ETV Bharat / offbeat

పీరియడ్స్ టైమ్​ టూ టైమ్ రావాలంటే ఈ ఒక్క కర్రీ చాలట! - అది ఏంటి? ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో తెలుసా? - Food to Avoid Irregular Periods

Best Food to Avoid Irregular Periods: మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో.. పీరియడ్స్ ఒకటి​. ముఖ్యంగా చాలా మందికి పీరియడ్స్​ సకాలంలో రావు. దీనికి హార్మోన్​ ఇన్​బ్యాలెన్స్​ ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అయితే, అలాంటి టైమ్​లో ఈ కర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే తక్షణమే మంచి రిజల్ట్ ఉంటుందంటున్నారు నిపుణులు. మరి, ఆ కర్రీ ఏంటి? దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 5:11 PM IST

Home Remedy For Regular Menstruation
Best Food to Avoid Irregular Periods (ETV Bharat)

Best Food to Avoid Irregular Periods as per Ayurveda: ఈరోజుల్లో చాలా మంది మహిళలు పీరియడ్స్ ప్రాబ్లమ్స్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలసరి సక్రమంగా రాకపోవడం, బ్లీడింగ్ సరిగా కాకపోవడం వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. దీని కారణంగా శరీరంలో అంతర్గతంగా పలు ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. అంతేకాదు.. పీరియడ్స్(Periods) టైమ్​కు రాకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరి మీరూ ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? అయితే, నేచురల్​గా ఈ ప్రాబ్లమ్​ను తగ్గించుకోవచ్చంటున్నారు ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ఇప్పుడు చెప్పబోయే కర్రీని మీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ, ఆ కర్రీ ఏంటి? కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏవిధంగా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పీరియడ్స్ సక్రమంగా రావడానికి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ఆ కర్రీ పేరు.. పచ్చిబొప్పాయి కూర. దీన్ని నెలసరి సమస్య ఉన్న వారు వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు డాక్టర్ గాయత్రీ దేవీ. తరచుగా ఈ కర్రీని తీసుకుంటున్నట్లయితే నెలసరి సమస్య ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత తగ్గి నెలనెలా పీరియడ్స్ సక్రమంగా రావడానికి దోహదపడుతుందంటున్నారు. ఎందుకంటే.. బొప్పాయికి(Papaya) శరీరంలో వేడిని పుట్టించి నెలసరి సక్రమంగా వచ్చేలా చేసే గుణం ఉంటుందని చెబుతున్నారు. ఇకపోతే ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చిబొప్పాయి - 1
  • చింతపండు - మీడియం సైజ్​ నిమ్మకాయంత
  • నువ్వుల నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • జీలకర్ర - 1 టేబుల్​స్పూన్
  • ఆవాలు - 1 టేబుల్​స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఇంగువ - చిటికెడు

పీరియడ్స్​ నొప్పుల కోసం మందులా? - వద్దే వద్దు - ఇలా చేస్తే ఫుల్ రిలీఫ్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక పచ్చి బొప్పాయిని తీసుకొని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసుకోవాలి. ఆపై అందులో ఒక సగం తీసుకొని చెక్కుతో సహా పచ్చిగా ఉండే భాగాన్ని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నువ్వుల నూనె వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి కలుపుకుంటూ కాసేపు వేయించుకోవాలి.
  • తాళింపు వేగాక.. బొప్పాయి తురుమును అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి బొప్పాయి తురుము మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
  • అది ఉడికేలోపు మీరు దాంట్లోకి కావాల్సిన చింతపండును ఒక చిన్న బౌల్​లో నానబెట్టుకోవాలి. అదే విధంగా కొన్ని ఆవాలను కొంచం వాటర్ వేసుకొని నూరి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు బొప్పాయి మిశ్రమం ఉడికిందనుకున్నాక.. చింతపండు రసం, ఆవాల పేస్ట్ వేసుకొని కలుపుకొని మరికాసేపు కర్రీని ఉడకనివ్వాలి.
  • ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక చివరగా.. కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు ఉంచి దించుకుంటే చాలు. అంతే.. నెలసరి సక్రమంగా రావడానికి తోడ్పడే బొప్పాయి కర్రీ రెడీ!

పీరియడ్స్ టైమ్​లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!

నెలసరి ముందు సమస్యలా? ఈ టిప్స్​తో అన్నీ మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.