Bread Egg Tikki Recipe in Telugu : ఈవెనింగ్ స్నాక్స్ అనగానే మనందరికీ కారపూస, జంతికలు, చెక్కలు వంటివి గుర్తుకొస్తుంటాయి. కాస్త పని లేకుండా తీరిక ఉంటే మహిళలు ఇంట్లో వాళ్ల కోసం వేడివేడిగా పకోడీలు, మిర్చీ బజ్జీలు చేసి పెడుతుంటారు. అయితే, రొటీన్‌గా ఈ స్నాక్స్ అందరూ చేస్తారు. ఇప్పుడు మనం ఎగ్స్, బ్రెడ్‌తో టేస్టీగా టిక్కీలు ఎలా చేయాలో చూద్దాం. ఈ ఎగ్ టిక్కీలను అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి సులభంగా ఎగ్ టిక్కీలను ఎలా చేయాలో తెలుసుకుందాం.
కర్రీ పాయింట్ వాళ్లు చేసే "తోటకూర కర్రీ" - ఆకుకూరలు తినని వాళ్లు కూడా ఇష్టంగా తింటారు!

కావాల్సిన పదార్థాలు
- గుడ్లు - 3
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ ముక్కలు
- బ్రెడ్ స్లైసెస్ - 2
- పావు టీస్పూన్ - ధనియాల పొడి
- పావు టీస్పూన్ - చాట్ మాసాలా
- పావు టీస్పూన్ - పెప్పర్ పౌడర్
- పావు టీస్పూన్ - జీలకర్ర పొడి
- కొద్దిగా గరం మసాలా
- బ్రెడ్ క్రంప్స్ - అరకప్పు
- పచ్చిమిర్చి తరుగు - టేబుల్‌స్పూన్
- కరివేపాకు - 2
- కొత్తమీర తరుగు

తయారీ విధానం
- ముందుగా 2 కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసుకోండి. గుడ్లు ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో 2 బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి.
- బాయిల్డ్ ఎగ్స్ గ్రేటర్ సహాయంతో ఒక బౌల్లోకి తరుముకోవాలి. ఇందులో గ్రైండ్ చేసిన బ్రెడ్ పొడి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
- ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ చొప్పున ధనియాల పొడి, చాట్ మసాలా, పెప్పర్, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కారం వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చిలకరించుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి.

- ఆపై చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని టిక్కీ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇప్పుడు చిన్న గిన్నెలో 1 గుడ్డు పగలగొట్టి బాగా బీట్ చేయండి. అలాగే మరొక గిన్నెలో బ్రెడ్ క్రంప్స్ పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి.
- ఆయిల్ వేడయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. ఇప్పుడు ఎగ్ టిక్కీ ముందుగా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రంప్స్తో కోటింగ్ చేయండి. ఈ ఎగ్ టిక్కీని వేడివేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

- ఆయిల్లో వేయించడానికి సరిపడా టిక్కీలు వేసిన తర్వాత నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన ఎగ్ టిక్కీలను ప్లేట్లోకి తీసుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఎగ్ టిక్కీలు రెడీ!
వేడివేడిగా ఈ ఎగ్ టిక్కీలు టమోటా సాస్‌తో ఎంతో రుచిగా ఉంటాయి. ఎగ్ టిక్కీ స్నాక్ రెసిపీ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇలా ట్రై చేయండి!
హెల్దీ "సజ్జ లడ్డూలు" - తాటి బెల్లంతో కలిపి ఇలా చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!
రవ్వతో "చిట్టి చిట్టి జంతికలు" - కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి!