Summer Special Desserts in Telugu : ఇది కాఫీ, టీ తాగే కాలం కాదు. ఎండలు మండే ఈ సమయంలో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చల్లని పదార్థాలు కోరుకుంటుంటారు. అలాగే రెగ్యులర్‌గా ఐస్‌క్రీమో, లస్సీనో, కుల్ఫీనో తినాలంటే కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే మీకోసం రెండు స్పెషల్ సమ్మర్ రెసిపీలు తీసుకొచ్చాం. వీటిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇంటిల్లిపాదీ ఆస్వాదించొచ్చు. ఇవి రుచికరంగా ఉండడమే కాదు హెల్దీవి కూడా. మరి, అవేంటి? వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

డ్రైఫ్రూట్స్ మిల్క్‌షేక్(Dry Fruits Milkshake) :
ఈ టిప్స్‌తో మరింత రుచికరం :
- ఎండలకు నీరసించి పోకుండా చాలా బాగా తోడ్పడే ఈ రెసిపీకి స్వీట్నెస్ కోసం చక్కెర వద్దనుకుంటే మొత్తం తేనెను తీసుకోవచ్చు.
- ఈ రెసిపీలో వెనీలా ఎసెన్స్కి బదులుగా యాలకుల పొడిని వాడుకోవచ్చు.
- ఇందుకోసం ముందుగానే పాలను కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి.
- ఈ రెసిపీ మొత్తానికి 650ఎంఎల్ వరకు పాలు అవసరమవుతాయి.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- జీడిపప్పు పలుకులు - పావు కప్పు
- బాదం పలుకులు - 10
- కిస్మిస్లు - ఒక టేబుల్‌స్పూన్
- పిస్తా పలుకులు - అరటేబుల్‌స్పూన్
- వాల్నట్స్ - 3
- అంజీర్ - 4
- ఖర్జూర పండ్లు - 10
- టూటీ ఫ్రూటీ - 1 టేబుల్‌స్పూన్
- చక్కెర - 2 టేబుల్‌స్పూన్లు
- తేనె - 2 టేబుల్‌స్పూన్లు
- వెనీలా ఎసెన్స్ - 1 టీస్పూన్
- పాలు - ఒకటిన్నర కప్పులు
- చిల్డ్ మిల్క్ - 1 కప్పు
నిమ్మకాయతో కాదు సోంపుతో "షర్బత్" చేసుకోండి - మండే ఎండల్లో ఒక్క గ్లాసు తాగితే ఫుల్ రిలీఫ్!

తయారీ విధానం :
- ఈ మిక్స్షేక్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పలుకులు, కిస్మిస్లు, పిస్తా, వాల్నట్స్, అంజీర్, గింజలు తీసిన ఖర్జూర పండ్లు వేసుకోవాలి.
- అలాగే, టూటీ ఫ్రూటీ, చక్కెర, తేనె, వెనీలా ఎసెన్స్, కాచి చల్లార్చి ఫ్రిడ్జ్‌లో ఉంచిన పాలు ఇలా అన్నింటినీ వేసుకున్నాక హై స్పీడ్‌లో 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కల్లాంటివి లేకుండా బ్లెండ్ చేసుకోవాలి.
- ఆవిధంగా బ్లెండ్ చేసుకున్నాక కాచి చల్లార్చుకొని ఐస్ ట్రేలలో క్యూబ్స్ మాదిరిగా ఫ్రీజ్ చేసుకున్న చిల్డ్ మిల్క్ క్యూబ్స్ వేసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి.
- స్మూతీ టెక్చర్ వచ్చేలా బ్లెండ్ చేసుకున్నాక సర్వింగ్ గ్లాసులలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పైన కొన్ని సన్నని డ్రైఫ్రూట్స్ తరుగుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్" రెడీ!
మండుటెండల్లో హాయినిచ్చే "టీ"లు - ఒక్కసారి తాగారంటే ఆ టేస్ట్ మర్చిపోలేరు!

మ్యాంగో ఫలూదా(Mango Falooda) :
ఈ టిప్స్‌తో పర్ఫెక్ట్ టేస్ట్ :
- సేమియా చక్కగా ఉడికిందని ఎలా తెలుసుకోవాలంటే బాయిల్ చేశాక గరిటెతో కొద్దిగా తీసుకొని విరిచినప్పుడు ఈజీగా బ్రేక్ అవుతే అప్పుడు సేమియా మంచిగా ఉడినట్లు తెలుసుకోవాలి.
- మీరు ఎప్పుడైతే ఫలూదాని సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడే మ్యాంగో ముక్కలు, ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలి. అలాకాకుండా ముందే చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఫ్రెష్‌నెస్ తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి.
- ఈ రెసిపీకి కావాల్సిన రోజ్ సిరప్ మార్కెట్లో దొరుకుతుంది.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- సేమియా - అర కప్పు
- సబ్జా గింజలు - 2 టీస్పూన్లు
- కాచి చల్లార్చిన పాలు - 1 కప్పు(250ఎంఎల్)
- పంచదార - 1 టేబుల్‌స్పూన్
- మామిడి పండు - 1(పెద్ద సైజ్ది)
- సన్నని డ్రైఫ్రూట్స్ తరుగు - కొద్దిగా
- ట్యూటీ ఫ్రూటీ - కొద్దిగా
- ఐస్ క్యూబ్స్ - కొన్ని
- రోజ్ సిరప్ - కొద్దిగా
- మ్యాంగో ఐస్‌క్రీమ్ - రెండు చెంచాలు

తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో సబ్జా గింజలను తీసుకొని పావుగంట పాటు నానబెట్టుకోవాలి.
- అనంతరం స్టౌ మీద పాన్ పెట్టుకొని రెండు లేదా మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో సేమియా వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- సేమియాను చక్కగా ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని వడకట్టుకోవాలి. ఆపై దాన్ని ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకొని అందులో వేసుకొని చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఆపై అందులో చక్కెర వేసుకొని పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి.
- అనంతరం ఐస్‌వాటర్‌లో వేసుకున్న సేమియా, నానబెట్టుకున్న సబ్జా గింజలు, పాలు ఈ మూడింటిని 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా అవన్నీ కూల్ అవుతాయి.
- ఈలోపు ఒక పెద్ద బంగినపల్లి మామిడిపండును తీసుకొని పైన తొక్కను తొలగించుకోవాలి. ఆపై శుభ్రంగా కడిగి అందులో సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన సగాన్ని ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే, ఐస్‌క్యూబ్స్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకొని పక్కనుంచాలి.

- ఇలా ఫలూదాకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నాక ఒక సర్వింగ్ గ్లాసు తీసుకొని అందులో ఒక్కో టేబుల్‌స్పూన్ చొప్పున సబ్జా గింజలు, మ్యాంగో ముక్కలు, సేమియా, రోజ్ సిరప్, ఐస్ ముక్కలు, మ్యాంగో ప్యూరీ ఇలా అన్నింటినీ గ్లాసు ఫిల్ అయ్యే వరకు లేయర్స్ మాదిరిగా వేసుకోవాలి.
- ఇక చివర్లో పైన కొద్దిగా మ్యాంగో ఫ్లేవర్ ఐస్‌క్రీమ్, దాని మీద డ్రైఫ్రూట్స్ తరుగు, ట్యూటీ ఫ్రూటీ వేసుకొని కొన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచిన పాలను పోసుకొని మిక్స్ చేసుకొని తీసుకున్నారంటే చాలు.
- అంతే, స్ట్రీట్ స్టైల్లో యమ్మీ యమ్మీగా "మ్యాంగో ఫలూదా" ఇంట్లోనే రెడీ అయిపోతుంది.
- సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం వేళ ఒక్క గ్లాసు తాగారంటే ఆహా ఈ జన్మకి చాలు అనిపిస్తుంది. అంత రుచికరంగా ఉంటుంది ఈ ఫలూదా!