ETV Bharat / offbeat

90's స్పెషల్​ "కొబ్బరి మిఠాయి" - కమ్మని రుచితో తినే కొద్ది తినాలనిపిస్తుంది - పావుగంటలో రెడీ! - COCONUT SWEET RECIPE

తక్కువ టైమ్​లో చేసుకునే సూపర్ స్వీట్ రెసిపీ - ఇలా చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

Coconut Sweet at Home
Coconut Sweet at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 29, 2025 at 4:46 PM IST

3 Min Read

Make Delicious Coconut Sweet at Home : నేటి రోజుల్లో అంటే స్వీట్ షాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో రకరకాల స్వీట్స్ దొరుకుతున్నాయి. కానీ, 90స్ టైమ్​లో అలాంటివేమి లభించేవి కాదు. విలేజ్​లలో ఇంటి వద్దే సింపుల్​గా, హెల్దీగా కొన్ని రకాల స్వీట్స్ తయారు చేసుకునేవారు. అలాంటి వాటిలో "కొబ్బరి మిఠాయి" రెసిపీ ఒకటి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్​ ఎంతో మధురంగా ఉంటుంది. ఆ పద్ధతిలో ఒకసారి చేస్తే నేటి తరం పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీని తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితో చాలా క్విక్​గా 10 నుంచి 15 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ మిఠాయిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Easy Coconut sweet Recipe
Kobbari (Getty Images)

ఈ టిప్స్​తో పర్ఫెక్ట్ టేస్ట్ :

  • ఈ మిఠాయికి బాగా ముదిరిన కొబ్బరికాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది.
  • అలాగే, కొబ్బరి ముక్కలను కట్ చేసుకునేటప్పుడు ఒకటి మందంగా, మరొకటి పల్చగా కాకుండా అన్ని ఒకే థిక్​నెస్ ఉండేలా కట్ చేసుకోవాలి.
  • ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కలకు కప్పు పంచదార సరిపోతుంది.
  • మీరు కావాలనుకుంటే ఈ రెసిపీని పంచదారకు బదులుగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు.
  • అలాగే, ఈ మిఠాయికి మీరు పచ్చికొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవడమే కాకుండా తురిమి కూడా వేసుకోవచ్చు.
Coconut sweet
Ghee (Getty Images)

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్
  • సన్నని పచ్చికొబ్బరి ముక్కలు - 1 కప్పు
  • పంచదార - ఒక కప్పు
  • యాలకుల పొడి - పావుటీస్పూన్

పిల్లలు స్వీట్ అడిగితే - ఇలా "తియ్యటి పూరీలు" చేసి పెట్టండి! - కనీసం 15 రోజులు నిల్వ!

Coconut sweet
Coconut sweet at Home (ETV Bharat)

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చికొబ్బరి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
  • కొబ్బరి ముక్కలు కొంచం వేగిన తర్వాత అందులో పంచదార, అర కప్పు నీళ్లు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి.
  • పాకం ఉడికి నురగలు రావడం స్టార్ట్ అయ్యాక యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత పాకం వచ్చిందో లేదో నీళ్లలో వేసి చెక్ చేసుకోవాలి. పాకం అనేది పర్ఫెక్ట్​గా వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే, మరుగుతున్న పాకాన్ని గరిటెతో కొద్దిగా తీసుకొని ప్లేట్​లో ఉన్న నీళ్లలో వేస్తే అది ఒకే చోట ఉండలా ఫామ్ అయి వాటర్​లో కరిగిపోకుండా గట్టిగా ఉంటుంది.
  • అలా ముదురు పాకం వచ్చే వరకు ఆ మిశ్రమాన్ని మరిగించుకోవాలి.
  • సరైన పాకం వచ్చేలోపు ఫ్లాట్​గా ఉండే ఒక ప్లేట్ మీద నూనె లేదా నెయ్యి రాసుకొని పక్కనుంచాలి.
Coconut sweet
Coconut sweet (ETV Bharat)
  • ఇప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని వెంటనే నెయ్యి రాసుకున్న ప్లేట్​లో పోసి పాకం అంతటికి కొబ్బరి ముక్కలు వచ్చేలా గరిటెతో సర్దుకోవాలి.
  • పాకం చాలా త్వరగా బిగుసుకుపోతుంది కాబట్టి ఫాస్ట్​గా కొబ్బరి ముక్కలను పాకం మొత్తం వచ్చేలా సరిచేసుకోవాలి.
  • అనంతరం దాన్ని పూర్తిగా చల్లారే వరకు అరగంట పాటు పక్కనుంచాలి.
  • చల్లారిన తర్వాత మిఠాయి ఈజీగా రావడానికి ఒక క్షణం పాటు ప్లేట్​ని స్టవ్ మీద ఉంచి వేడి చేస్తే సరిపోతుంది.
  • అనంతరం ఆ మిఠాయి చెక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, కమ్మని నోరూరించే 90స్​ స్పెషల్ "కొబ్బరి మిఠాయి"మీ ముందు ఉంటుంది!
  • దీన్ని ఎయిర్​టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే కనీసం వారం రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటుంది!
Coconut sweet Recipe
Coconut sweet (ETV Bharat)

బియ్యం, బెల్లంతో అరిసెలను తలదన్నే "స్వీట్" - పాకం లేకుండానే ఈజీగా చేసుకోండిలా!

బూందీ గరిటె లేకుండానే - పావుగంటలో కమ్మని "మోతీచూర్ లడ్డూలు"! - సూపర్ సాఫ్ట్​ అండ్ కిర్రాక్ టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.