YELLOW CUCUMBER RECIPE IN TELUGU : కూరగాయల భోజనంలో ఉన్న సంతృప్తి మరే ఇతర ఆహారపదార్థాలు కూడా ఇవ్వలేవు. తెల్లన్నం, కాస్త పప్పు, మరో ఫ్రై, నెయ్యి, రసం, పెరుగు ఇలా సింపుల్గా ముగించేస్తుంటారు. కర్రీల్లో ఎక్కువగా ఆలుగడ్డ, బెండకాయ వాడుతుంటారు. ఎప్పుడో ఒకసారి గానీ దోసకాయ గుర్తుకురాదు. అదికూడా దోసకాయ పప్పు, దోసకాయ చట్నీ ఇలా కలపడానికే వాడుతుంటారు. టమోటా తర్వాత కలపడంలో ఎక్కువగా వాడేది దోసకాయే. కానీ, ఇలాంటి దోసకాయ రెసిపీ ఎన్నడూ చూసి ఉండరు. ఒక్కసారి మనసు పెట్టి ఇలా చేశారంటే ఎప్పటికీ వదిలిపెట్టరు. దోసకాయ కుర్మా అంత బాగుంటుంది. ఫంక్షన్లలో వడ్డించే పచ్చి దోసకాయ చట్నీ ఎంత బాగుంటుందో సరిగ్గా ఈ కుర్మా అంతకంటే బాగుంటుంది.
"పెసర గారెలు" ఇలా చేస్తే అస్సలు నూనె పీల్చవు - ఇదొక్కటి వేసి చూడండి కొత్త ఫ్లేవర్ అద్దిరిపోతుంది!

కావాల్సిన పదార్థాలు :
- గట్టి పప్పు దోసకాయ - 1
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- దాల్చిన చెక్క - 2 అంగుళాలు
- యాలకులు - 2
- లవంగాలు - 3
- ధనియాలు - 1.5 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టీ స్పూన్
- గసగసాలు - 1 టీ స్పూన్
- (ట్నాల పప్పు, జీడిపప్పు)
- పచ్చి మిర్చి - 4
- ఉల్లిపాయ తరుగు - కప్పు
- అల్లం - ఇంచు
- వెల్లుల్లి - 12
- కొబ్బరి ముక్కలు - పావు కప్పు
- టమోటాలు - 2
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా

కర్రీ కోసం :
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- దోసకాయ ముక్కలు - 1.5 కప్పు
- కరివేపాకు - 1 రెమ్మ
- గరం మసాలా - పావు టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :
- దోసకాయ కుర్మా గ్రేవీ కోసం కడాయిలో నూనె పోసుకుని వేడెక్కగానే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర వెయ్యాలి. ఆ తర్వాత గసగసాలు వేసుకుని వేయించాలి. గసగసాలు లేని వాళ్లు పుట్నాల పప్పు లేదా జీడిపప్పు వేసుకున్నా సరిపోతుంది. ఆపై పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అవి మగ్గుతున్నపుడే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి వేసుకోవాలి.'

- ఆ తర్వాత టమోటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని మగ్గించాలి. ఇపుడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూతపెట్టుకుని ఉడికించుకోవాలి. టమోటా బాగా ఉడకడానికి అర కప్పు నీళ్లు పోసి మగ్గించుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇపుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని గట్టివి, చెక్కు తీసిన దోసకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేయించి కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.
- ఇపుడు మిక్సీ పట్టిన పేస్ట్, కప్పు నీళ్లు పోసుకుని బాగా కలపాలి. మంట సిమ్లో పెట్టుకుని దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా, చివరగా కొత్తిమీర చల్లుకుంటే చాలు. దోసకాయ కుర్మా రెడీ.
"కొబ్బరి పచ్చడి"లో గుప్పెడు ఇవి వేసి చేయండి - రుచి అద్భుతంగా ఉంటుంది!
"కొబ్బరి పచ్చడి"లో గుప్పెడు ఇవి వేసి చేయండి - రుచి అద్భుతంగా ఉంటుంది!