Telangana Panchayat Elections Results2025

ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే "చింతపండు చారు" - అన్నంలోకి నేరుగా తినడమే కాదు తాగేస్తారు కూడా - ప్రిపరేషన్​ వెరీ ఈజీ!

- నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు - ముద్దపప్పు, చికెన్​ ఫ్రైలోకి సూపర్ కాంబినేషన్​!

Chintapandu Charu Recipe
Chintapandu Charu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2025 at 1:45 PM IST

2 Min Read
Choose ETV Bharat

Chintapandu Charu Recipe : కూరలు ఎన్ని ఉన్నా చారుతో ఓ ముద్ద తింటేనే అసలు మజా. అందుకే చాలా మంది కూరలతో పాటు టమాటా చారు, పప్పు చారు, సాంబార్ వంటివి తప్పక చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఇవే తినాలంటే కాస్త బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అందుకే ఓసారి "చింతపండు చారు" చేసుకోండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి చారుతో అన్నం జుర్రుకుంటే ఆ టేస్టే వేరు. సూపర్​ టేస్టీగా ఉండే ఈ చారుతో అన్నం తినేకొద్దీ తినాలనిపిస్తుంది. ముద్ద పప్పు, నాన్​వెజ్ ఫ్రై రెసిపీల్లోకి ఈ చారు సైడ్ డిష్​గా అద్దిరిపోతుంది. పైగా ఇది చేయడానికి ఎక్కువ టైమ్​ కూడా పట్టదు. మరి, ఈజీగా చింతపండు చారు చేయడానికి ఏయే పదార్థాలు అవసరం? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజ్​
  • ఉప్పు - సరిపడా
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ - 1
  • టమాటా - 1
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - అర టీస్పూన్​
  • రసం పొడి - 1 టేబుల్​స్పూన్​
  • బెల్లం తురుము - 1 టీస్పూన్​
Chintapandu Charu Recipe
Chintapandu Charu Recipe (ETV Bharat)

తాలింపు కోసం:

  • నూనె - 1 టేబుల్​స్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • ఆవాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • ధనియాలు - 1 టీస్పూన్​
  • ఎండుమిర్చి - 2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Chintapandu Charu Recipe
Chintapandu Charu Recipe (ETV Bharat)

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్​, టీ స్పూన్​ ఉప్పు వేసి పావు గంట సేపు నానబెట్టాలి. ఈ లోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాను మీడియం సైజ్​లో ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన ఉంచాలి.
  • చింతపండు నానిన తర్వాత బాగా పిసికి పిప్పిని తీసేసి ఈ చారును ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి పులుపుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆపై అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, పసుపు, రసం పొడి వేసి కూరగాయ ముక్కలను చేతితో నలుపుతూ రసంలో కలుపుకోవాలి.
Chintapandu Charu Recipe
Chintapandu Charu Recipe (ETV Bharat)
  • ఈ చారు గిన్నెను స్టవ్​ మీద పెట్టి మీడియం ఫ్లేమ్​లో కలుపుతూ మరిగించుకోవాలి. చారు మరిగేటప్పుడు బెల్లం తురుము వేసి మరికొద్దిసేపు మరిగించుకోవాలి.
  • చారు మరిగేలోపు మరో స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసుకోవాలి. కాగిన నూనెలో దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
Chintapandu Charu Recipe
Chintapandu Charu Recipe (ETV Bharat)
  • ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి తుంపలు వేసి ఫ్రై చేసి చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఈ తాలింపు మిశ్రమాన్ని మరుగుతున్న చారులో వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేసి మూత పెట్టి వదిలేయాలి.
  • 5 నిమిషాల తర్వాత మూత తీసి కలిపి సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ చింతపండు చారు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Chintapandu Charu Recipe
Chintapandu Charu Recipe (ETV Bharat)

చిట్కాలు:

  • చింతపండు పులుపుకు తగినట్లుగా నీరు కలుపుకుంటే చారు రుచి బాగుంటుంది.
  • ఈ చారు ఎంత ఎక్కువ సేపు మరిగిస్తే రుచి అంత బాగుంటుంది, కాబట్టి దానిని బట్టి మరిగించుకోవాలి.
  • కేవలం ఉల్లిపాయ, టమాటా మాత్రమే కాకుండా తొందరగా ఉడికే ఇతర కూరగాయలు వేసుకున్నా సరిపోతుంది.
Chintapandu Charu Recipe
Chintapandu Charu Recipe (ETV Bharat)

మంచి ఫ్లేవర్​తో ఘుమాయించే "మైసూర్ రసం" - ఈ పొడి వేసి చేసుకోవడంలోనే సీక్రెట్ అంతా!

అద్దిరిపోయే "గోంగూర పల్లీ పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే - తాలింపు కూడా అవసరం లేదు!