ETV Bharat / offbeat

"చింతచిగురు నిల్వ పచ్చడి" - ఈ కొలతలు, టిప్స్​ పాటిస్తే సంవత్సరం వరకు పాడవదు - రుచి సూపర్​ అంతే!

-చింతచిగురుతో పప్పు కాకుండా ఇలా పచ్చడి పెట్టుకోండి! -వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

Chintachiguru Nilva Pachadi
Chintachiguru Nilva Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 1, 2025 at 1:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chintachiguru Nilva Pachadi: నిల్వ పచ్చళ్లు అంటే మెజార్టీ పీపుల్స్​కు మామిడికాయ, టమాటా, నిమ్మకాయతో పెట్టినవి మాత్రమే తెలుసు. కానీ ఎన్నో రకాల పదార్థాలతో రుచికరమైన పచ్చళ్లు కూడా పెట్టుకోవచ్చు. అలాంటి వాటిలో చింతచిగురు ఒకటి. ఈ సీజన్​లో పుష్కలంగా లభించే ఈ చిగురుతో చాలా మంది పప్పు చేస్తుంటారు. లేదంటే నాన్​వెజ్​ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. కానీ ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి ఇలా నిల్వ పచ్చడి పెట్టండి. చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో, ఈ కొలతల ప్రకారం పెడితే దాదాపు సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తింటే అమృతమే. మరి లేట్​ చేయకుండా చింతచిగురు నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • చింతచిగురు - 3 కప్పులు
  • వెల్లుల్లి పాయలు - 4
  • మెంతులు - పావు టేబుల్​స్పూన్​
  • పల్లీ నూనె - 1 కప్పు
  • పసుపు - పావు టీస్పూన్​
  • ఉప్పు - పావు కప్పు
  • కారం - అర కప్పు
Chintachiguru Nilva Pachadi
Chintachiguru Nilva Pachadi (ETV Bharat)

తాలింపు కోసం:

  • ఆవాలు - 1 టేబుల్​ స్పూన్​
  • శనగపప్పు - 1 టీస్పూన్​
  • మినప్పప్పు - 1 టీస్పూన్​
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • కరివేపాకు - గుప్పెడు
  • ఎండుమిర్చి - 2
  • ఇంగువ - పావు టీస్పూన్​
  • నిమ్మకాయలు - 2(మీడియం సైజ్​)
Chintachiguru Nilva Pachadi
Chintachiguru Nilva Pachadi (ETV Bharat)

తయారీ విధానం:

  • ముందుగా లేత చింతచిగురు తీసుకుని అందులో ఉండే పుల్లలు, కాడలు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి జల్లెడలో వేసుకోవాలి.
  • నీరు మొత్తం పోయిన తర్వాత కాటన్​ క్లాత్​ మీద వేసి తడి పోయేంతవరకు ఫ్యాన్​ గాలికి ఆరబెట్టుకోవాలి.
  • ఈలోపు వెల్లుల్లి రెబ్పలపై లైట్​గా పొట్టు తీసేసి పక్కన ఉంచాలి. స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మెంతులు వేసి లో ఫ్లేమ్​లో దోరగా వేయించి స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన పెట్టాలి.
Chintachiguru Nilva Pachadi
Chintachiguru Nilva Pachadi (ETV Bharat)
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీజార్​లో వేసి మెత్తని పొడిలా చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీజార్​లో వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసి తీసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి అర కప్పు నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న చింతచిగురు వేసి లో ఫ్లేమ్​లో మగ్గించుకోవాలి.
  • చింతచిగురు మగ్గి నూనె పైకి తేలిన తర్వాత పసుపు వేసి కలిపి మరో 2 నిమిషాలు మగ్గించి స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
Chintachiguru Nilva Pachadi
Chintachiguru Nilva Pachadi (ETV Bharat)
  • చిగురు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి గ్రైండ్​ చేసిన మెంతి పిండి, దంచిన వెల్లుల్లి మిశ్రమం, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి మిగిలిన అర కప్పు నూనె పోసుకోవాలి. అంటే మొత్తంగా ఈ పచ్చడి కోసం కప్పు నూనె పడుతుంది.
  • కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి లో ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
Chintachiguru Nilva Pachadi
Chintachiguru Nilva Pachadi (ETV Bharat)
  • తాలింపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. చివరగా ఇంగువ వేసి వేయించిన తర్వాత చింతచిగురు మిశ్రమం వేసి బాగా కలుపుకుని ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసుకోవాలి. తక్కువైతే యాడ్​ చేసుకోవచ్చు. స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండి కలిపి గాజు సీసాలో పెట్టి మూత పెట్టి ఓ రోజు మొత్తం ఊరనివ్వాలి.
  • మరుసటి రోజు మూత తీసి కలిపి సర్వ్​ చేసుకుంటే కమ్మగా ఉండే చింతచిగురు నిల్వ పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Chintachiguru Nilva Pachadi
Chintachiguru Nilva Pachadi (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ పచ్చడి కోసం ఉపయోగించే చింతచిగురును లేతది తీసుకోవాలి. పుల్లలు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. చిగురు ఏ మాత్రం తడి ఉన్నా పచ్చడి పాడవుతుంది.
  • మీరు ఏ కప్పుతో అయితే చింతచిగురు కొలుచుకుంటారో అదే కప్పుతో ఉప్పు, కారం, నూనె వంటివి పైన చెప్పిన కొలతల ప్రకారం తీసుకోవాలి.
  • ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాలనుకుంటే పైన చెప్పిన పదార్థాలను పెంచి​ తీసుకోవాలి.
  • పచ్చడి కోసం ఉపయోగించే గిన్నె, గాజు జాడీ వంటివన్నీ పొడిగానే ఉండాలి. అలాగే పచ్చళ్ల ఉప్పు, కారాన్ని ఈ పచ్చడి కోసం ఉపయోగిస్తే రుచి మరింత బాగుంటుంది.
Chintachiguru Nilva Pachadi
Chintachiguru Nilva Pachadi (ETV Bharat)

ఈ ముద్ద వేసి "చేపల పులుసు" చేయండి - నీచు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది!

కుక్కర్​లో నిమిషాల్లోనే "మటన్​ పులావ్​" - వంట రానివాళ్లు కూడా చేసేయొచ్చు! - ఇంటిల్లిపాదీ కుమ్మేస్తారు!