different Style Egg Gravy Curry
Onion Paste (ETV Bharat)
  • ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ ​కాస్త కాగిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసుకొని లో ఫ్లేమ్​లో వేయించాలి.
  • మసాలా దినుసులు లైట్​గా వేడయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని లో టూ మీడియం ఫ్లేమ్​లో కంటిన్యూస్​గా కలుపుతూ అందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆ మిశ్రమం బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వేసుకొని అవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి.
Egg Gravy Curry in Telugu
Different Style Egg Gravy Curry (ETV Bharat)
  • తర్వాత అందులో గ్రేవీకి సరిపడా వాటర్(ఒక గ్లాసు) పోసుకొని, రుచికి తగింత ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై మూతపెట్టి మీడియం ఫ్లేమ్​లో రెండుమూడు నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం వేయించి పక్కనుంచిన ఎగ్స్​, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మరోసారి మొత్తం కలిసేలా బాగా కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్​లో ఇంకో నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి.
  • కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే న్యూ స్టైల్ "ఎగ్ గ్రేవీ కర్రీ" రెడీ!
Egg Gravy Curry in Telugu
Egg Gravy Curry Recipe (ETV Bharat)

టిప్స్ :

  • ఎండుమిర్చిని నార్మల్​ వాటర్​లో కాకుండా వేడి నీటిలో నానబెట్టుకుంటే పదినిమిషాల్లో చక్కగా నానుతాయి. అదే, చల్లని నీటిలో అయితే కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోవాలి.
  • ఉల్లిపాయ మిశ్రమం పేస్ట్​ని వేయించేటప్పుడు అడుగంటకుండా కంటిన్యూస్​గా కలుపుతూ నూనె సెపరేట్ అయ్యే వరకు వేయించాలి.
  • ఈ రెసిపీలో ఫ్రెష్ క్రీమ్ వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది లేకపోతే పాల మీద మీగడ వేసుకున్నా కర్రీ మంచి రుచికరంగా వస్తుంది.

ఘుమఘుమలాడే "చింతచిగురు ఎండురొయ్యల కూర" - ఇలా చేశారంటే రుచి అద్భుతం!