ETV Bharat / offbeat

వెన్నలా కరిగిపోయే "బటన్​ బాదుషా" - పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా స్వీట్​ షాప్​ టేస్ట్​ పక్కా!

- చాలా సింపిల్​గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు!

Button Badusha Recipe
Button Badusha Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 1, 2025 at 11:45 AM IST

3 Min Read
Choose ETV Bharat

Button Badusha Recipe at Home: బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, జ్యూసీగా ఉండే బాదుషా అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా అకేషన్​ ఏదైనా స్వీట్స్​లో ఇవి ఫస్ట్​ ప్లేస్​లో ఉంటాయి. అయితే బాదుషాలు అందరికీ తెలిసిందే. కానీ మీరు ఎప్పుడైనా బటన్​ బాదుషాలు తిన్నారా? సేమ్​ బాదుషాలాగానే ఉంటాయి కానీ సైజ్​లో, టేస్ట్​లో కొద్దిగా తేడా ఉంటుంది. మామూలు దానితే పోలీస్తే ఈ బటన్​ స్వీట్​ టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్​ ఈ టిప్స్​ పాటించి ఇంట్లోనే ఈ బటన్​ బాదుషా చేస్తే పాకం కుదరదు అన్న టెన్షన్​ ఉండదు. మరి లేట్​ చేయకుండా ఈ స్వీట్​ రెసిపీని ఎలా చేయాలో ఈ స్టోరీలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • మైదా - 250 గ్రాములు
  • నెయ్యి - 50 గ్రాములు
  • పెరుగు - పావు కప్పు
  • బేకింగ్​ సోడా - అర టీస్పూన్​
  • బేకింగ్​ పౌడర్​ - అర టేబుల్​స్పూన్​
Maida Flour
మైదా పిండి (Getty Images)

పాకం కోసం:

  • పంచదార - 300 గ్రాములు
  • నీళ్లు - 150ml
  • కుంకుమ పువ్వు - చిటికెడు
  • నిమ్మ ఉప్పు - పావు టీస్పూన్​
Sugar
పంచదార (Getty Images)

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నెయ్యి పోసి మరిగించాలి. నెయ్యి కాగిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఓ గిన్నెలోకి పెరుగు, బేకింగ్​ సోడా, బేకింగ్​ పౌడర్​ వేసి మిక్స్​ చేసుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి వేసి పిండిని బాగా కలుపుకోవాలి.
  • పిండిని పెరుగు మిశ్రమంలో కలిపిన తర్వాత కాగిన నెయ్యి వేసి వీలైనంత ఎక్కువ సేపు కలపాలి.
  • ఇలా పిండి, నెయ్యి కలిపిన తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని వీలైనంత మృదువుగా కలుపుకోవాలి.
Button Badusha Recipe
Button Badusha Recipe (ETV Bharat)
  • ఇలా కలుపుకున్న పిండిపై తడి క్లాత్​ వేసి సుమారు అర గంట సేపు పక్కన పెట్టాలి.
  • ఈలోపు పాకం ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పంచదార, నీళ్లు పోసి మరిగించాలి.
  • పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మధ్యమధ్యలో కలుపుతూ జిగురు పాకం వచ్చేలా చూసుకోవాలి.
  • జిగురు పాకం వచ్చిన తర్వాత చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలపాలి. చివరగా నిమ్మ ఉప్పు వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
Button Badusha Recipe
Button Badusha Recipe (ETV Bharat)
  • ముందుగా కలుపుకున్న పిండిని మరో 5 నిమిషాల పాటు సాగదీస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత కుంకుడుకాయ కంటే కాస్త పెద్ద సైజ్​లో ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ ఉండను తీసుకుని రెండు అర చేతుల మధ్య పెట్టి గట్టిగా అదుముతూ రౌండ్​ షేప్​లో చేయాలి. ఇలా చేయడం వల్ల పిండిపై పగుళ్లు ఏర్పడవు.
  • ఆ రౌండ్​ బాల్​ను లైట్​గా ప్రెస్​ చేసి బొటనవేలుతో మధ్యలో నొక్కితే హోల్​ పడుతుంది. దానిని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా ఉండలన్నింటిని బాదుషాలుగా చేసుకుని పక్కన ఉంచాలి.
Button Badusha Recipe
Button Badusha Recipe (ETV Bharat)
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేయాలి. ఆయిల్​ లైట్​గా కాగిన తర్వాత తయారు చేసుకున్న బటన్​ బాదుషాలను సరిపడా కడాయిలో వేయాలి.
  • నూనెలో వేసిన వెంటనే కాకుండా ఓ నిమిషం తర్వాత గరిటెతో తిప్పుతూ మీడియం ఫ్లేమ్​లో లైట్​ గోల్డెన్​ కలర్​ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
  • బాదుషాలు లైట్​ బంగారు రంగు వచ్చిన తర్వాత మంటను హై ఫ్లేమ్​లో పెట్టి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించాలి.
Button Badusha Recipe
Button Badusha Recipe (ETV Bharat)
  • బాదుషాలు రంగు మారిన వెంటనే తీసేసి వేడి పాకంలో వేసి అలానే వదిలేయాలి.
  • ఓ నిమిషం తర్వాత పాకంలో నుంచి తీసేసి వేరే ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన బాదుషాలన్నింటినీ నూనెలో వేయించి పాకంలో కలుపుకోవాలి.
  • ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత ఓ గిన్నెలోకి వేసుకుని సర్వ్​ చేసుకుంటే రసాలూరే బటన్​ బాదుషా రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Button Badusha
బటన్​ బాదుషా (ETV Bharat)

టిప్స్​:

  • నెయ్యి బదులు డాల్డాను కూడా వాడుకోవచ్చు. డాల్డా వేయడం వల్ల బాదుషాలు చాలా రుచిగా ఉంటాయి.
  • పిండిని వీలైనంత మెత్తగా కలుపుకుంటూనే నూనెలో వేసినప్పుడు లోపలి వరకూ ఉడికి పాకాన్ని పీల్చుకుని సాఫ్ట్​గా ఉంటాయి.
  • ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. అయితే దీనిని పాకం మొత్తం ప్రిపేర్​ అయ్యి స్టవ్​ ఆఫ్​ చేసేముందు కలుపుకోవాలి. నిమ్మ ఉప్పు బదులు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
  • బాదుషాలను ముందుగా మీడియం ఫ్లేమ్​లో, ఆ తర్వాత హై ఫ్లేమ్​లో ఫ్రై చేయాలి. అప్పుడే లోపలి వరకూ వేగుతాయి. ముందే హై ఫ్లేమ్​లో పెట్టి చేస్తే తొందరగా రంగు మారతాయి, కానీ లోపల పిండి ఉడకదు.

90's స్పెషల్​ "కొబ్బరి మిఠాయి" - కమ్మని రుచితో తినే కొద్ది తినాలనిపిస్తుంది - పావుగంటలో రెడీ!

మరమరాలతో ముంత మసాలా రొటీన్​ - ఇలా "బర్ఫీ" చేయండి - పాకంతో పని లేకుండా 5 నిమిషాల్లో రెడీ!