ETV Bharat / offbeat

"చింతచిగురు" ఇలా నిల్వ చేసుకోండి - సంవత్సరం పాటు ఎంజాయ్​ చేయొచ్చు!

- వేసవిలో దొరికే అద్భుతమైన ఔషధం చింతచిగురు - ఇలా నిల్వ చేసుకుంటే సంవత్సరం పైనే వాడుకోవచ్చు!

Chintachiguru Storage Tips
Chintachiguru Storage Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2025 at 11:31 AM IST

3 Min Read
Choose ETV Bharat

Chintachiguru Storage Tips: చింత చిగురు అంటే చాలా మందికి ఇష్టం. గ్రామాల్లో లభించే దీనితో పప్పు, పచ్చడి సహా చికెన్​, మటన్​, రొయ్యల వంటి వంటల్లో వేసుకుని తింటుంటారు. రుచితోపాటు ఔషధ గుణాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. ప్రస్తుతం చాలా చోట్ల కేజీ చింతచిగురు ధర 1000 పైనే ఉంది. అయినా దీనిని కొనేవారు ఎక్కువే ఉన్నారు. అయితే చింతచిగురు అన్ని కాలాల్లో దొరకదు. కేవలం ఎండాకాలంలో మాత్రమే లభ్యమవుతుంది. అందుకే సీజనల్​గా లభించే దీనిని ధర ఎక్కువైన సరే కొంచెం అయినా కొని కూరల్లో కలిపి తింటుంటారు.

ఎండాకాలంలో ఒకే, మరి ఇతర కాలాల్లో దీనిని తినాలంటే మళ్లీ సంవత్సరం వరకు వెయిట్​ చేయాల్సిందే. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా చింతచిగురును కూడా సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఏంటి నమ్మడం లేదా. కానీ మీరు విన్నది నిజమే. కచ్చితమైన కొలతలు, టిప్స్​ పాటిస్తే ఏడాది వరకు దీనిని నిల్వ చేసి కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. అందుకోసం మీ కోసం రెండు పద్ధతుల్లో ఎలా నిల్వ చేయాలో తీసుకొచ్చాం. మరి లేట్​ చేయకుండా ఎలా స్టోర్​ చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • చింతచిగురు - 1 కేజీ
  • ఉప్పు - 100 గ్రాములు
  • పసుపు - 2 టీస్పూన్లు
Chintachiguru Storage Tips
Chintachiguru Storage Tips (ETV Bharat)

మొదటి పద్ధతి:

  • ముందుగా లేత చింత చిగురు తీసుకుని ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
  • ఆ తర్వాత నీరు వంపేసి జల్లి బుట్టకు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆకులోని నీరు మొత్తం పోతుంది.
  • నీరు పూర్తిగా పోయిన తర్వాత ఈ చింతచిగురును కాటన్​ క్లాత్​ మీద పల్చగా పరిచి నీడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరబెట్టాలి.
Chintachiguru Storage Tips
Chintachiguru Storage Tips (ETV Bharat)
  • ఆరబెట్టే క్రమంలో మధ్యమధ్యలో కలుపుకోవాలి. చింతచిగురులో నీరు తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత చేతితో నలుపుకోవాలి.
  • చిగురును నలుపుకున్న తర్వాత అందులో ఉండే పుల్లలు, కాడలు శుభ్రంగా తీసేసుకోవాలి.
  • ఇలా శుభ్రం చేసుకున్న చింతచిగురును ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి మెత్తటి ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.
Chintachiguru Storage Tips
Chintachiguru Storage Tips (ETV Bharat)
  • చిగురు మొత్తం కలుపుకున్న తర్వాత తడి లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుని ఫ్రిజ్​లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉండే చింతచిగురు రెడీ.
  • ఒకవేళ మీ దగ్గర గాజు సీసాలు లేకపోతే జిప్​లాక్​ బ్యాగ్స్​లో స్టోర్​ చేసి ఫ్రీజర్​లో పెట్టుకుని వాడుకోవచ్చు.
Chintachiguru Storage Tips
Chintachiguru Storage Tips (ETV Bharat)

రెండో పద్ధతి:

  • లేత చింతచిగురు తీసుకుని అందులో ఉండే పుల్లలు, కాడలు తీసేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు, వేయించిన మెంతి పిండి ఒక స్పూన్​ వేసి బాగా కలుపుకోవాలి.
Chintachiguru Storage Tips
Chintachiguru Storage Tips (ETV Bharat)
  • ఆ తర్వాత ఈ చిగురును కొద్దికొద్దిగా మిక్సీజార్​లోకి వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి. వీలుంటే రోట్లో దంచుకున్నా మంచిదే.
  • బరకగా గ్రైండ్​ చేసుకున్న చిగురును ఓ పెద్ద ప్లేట్​లోకి తీసుకుని పల్చగా అనుకుని సుమారు 1 లేదా 2 గంటల పాటు ఫ్యాన్​ కింద ఆరబెట్టాలి.
Chintachiguru Storage Tips
Chintachiguru Storage Tips (ETV Bharat)
  • ఆ తర్వాత తడి లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుని ఫ్రిజ్​లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉండే చింతచిగురు రెడీ.
  • ఒకవేళ మీ దగ్గర గాజు సీసాలు లేకపోతే జిప్​లాక్​ బ్యాగ్స్​లో స్టోర్​ చేసి ఫ్రీజర్​లో పెట్టుకుని వాడుకోవచ్చు.
Chintachiguru Storage Tips
Chintachiguru Storage Tips (ETV Bharat)

చిట్కాలు:

  • చింతచిగురును ఎట్టి పరిస్థితులల్లో ఎండలో ఆరబెట్టొద్దు. ఇలా చేయడం వల్ల ఎండకు చిగురు వడబడి అందులో ఉండే రసం తగ్గుతుంది
  • అలాగే చింతచిగురు నిల్వ చేసేటప్పుడు ఉపయోగించే గిన్నెలు అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. అదే విధంగా మీ చేతులు కూడా తడి ఉండకూడదు. ఎందుకంటే తడి తగిలితే తొందరగా పాడవుతుంది.

"చేపల పులుసు - చింతచిగురు " ఈ కిర్రాక్​ టేస్ట్​ ఫీలవ్వాల్సిందే - ఇలా చేసుకుంటే జుర్రేస్తారు!