ETV Bharat / offbeat

పెసరపప్పుతో కమ్మనైన "ధారాక్షి స్వీట్" - పైన కరకర, లోపల జ్యూసీగా! - DHARAKSHI SWEET RECIPE IN TELUGU

- స్వీట్ ప్రియుల కోసం సరికొత్త రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!

Dharakshi Making
Dharakshi Sweet at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 8, 2025 at 8:25 PM IST

2 Min Read

How to Make Dharakshi at Home : నోట్లో వేసుకోగానే కరకరలాడుతుంది. ఒక బైట్ తర్వాత జ్యూసీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. అదే మన "ధారాక్షి స్వీట్". కేవలం పెసరపప్పుతో చేసే ఈ రెసిపీ, స్వీట్ లవర్స్​ను మెస్మరైజ్ చేస్తుంది. ఫెస్టివల్స్ టైమ్​లో, ఏదైనా స్పెషల్ డేస్​లో సూపర్ ఆప్షన్. జంతికల మాదిరిగా రకరలాడే ఈ స్వీట్, మీ హ్యాపీ మూడ్​ను డబుల్ చేస్తుంది. మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  1. పెసరపప్పు - ఒక కప్పులో 3 వంతులు
  2. మిన పప్పు - మిగిలిన 1 వంతు
  3. పంచదార - 2 కప్పులు
  4. నీరు - ఒకటిన్నర కప్పులు
  5. యాలకుల పొడి - పావు స్పూన్
  6. నిమ్మరసం - అర చెక్క
  7. ఫుడ్ కలర్ - (ఆప్షనల్)
  8. ఉప్పు - తగినంత

పాలు, షుగర్ లేకుండా "రవ్వ లడ్డూ" తయార్ - ఇదే ఈ రెసిపీ సీక్రెట్! - అమ్మా ఇంకో లడ్డూ అంటారు!

తయారీ విధానం:

  • ముందుగా ఒక బౌల్​లోకి పెసరపప్పు, మినప గుళ్ళు తీసుకొని శుభ్రంగా కడగాలి.
  • ఈ పప్పులను ఫ్రెష్ నీళ్లలో పోసి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. పప్పులు ఎంత బాగా నానితే పిండి అంత మెత్తగా వస్తుంది.
  • ఇప్పుడు నానిన పప్పుల్లోని నీటిని వంపి, గ్రైండ్ చేసుకోవాలి. స్పూన్​తో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి.
  • పిండి పలుచగా ఉండకూడదు. గట్టిగానే ఉండాలి.
  • ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకొని, ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి.

చక్కెర పాకం తయారీ:

  • ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి, అందులో చక్కెర, వాటర్ వేయండి. స్టౌ మీడియంలో ఉంచాలి.
  • చక్కెర పూర్తిగా కరిగి, పాకం కొంచెం బంకగా వచ్చే వరకు ఉంచాలి.
  • మరీ తీగ పాకం అవసరం లేదు. చేతికి బంకగా అంటుకుంటే సరిపోద్ది.
  • పాకం ఓకే అనుకున్న తర్వాత యాలకుల పొడి, అర చెక్క నిమ్మరసం పిండి, దింపి పక్కన పెట్టుకోవాలి.

స్వీట్ తయారీ :

  • ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక పెద్ద కడాయి స్టౌ మీద పెట్టి, కావాల్సినంత నూనె పోసి వేడి చేయాలి.
  • ఆ తరువాత, ఒక పాల ప్యాకెట్ వంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకుని, దానికి ఒకవైపు చివరన కాస్తంత రంధ్రం చేసుకోవాలి. ఈ రంధ్రం నుంచే పిండిని నూనెలో వేయాల్సి ఉంటుంది. (మరో వైపు నుంచి పిండిని కవర్​లోకి వేసుకోవాలి.)
  • మంటను మీడియంలోనే ఉంచి, జంతికల ముక్కల మాదిరిగా చిన్న రంధ్రం నుంచి పిండిని నూనెలో వేయాలి.
  • అలా వేసిన పిండి గోల్డెన్ కలర్​లోకి మారేంత వరకు వేయించాలి. వేగిన వాటిని తీసి వెంటనే వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసుకోవాలి.
  • దాదాపు 5 నిమిషాలు ఆ పాకంలో ఉంచితే అవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి.
  • ఒకవేళం పాకం మధ్యలో చల్లారితే మరోసారి వేడి చేసుకొని, మిగిలిన స్వీట్​ మొత్తాన్ని ఇలా తయారు చేసుకోవాలి.
  • అంతే, పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే "ధారాక్షి స్వీట్" రెడీ అయిపోతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.

వయసొచ్చిన అమ్మాయిలు, పీరియడ్స్​​లో స్త్రీలు తప్పక తినాల్సిన "సున్ని సంగటి" - పాతకాలంలో ఇదే తినేవారు!

ఆడవాళ్లు తప్పక తినాల్సిన "స్వీట్" - వెయిట్​ లాస్​కి బెస్ట్ ఆప్షన్! - అమ్మమ్మల పద్ధతిలో ఇలా రెడీ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.