ETV Bharat / offbeat

ఈ చిన్న టిప్స్ పాటించండి - దుప్పట్లు ఉతకకున్నా దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంటాయట!

చలికాలంలో వెచ్చదనం కోసం మందపాటి దుప్పట్లు వాడుతున్నారా? - ఈ టిప్స్ పాటించారంటే వాటిని ఉతకకుండా శుభ్రంగా ఉంచుకోవచ్చట!

TIPS FOR BLANKETS CLEANING
blankets Cleaning Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 7:54 PM IST

Blankets Cleaning Tips for Winter : చలికాలం స్టార్ట్ అయిపోయింది. వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల కారణంగా సాయంత్రం కాగానే శీతల గాలుల ప్రభావం పెరుగుతోంది. ఫలితంగా చలి తీవ్రత ఎక్కువవుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది రాత్రిపూట చలి నుంచి వెచ్చదనం పొందేందుకు ఎక్కడెక్కడో వార్డ్​ రోబ్స్​, అల్మరాలలో దాచిన దుప్పట్లు, మందంగా ఉండే రగ్గులు, బెడ్​షీట్స్ బయటకు తీస్తుంటారు. అయితే, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.

కానీ.. మందంగా ఉండే దుప్పట్లు, బ్లాంకెట్స్ వంటివి తరచుగా శుభ్రం చేయాలంటే కాస్త కష్టమైన పనే! పైగా చలికాలంలో వాటిని ఉతికినా సరిగ్గా ఆరవు. కాబట్టి, శీతాకాలంలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా దుప్పట్లను ఉతకకున్నా శుభ్రంగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు, వాటి నుంచి దుర్వాసన కూడా రాకుండా చూసుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వారానికి ఒకసారి ఇలా చేయాలట : చలికాలంలో దుప్పట్లను ఉతకకున్నా శుభ్రంగా ఉండాలంటే.. వాటిని వారానికి ఒకసారి ఎండలో ఆరబెట్టేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వాటిలోని బ్యాక్టీరియా, దుమ్ము కణాలు నశిస్తాయి. ఫలితంగా దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంటాయంటున్నారు నిపుణులు.

బేకింగ్ సోడా : దుప్పట్ల నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టడంలో బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. దీనికోసం బెడ్​షీట్స్​పై కొద్దిగా బేకింగ్ సోడాను చల్లి కొన్ని గంటల తర్వాత వాక్యూమ్ క్లీనర్ లేదా చేతితో శుభ్రంగా దులిపి వాడుకోవాలట. యూజ్ చేసే ముందు బేకింగ్ సోడా పూర్తిగా తొలగించుకోవాలనే విషయం మర్చిపోవద్దంటున్నారు.

వాక్యూమ్ క్లీనర్​తో ఇలా చేయండి : వాష్ చేయకున్నా బెడ్​షీట్స్ శుభ్రంగా ఉండడానికి వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేయవచ్చు. దీంతో వాటిని క్లీన్ చేసుకోవడం చాలా సులువు. కాకపోతే తక్కువ సెట్టింగ్​లో వాక్యూమ్ క్లీనర్​ని ఉపయోగించి దుప్పట్లను శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా వాటికి ఉన్న దుమ్ము, ధూళి ఈజీగా తొలగిపోయి నీట్​గా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.

ఈ స్ప్రేతో దుర్వాసనకు చెక్ : దుప్పట్ల నుంచి దుర్వాసన వస్తున్నట్లయితే ఫాబ్రిక్ ఫ్రెషనర్ స్ప్రే యూజ్ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. దీన్ని స్ప్రే చేయడం ద్వారా వాటి నుంచి వచ్చే బ్యాడ్​ స్మెల్​కు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు.

కవర్ వాడండి : బ్లాంకెట్స్​ ఉతకకున్నా శుభ్రంగా ఉండాలంటే కవర్స్ వాడాలట. దీని ద్వారా వాటికి నేరుగా దుమ్ము, మురికి అంటుకోవు. కాబట్టి, దుప్పట్లను యూజ్ చేయనప్పుడు వాటిపై ఎప్పుడూ కాటన్ లేదా మైక్రోఫైబర్ కవర్​ను ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. పైగా వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసుకోవచ్చంటున్నారు.

డ్రై క్లీనింగ్ పౌడర్ : దీంతో కూడా మందపాటి బెడ్​షీట్స్​కు అంటిన మరకలు, దుమ్మును తొలగించుకోవచ్చట. దీనికోసం వాటిపై కొద్దిగా డ్రై క్లీనింగ్ పౌడర్ చల్లి కొంత సమయం తర్వాత దులుపుకోవాలట. అదేవిధంగా దుప్పట్లను ఎప్పుడూ ఒకేవైపు వాడకుండా ప్రతీ వారం తిరగేసి వేర్వేరు వైపుల నుంచి యూజ్ చేస్తుండాలి. ఇలా చేయడం ద్వారా కూడా అవి శుభ్రంగా ఉంటాయంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

మీకు ఎంతో ఇష్టమైన డ్రెస్​ రంగు పోతోందా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుపు తగ్గదు!

ఆ చీరలను ఎలా ఉతకాలో తెలుసా? - ఇలా చేస్తే మరకలు ఈజీగా పోతాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.