ETV Bharat / offbeat

'పచ్చిమామిడితో "పకోడీలు"' - 10 నిమిషాల్లో రెడీ - పిల్లలు తినడం మొదలు పెడితే ప్లేట్లు ఇట్టే ఖాళీ!

- కమ్మగా, పుల్లగా నోరూరిస్తాయి - ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Raw Mango Pakora
Raw Mango Pakora (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2025 at 9:48 AM IST

2 Min Read
Choose ETV Bharat

Easy Guide To Make Raw Mango Pakora : మెజార్టీ పీపుల్ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్​లో పకోడీ ఒకటి. చాలా మంది సాయంత్రం అయిందంటే చాలు మిర్చి బండ్లు, టీ స్టాల్స్ వద్ద చాయ్ తాగుతూ వీటిని తింటుంటారు. మరికొందరు ఇంట్లో పిల్లలకు ఈవెనింగ్ టైమ్​ స్నాక్​గా పకోడీని చేసి పెడుతుంటారు. అయితే, ఎక్కువ మంది ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకుంటుంటారు. లేదంటే అప్పుడప్పుడూ చికెన్, ఆలూ వంటి వాటితో ట్రై చేస్తుంటారు.

కానీ, అలాకాకుండా సమ్మర్​లో విరివిగా దొరికే పచ్చిమామిడితో ఎప్పుడైనా పకోడీని ట్రై చేశారా? లేదు అంటే మాత్రం ఓసారి తప్పకుండా ప్రయత్నించాల్సిందే. పుల్లగా, కారంగా ఉండే ఈ స్నాక్ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా లాగిస్తారు. పైగా ఈ పకోడీ కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం నోరూరించే పచ్చిమామిడితో పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • పచ్చి మామిడికాయ - ఒకటి
  • శనగపిండి - ఒక కప్పు
  • కారం - అర స్పూను(రుచికి తగినంత)
  • పసుపు - చిటికెడు
  • జీలకర్ర - ఒక టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆయిల్ - వేయించడానికి సరిపడా

పిల్లలకు ఎంతో నచ్చే "ఉల్లి మిక్చర్" - కేవలం 2 నిమిషాల్లోనే రెడీ!

Mango Pakora
Mango (Getty Images)

మామిడికాయ పకోడీ తయారీ విధానం :

  • ఈ స్నాక్ రెసిపీ కోసం ముందుగా తాజా పచ్చిమామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి పీలర్ సహాయంతో పై చెక్కు తీసుకోవాలి. ఆపై దాన్ని గ్రేటర్​తో ఒక ప్లేట్​లో చాలా సన్నగా తురుముకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా తురుముకున్న పచ్చిమామిడి తురుము, శనగపిండి, జీలకర్ర, కారం, పసుపు, సన్నని కొత్తిమీర తరగు, ఉప్పు వేసుకోవాలి.
  • తర్వాత తగినన్ని నీటిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పకోడీకి ఎంత జారుడుగా పిండి కావాలో ఆ విధంగా పిండిని కలుపుకొని సిద్ధంగా పెట్టుకోవాలి.
Mango Pakora
Kothimeera (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె కాగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని చేతిలోకి కొద్దికొద్దిగా తీసుకుంటూ పకోడీల్లా కాగుతున్న ఆయిల్​లో నెమ్మదిగా వేసుకోవాలి.
  • ఆపై వెంటనే కదపకుండా కాసేపు ఆగి తర్వాత జాలి గరిటెతో అటు ఇటు అనుకుంటూ మీడియం ఫ్లేమ్​ మీద పకోడీని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • తర్వాత వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్​లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని "మామిడికాయ పకోడీ" రెడీ!
  • ఇక ఈ పకోడీలను వేడి వేడిగా టమాటా సాస్ లేదా కొత్తిమీర చట్నీతో అద్దుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది! మరి, నచ్చితే మీరూ ఓసారి మ్యాంగో పకోడీలను ట్రై చేయండి.

3 ఉల్లిపాయలు, 5 నిమిషాలు - అప్పటికప్పుడు టేస్టీ టేస్టీ "వడలు" రెడీ!

నాలుగే పదార్థాలతో బండ్ల మీద అమ్మే "పెసర పునుగులు" - ఇంట్లోనే క్రిస్పీగా, సూపర్ టేస్టీగా చేసుకోండి!