ETV Bharat / offbeat

మీ ఇంట్లో కొబ్బరి మిగిలిపోయిందా? - ఇలా "కాలా జామూన్" చేసుకోండి- నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది! - COCONUT KALA JAMUN

-ఇంట్లో ఉండే పదార్థాలతోనే కాలా జామూన్​ తయారీ -మీరు ఓసారి ట్రై చేయండి!

Coconut Kala jamun Recipe
Coconut Kala jamun Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 11:46 AM IST

Coconut Kala jamun Recipe : అందరికీ ఇష్టమైన స్వీట్లలో గులాబ్​ జామూన్​ ఒకటి. అయితే, అందులో కొంచెం మార్పులతో చేసే స్వీట్​ "కాలా జామూన్​". అయితే కాలా జామూన్​ చేయాలంటే కోవా, పాల పౌడర్​ వంటి రకరకాల పదార్థాలు ఉండాలని చాలా మంది ఈ స్వీట్​ని ఇంట్లో ట్రై చేయరు. కానీ, ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఇవేవీ లేకుండా కేవలం కొబ్బరితోనే రుచికరమైన కాలా జామూన్​ తయారైపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా ఇంట్లో ఉండే పదార్థాలతో కాలా జామూన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కొబ్బరి ముక్కలు - కప్పు
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • బొంబాయి రవ్వ - కప్పు
  • గోధుమ పిండి - అరకప్పు
  • చక్కెర - కప్పు
  • యాలకుల పొడి - అరటీస్పూన్​
  • నీళ్లు - సరిపడా
  • ఉప్పు - చిటికెడు

తయారీ విధానం:

  • ముందుగా ఒక మిక్సీ గిన్నెలో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇందులో గ్లాసు నీళ్లను పోసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • తర్వాత ఒక క్లాత్​లో కొబ్బరి మిశ్రమం వేసి పాలను గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి నెయ్యి వేసి కరిగించండి. తర్వాత బొంబాయి రవ్వ వేసి 5 నిమిషాలు వేయించుకోండి.
  • ఇప్పుడు ఇందులోనే గోధుమ పిండి వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత కప్పు కొబ్బరి పాలు పోసి బాగా మిక్స్​ చేయండి.
  • పిండి కాస్త గట్టిగా మారిన తర్వాత చిటికెడు ఉప్పు వేసి కలిపి.. స్టౌ ఆఫ్​ చేయండి.
  • పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో రెండు నిమిషాలు మెదపండి.
  • తర్వాత కాలా జామూన్​ మీకు నచ్చిన ఆకారంలో చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి.
  • ఇప్పుడు పాకం కోసం స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో పంచదార, నీళ్లు వేసి కలపండి.
  • షుగర్​ కరిగి పాకం కాస్త చిక్కగా మారగానే యాలకుల పొడి వేసి కలపండి. తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.
  • కాలా జామూన్​ వేయించడం కోసం స్టౌపై పాన్​ పెట్టి సరిపడా నూనె​ వేయండి.
  • నూనె వేడిగా ఉన్నప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెడీ చేసిన జామూన్ వేయండి.
  • జామూన్​ వేసిన వెంటనే గరిటెతో కదిలించకండి. ఒక 4 నిమిషాల తర్వాత మెల్లిగా ఫ్రై చేసుకోండి.
  • జామూన్​ బాగా వేగిన తర్వాత కాస్త వేడిగా ఉన్న షుగర్​ సిరప్​లో వేయండి.
  • కాలా జామూన్​ని ఒక రెండు గంటల పాటు అలా వదిలేయండి.
  • తర్వాత తింటే సూపర్​ టేస్టీగా ఉంటాయి.
  • అంతే ఇలా చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలా జామూన్​ రెడీ.
  • నచ్చితే ఈ స్వీట్​ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే "కొబ్బరి జున్ను" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్ అంతే!

దీపావళి వేళ ఈ వెరైటీ బూరెలు ఎప్పుడైనా ట్రై చేశారా? - చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు! - టేస్ట్ అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.