Challa Punugulu and Tomato Chutney in Telugu : ఈవెనింగ్ స్ట్రీట్ ఫుడ్‌లో ఎక్కువ మంది చిట్టి పునుగులు ఇష్టంగా తింటారు. టిఫిన్ సెంటర్ వాళ్లు పునుగులతో పాటు సర్వ్ చేసే టమోటా చట్నీతో టేస్ట్ అద్దిరిపోతాయి. వేడివేడి చిట్టి పునుగులు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా చట్నీ సూపర్ కాంబినేషన్. అయితే, కొంతమంది మైదాతో చేసిన ఈ పునుగులు తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఇక్కడ చెప్పిన విధంగా గోధుమపిండితో పునుగులు ట్రై చేయండి. ఈ చల్ల పునుగులకు మంచి టమోటా చట్నీ కూడా పరిచయం చేస్తున్నాం. మరి ఈ రెండు రెసిపీలు సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఓవెన్ అవసరం లేదు, బేక్ చేయాల్సిన పన్లేదు! - కేక్ సింపుల్‌గా ఇలా తయారు చేసుకోవచ్చు!

చల్ల పునుగులు కావాల్సిన పదార్థాలు
- కప్పు - పుల్లటి పెరుగు
- నీళ్లు - కొద్దిగా
- టీస్పూన్ - జీలకర్ర
- పావు స్పూన్ - వంటసోడా
- రెండు కప్పుల - గోధుమపిండి

టమోటా చట్నీ కోసం కావాల్సిన పదార్థాలు
- పచ్చిమిర్చి - 6
- ఎండుమిర్చి - 2
- టమోటాలు - అరకేజీ
- ఉప్పు - రుచికి సరిపడా
- చిన్న నిమ్మకాయ సైజు - చింతపండు
- టీస్పూన్ - జీలకర్ర
తాలింపు కోసం
- ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు
- పచ్చిశనగపప్పు - టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - టేబుల్‌స్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- కరివేపాకు - 2
- ఎండుమిర్చి - 4
- ఇంగువ - చిటికెడు

చల్ల పునుగులు తయారీ విధానం
- ముందుగా ఒక బౌల్లో కప్పు పుల్లటి పెరుగు తీసుకోండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే పునుగులు అంత రుచిగా ఉంటాయి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు, టీస్పూన్ జీలకర్ర, పావు స్పూన్ వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి
- ఆపై ఇందులో ఒక కప్పు పెరుగుకి రెండు కప్పుల గోధుమపిండి వేసి బాగా కలుపుకోవాలి.
- పిండి కాస్త గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకొని మూడు నిమిషాలపాటు బాగా కలుపుకోండి.
- ఈ విధంగా కలుపుకున్న పిండిపై మూత పెట్టి 2 గంటలపాటు పక్కన పెట్టుకోవాలి.

- అనంతరం స్టవ్‌పై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేయండి.
- ఆయిల్ హీటయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి కొద్దికొద్దిగా పిండిని తీసుకొని పునుగులు వేసుకోండి.
- చల్ల పునుగులు నూనెలో సరిపడా వేసుకున్నాక, అటూ ఇటూ కలుపుతూ రంగు మారే వరకు వేయించుకోవాలి.
- దోరగా వేయించుకున్న పునుగులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండితో ఇలా సింపుల్‌గా పునుగులు చేసుకుంటే సరి.

టమోటా చట్నీ తయారీ విధానం
- టమోటా చట్నీ కోసం స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి.
- పచ్చిమిర్చి చక్కగా వేగిన తర్వాత టమోటా ముక్కలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- టమోటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
- టమోటా మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ టమోటా చట్నీ ఒక బౌల్లోకి తీసుకోండి.

- ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం స్టవ్‌పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయండి.
- వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి. చివరిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి కలపండి. ఆపై తాలింపుని పచ్చడిలో వేసి కలిపితే సరి!
- ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే టమోటా చట్నీ రెడీ!
- వేడివేడి పునుగులు ఈ టమోటా చట్నీతో ఎంతో బాగుంటాయి!
శనగపిండి లేకుండా "కరకరలాడే జంతికలు" - నూనె పీల్చకుండా క్రంచీగా వస్తాయి !
మైసూర్ పాక్ గుల్లగా రావాలంటే స్వీట్ షాప్ సీక్రెట్ ఇదే! - ఇంట్లో చేశారంటే ఎవ్వరూ నమ్మరు!