Best Diy Hand Scrubs for Soft Hands : మనం రోజూ నీటితో చేసే వివిధ పనుల కారణంగా చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోయి అందవిహీనంగా కనిపిస్తుంటాయి. చలికాలం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, చేతులు పొడిబారి.. నిర్జీవంగా మారడం వల్ల దురద, మంట పుట్టడం, అలర్జీలు.. వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, వీటి నుంచి బయటపడాలంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో స్క్రబ్స్ తయారుచేసుకొని వాడితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ.. చేతుల్ని మృదువుగా, అందంగా మార్చే ఆ న్యాచురల్ స్క్రబ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
చక్కెర : పొడిబారిన చేతులను కోమలంగా మార్చడంలో ఈ స్క్రబ్ చాలా బాగా సహకరిస్తుంది. ఇందుకోసం ఒక చిన్న బౌల్లో 2 టేబుల్‌స్పూన్ల చక్కెర, ఐదారు చుక్కల విటమిన్ ‘ఇ’ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని చేతులు, మణికట్టుపై అప్లై చేసి మూడు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. అనంతరం గోరువెచ్చటి వాటర్‌తో వాష్ చేసుకుంటే చాలు. విటమిన్ ‘ఇ’ డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేసి తిరిగి ప్రకాశవంతంగా మార్చుతుందంటున్నారు నిపుణులు.
ఓట్‌మీల్ పొడి : ఈ హోమ్మేడ్ స్క్రబ్ కూడా చర్మాన్ని తేమగా, మృదువుగా మార్చడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు. దీనికోసం ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్‌స్పూన్ ఓట్‌మీల్ పొడి, అర టేబుల్‌స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆపై దాన్ని చేతులు, మణికట్టుపై మాస్క్‌లా అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకుంటే చాలు. దీన్ని డైలీ ప్రయత్నించవచ్చు.
టమాటా+ఓట్‌మీల్ పొడి : ఇదీ చర్మాన్ని కోమలంగా మార్చడంలో చాలా బాగా ఉపకరిస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక టమాటాను రెండు ముక్కలుగా చేసుకోవాలి. అనంతరం ఒక ముక్కను ఓట్‌మీల్ పొడిలో అద్ది దాంతో చేతిపై, మణికట్టుపై పావుగంట పాటు మసాజ్ చేసుకోవాలి. ఆపై మరో టమాటా ముక్కను ఇంతకుముందులాగే ఓట్‌మీల్ పొడిలో ముంచి మరో చేతిపై మర్దన చేసుకోవాలి. తదుపరి చల్లటి వాటర్ వాష్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు.
అరటిపండు : అన్నికాలాల్లో విరివిగా లభించే అరటిపండుతోనూ స్క్రబ్స్ తయారుచేసుకొని ఉపయోగించచ్చు. ఇందుకోసం బాగా పండిన అరటిపండ్ల ముక్కలు లేదంటే పండ్ల తొక్కల్ని కూడా యూజ్ చేయవచ్చు. మీరు తీసుకునే వాటిని చక్కెరలో అద్ది.. దాంతో చేతుల్ని స్క్రబ్ చేసుకుంటే చాలు చక్కటి ఫలితం ఉంటుంది.
ఇవేకాకుండా.. ఒక గిన్నెలో టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, కొబ్బరి నూనె, పావు కప్పు చొప్పున చక్కెర, ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకొని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్‌ని గాలి చొరబడని జార్‌లో స్టోర్ చేసుకోవచ్చు. డైలీ కొద్దిగా ఈ స్క్రబ్ మిశ్రమాన్ని తీసుకొని చేతులకు, మణికట్టుపై రెండు నిమిషాల పాటు మర్దన చేసుకొని, గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు.
ఇవీ చదవండి :
కాఫీ తాగడం కాదు - ఒంటికి పూసుకోండి - అందంగా మెరిసిపోండి!
మెడపై ముడతలు ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయా? - ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతాయి!