Benefits of Used Tea Bags: ఉదయం లేవగానే వేడివేడి చాయ్ ఓ కప్పు తాగందే రోజు మొదలవదు చాలా మందికి. ఇక ఒత్తిడి సమయాల్లో, పని మధ్యలో రిలాక్సేషన్ కోసం ఓ కప్పు టీ పడితేనే సెట్ అవుతారు మరికొందరు. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేందుకు అనువుగా టీ బ్యాగులను ఉపయోగిస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, వాడేసిన టీ బ్యాగుల్ని ఏం చేస్తున్నారు? అంటే మెజార్టీ జనం చెప్పే ఆన్సర్ 'పారేస్తున్నాం'. అయితే ఉపయోగించిన టీ బ్యాగులను పడేసే బదులు ఇలా వాడితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అద్దాల మెరుపుదనం: మెజార్టీ ఇళ్లల్లో గాజు ఉపరితలాలైన అద్దాలు, కిటికీలు, వంట పాత్రలు వంటివి ఉంటాయి. కాగా వీటిని క్లీన్ చేయడానికి చాలా మంది క్లీనర్స్ ఉపయోగిస్తుంటారు. అయితే వీటి బదులు వాడేసిన టీ బ్యాగ్స్‌తో ఈ గాజు ఉపరితలాలు క్లీన్ చేస్తే మరకలు, మురికీ అన్నీ వదిలి తళతళలాడతాయని నిపుణులు చెబుతున్నారు.
మొక్కలు ఆరోగ్యంగా: ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే సారవంతమైన మట్టి కావాలి. సమయానికి ఎరువులు వేయాలి. అప్పుడే అవి బాగుంటాయి. అయితే ఈ ఫలితాలన్నింటినీ వాడేసిన టీ బ్యాగులు లేదా టీ పొడిని ఉపయోగించి పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. టీ పొడిని మట్టిలో కలిపేయడమో లేదా మొక్క చుట్టూ చల్లడమో చేస్తే చాలంటున్నారు.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం: చాలా మందిలో జుట్టు పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్యకు వాడేసిన టీ బ్యాగులు మేలు చేస్తాయని చెబుతున్నారు. షాంపూతో తలస్నానం చేశాక వాడేసిన టీ బ్యాగులోని మిశ్రమాన్ని తీసి తలకు రాసి ఓ పది నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడిగేయమంటున్నారు. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుందని అంటున్నారు.
డార్క్ సర్కిల్స్‌కు చెక్: చాలా మంది డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బందిపడుతుంటారు. వాటిని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కళ్లకింద నలుపుదనం తగ్గడానికి ఈ టీ బ్యాగుల్ని ఉంచితే, క్రమంగా ఇవి తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
దుర్వాసన పోగొట్టేందుకు: ఫ్రిజ్‌లో రకరకాల ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంటాం. అయితే ఈ ఆహార పదార్థాల వల్ల ఒక్కోసారి ఘాటైన వాసనలు వస్తుంటాయి. వాటిని దూరం చేయడానికి ఈ టీ బ్యాగులు హెల్ప్ అవుతాయని అంటున్నారు. ఓ కప్పులో రెండు మూడు వాడేసిన పొడి టీ బ్యాగుల్ని ఉంచి అందులో పెడితే ఆ వాసనను ఇవి పీల్చేసుకుంటాయని చెబుతున్నారు.
ఎయిర్ ఫ్రెష్నర్గా: ఇంట్లో పరిమళాలు వెదజల్లే ఎయిర్ ఫ్రెష్నర్గానూ ఈ టీ బ్యాగులను వాడొచ్చని చెబుతున్నారు. ఇందుకోసం వాడిని బ్యాగులను పూర్తిగా ఎండబెట్టాలి. ఆ తర్వాత ఈ బ్యాగుల్లో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి మీకు నచ్చిన చోట్ల వీటిని పెడితే సరి. చక్కటి సువాసనలను వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
ఫర్నిచర్ మెరవడం కోసం: కాసిన్ని నీళ్లలో వాడేసిన టీ బ్యాగులను వేసి రెండు నిమిషాలపాటు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చాలి. ఇప్పుడు శుభ్రమైన మెత్తటి వస్త్రాన్ని ఈ నీటిలో ముంచి ఫర్నిచర్‌ను తుడవాలి. ఆ తరువాత పొడి వస్త్రంతో తుడిస్తే ఫర్నిచర్ కొత్త దానిలో మెరుస్తుంది.
టవల్ ఎన్ని రోజులకోసారి ఉతికేస్తున్నారు? - పరుపు పరిస్థితి ఏంటో ఆలోచించారా!
దువ్వెన జిడ్డుగా, నల్లగా మారిపోయిందా? - ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా తళతళా మెరుస్తుంది!
సాయంత్రం కాగానే ఇంట్లోకి దోమలు వస్తున్నాయా? - ఇలా చేస్తే ఒక్కటి కూడా రావు!