ETV Bharat / offbeat

మనం మర్చిపోయిన "దేశీ కూరగాయ" - ఈ కర్రీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! - CHEMMAKAYA CURRY

కనిపిస్తే వెంటనే తెచ్చి వండుకోండి - అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది

chemmakaya_curry_in-telugu
chemmakaya_curry_in-telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 11, 2025 at 10:25 AM IST

2 Min Read

CHEMMAKAYA CURRY IN TELUGU : పాతకాలం నాటి వంటలు ఎన్నో మరుగున పడిపోయాయి. వాటి స్థానంలో ఫాస్ట్​ఫుడ్ రుచులు చేరాయి. దీంతో శరీరం అదుపు తప్పి వ్యాధులకు మూలమైపోయింది. ముఖ్యంగా దేశీ కూరగాయ అయినటువంటి చెమ్మకాయ ఈ తరం వాళ్లకు అస్సలు తెలియదు. అదేదో పిచ్చికాయ అనుకుని వదిలేస్తున్నారు. వాస్తవానికి చెమ్మకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. చెమ్మకాయలు, తమ్మకాయలు అని ప్రాంతాల వారీగా పిలుచుకునే ఈ కాయలతో ఆవ పచ్చడి కూడా పెడుతుంటారు. ఎలాంటి పురుగు మందులు వాడకుండానే అక్కడక్కడా పెరిగే ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వీటిని లేతగా ఉన్నపుడు మాత్రమే వండుకోవాలి. ముదిరినవి ఆరోగ్యానికి అంత మంచివి కావని గుర్తుంచుకోవాలి.

మీరెపుడైనా "బంగాళాదుంపల కర్రీ" ఇలా చేశారా? - అన్నం మొత్తం తినేసి వేళ్లు నాకేస్తారు!

కావాల్సిన పదార్థాలు :

  • చెమ్మకాయలు - పావుకిలో
  • వేరుశనగ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • అర స్పూన్ - ఆవాలు
  • 1 స్పూన్ - పచ్చి శనగ పప్పు
  • 1 స్పూన్ - మినపప్పు
  • పావు స్పూన్ - జీలకర్ర
  • ఉల్లిపాయలు - 3 మీడియం సైజు
  • పచ్చిమిర్చి - రెండు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • అల్లం పేస్ట్​ - 1 స్పూన్
  • టమోటాలు - 3
  • రుచికి సరిపడా - ఉప్పు
  • కారం - 2 స్పూన్లు
  • పసుపు - చిటికెడు

తయారీ విధానం :

  • చెమ్మకాయలు శుభ్రం చేసుకుని పీచు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో గింజల్లాంటి తెల్లటి పదార్థాన్ని కూడా తీసేసి కుక్కర్​లో వేసుకోవాలి. నీళ్లు పోసి మూత పెట్టుకుని 1 విజిల్ వచ్చే వరకు లో ఫ్లేమ్​లోనే ఉడికించుకోవాలి.
  • అవి ఉడికిన తర్వాత మంట కట్టేసి ప్రెజర్ పోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన నీళ్లు కూడా కొన్ని తీసుకోవాలి.
  • ఇపుడు కర్రీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ వేసుకోవాలి. అందులో అర స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చి శనగ పప్పు, 1 స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసి కలిపి మూత పెట్టుకోవాలి.
  • రెండు, మూడు నిమిషాలకు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్​, 3 టమోటాల తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి.
  • ఇపుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్​లో ఉడికించాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం చెమ్మకాయలు ఉడికించిన నీళ్లనే కొన్ని పోసుకుని మరో సారి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుని కొత్తి మీర తరుగు చల్లుకుంటే సరిపోతుంది.

"జంతికలు" పొంగడం చూశారా? - బొంబాయి రవ్వతో 'ఇలా' చేస్తే గుల్లగా వస్తాయి!

మృదువైన "రాగి ఇడ్లీలు" - ఈ టిప్స్​, కొలతలు పాటిస్తూ చేయండి పర్ఫెక్ట్​గా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.