ETV Bharat / offbeat

"వంకాయ తక్కాళి" రోటి పచ్చడి - ఒక్కసారి తింటే మీ ఫేవరెట్ లిస్టులో చేరిపోతుంది! - VANKAYA THAKKALI PACHADI

ఎన్నడూ తినని రుచిలో అద్దిరిపోయే వంకాయ పచ్చడి - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

Vankaya Pachadi
Vankaya Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 8, 2025 at 3:13 PM IST

Updated : April 8, 2025 at 8:57 PM IST

2 Min Read

Make Delicious Vankaya Pachadi at Home : వంకాయ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. అయితే, మీరు ఇప్పటివరకు వంకాయలతో ఎన్నో రకాల వంటకాలు ప్రయత్నించి ఉంటారు. కానీ, ఓసారి ఈ కొలతలతో "వంకాయ తక్కాళి పచ్చడిని" ప్రిపేర్ చేసుకొని చూడండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కాస్త వేసుకొని తింటుంటే అద్భుతః అనాల్సిందే. ఒక్కసారి తిన్నారంటే మీ ఫేవరెట్ కర్రీ లిస్టులో చేరిపోతుంది! అంత రుచికరంగా ఉంటుంది ఈ పచ్చడి. అన్నంలోకి మాత్రమే కాదు చపాతీ, రోటీ వంటి వాటిల్లోకి ఇది సూపర్​గా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :

Vankaya Pachadi
Vankaya Pachadi (ETV Bharat)
  • వంకాయలు - మూడు
  • టమాటాలు - మూడు
  • ఉల్లిపాయ - చిన్నది ఒకటి
  • ధనియాలు - 2 స్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • నూనె - ఫ్రైకి సరిపడా
  • ఎండుమిర్చి - ఆరు
  • చింతపండు - కాస్తంత
  • వెల్లుల్లి రెబ్బలు - ఐదు
  • పసుపు - హాఫ్ టీస్పూన్
  • ఉప్పు - తగినంత

కొబ్బరి చట్నీలో ఒక్క గుప్పెడు ఇవి వేస్తే చాలు - రుచి అమోఘంగా ఉంటుంది! - ఈ సారి తప్పక ట్రై చేయండి!

తయారీ విధానమిలా :

  • ఇందుకోసం వంకాయలను కడిగి, కాండం కట్ చేసి, నచ్చిన సైజులో ముక్కలు చేసుకొని ఉప్పు నీటిలో వేసి పక్కన ఉంచాలి.
  • స్టౌ మీద ఒక పాన్ పెట్టి జీలకర్ర, ధనియాలు వేసి సువాసన వచ్చే దాకా వేయించాలి.
  • ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా ఫ్రై చేయాలి. ఇవన్నీ ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనివ్వండి.
  • అదే బాణలిలో కాస్త ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కలను వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలపాలి.
  • మీడియం ఫ్లేమ్ మీద వంకాయలు కొద్దిగా రంగు మారే దాకా వేయించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
  • అదే పాన్​లో మరికొద్దిగా నూనె వేసి చింతపండు, టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే దాకా ఉడికించుకోవాలి.
  • తర్వాత రోలును శుభ్రంగా కడిగి క్లాత్​తో తుడిచి ముందుగా వేయించిన ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచాలి.
  • అనంతరం చింతపండు, టమాటా ముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి.
  • ఆ తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు, ఉల్లి ముక్కలు వేసి, కాస్త పలుకుగా ఉండేలా దంచాలి.

తాలింపు కోసం :

Vankaya Pachadi
Vankaya (Getty Images)
  1. నూనె - రెండు స్పూన్లు
  2. ఆవాలు - హాఫ్ స్పూన్
  3. జీలకర్ర - హాఫ్ స్పూన్
  4. శనగపప్పు - ఒక స్పూన్
  5. ఎండుమిర్చి - రెండు
  6. వెల్లుల్లి రెబ్బలు - మూడు
  7. కరివేపాకు - రెండు రెబ్బలు
  • స్టౌ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేడి చేయండి.
  • ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేసి ఫ్రై చేయాలి.
  • ఈ తాలింపుని పచ్చడిలో కలిపితే చాలు. ఎంతో టేస్టీగా ఉండే "వంకాయ తక్కాళి పచ్చడి" రెడీ!

ఈ టిప్స్​తో మరింత రుచికరం :

  • మసాలా దినుసులను వేయించేటప్పుడు లో-ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • ఈ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో రుబ్బుకుంటేనే టేస్టీగా వస్తుంది.
  • నీలం రంగు లేదా తెల్ల వంకాయలు చక్కగా ఉంటాయి.

జనాలు క్యూ​ కట్టే "రామేశ్వరం కేఫ్ దోశ" మీ ఇంట్లో! - ఇంకా అద్దిరిపోయే "గన్​ పౌడర్​" - ఈ కొలతలతో చేసుకోండి!

ఈ 'వేస్ట్ టు టేస్ట్' రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? - రొటీన్ కూరలను మించిన టేస్ట్! - ప్రిపరేషన్ ఈజీ!

Last Updated : April 8, 2025 at 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.